![Telangana High Court Hearing On MLA Rohit Reddy Petition - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/28/Telangana-high-court.jpg.webp?itok=xP6rUxaL)
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ హైకోర్టులో రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘మనీలాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఆర్ చట్ట విరుద్ధం. పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు.. ఇక్కడ డబ్బు ఎక్కడా లభ్యం కాలేదు’’ అని రోహిత్‌రెడ్డి తరఫు లాయర్ పేర్కొన్నారు.
నిన్న ఈడీ విచారణకు రావాలని రోహిత్‌రెడ్డి నోటీసులు ఇచ్చామని, విచారణకు రాకపోవడంతో 30న మళ్లీ రావాలని నోటీసులు ఇచ్చామని ఈడీ తెలిపింది. సమన్లలో అడిగిన అన్ని వివరాలు ఇచ్చామని ఈడీ పేర్కొంది. వాదనలు విన్న హైకోర్టు.. ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఈడీలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కి కోర్టు వాయిదా వేసింది.
చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment