Bandi Sanjay Comments On CM KCR Farmhouse MLAs Video - Sakshi
Sakshi News home page

వీడియోలో అమిత్‌షా పేరు చెబితే.. సంబంధం ఉన్నట్టేనా: బండి సంజయ్‌ సీరియస్‌

Published Fri, Nov 4 2022 5:57 PM | Last Updated on Fri, Nov 4 2022 6:23 PM

Bandi Sanjay Comments On CM KCR Farmhouse MLAs Video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దల హస్తం ఉందంటూ సీఎం కేసీఆర్‌ మీడియా వేదికగా కొన్ని వీడియోలు బయటపెట్టారు. ఈ వీడియోలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. 

తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌తో కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేసీఆర్‌ చూపించిన వీడియోల్లో ఏమీలేదు. ఫస్ట్‌ షో.. సెకండ్‌ షో అన్నాడు. చివరికి కామెడీ షో అ‍యింది. కేసీఆర్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్‌ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారు. లిక్కర్‌ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగొచ్చు. 

ఈ ఎపిసోడ్‌ అంతా పెద్ద డ్రామా. ఫామ్‌హౌస్‌ స్క్రిప్ట్‌ అంతా ఢిల్లీలోనే తయారైంది. కేసీఆర్‌ ఢిల్లీ నుంచి రాగానే సీఎస్‌, డీజీపీని పిలిపించాడు. వాళ్లకు ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌ మొత్తం వివరించారు. ఫామ్‌హౌస్‌లో నేనింతే.. నా బతుకు ఇంతే అనే సినిమా తీశారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆ నలుగురు ఆణిముత్యాలను మాత్రం ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. 

ఈ ఎపిసోడ్‌లో డబ్బులు ఎక్కడా చూపించలేదు. 26న ఘటన జరిగితే.. సాక్షుల సంతకాలు 27న ఎలా తీసుకుంటారు?. ఇదంతా ప్లాన్‌ ప్రకారం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే నడిచింది. అమిత్‌షా పేరు చెప్పినంత మాత్రాన ఆయనతో సంబంధాలు ఉన్నట్లేనా?. తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement