సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ఇప్పటికే నిందితులను సిట్ విచారణ వేగవంతం చేసింది.
ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోహిత్ రెడ్డి. తనకు యూపీ, గుజరాత్‌కు చెందిన 11 నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను హత్య చేస్తామంటూ బెదిరించనట్టు రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్స్ రికార్డు చేసింది సిట్ బృందం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. నిందితులు ఎలా సంప్రదించారనే కోణంలో సిట్ విచారణ చేపట్టింది. రూ. 100 కోట్ల డీల్‌పై ఫాంహౌస్‌లో ఏం మాట్లాడారనే అంశంపై విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment