సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. కాగా, ఈ ఎపిసోడ్‌పై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక, గురువారం మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఇక, రాజేంద్రనగర్ ఏసీపీ ఆఫీసులో సిట్ కార్యాలయం సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్‌మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment