Rohit reddy
-
నేడో, రేపో సీన్ రీ కన్స్ట్రక్షన్!
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను సిట్ విచారించింది. రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితీష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్‌శర్మను మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని బందోబస్తు మధ్య శంషాబాద్ ఠాణాకు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. మొదట రోహిత్‌రెడ్డితో ప్రారంభించి, ముగ్గురిని వేర్వేరుగా విచారించారు.సిట్ బృందం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు మధ్యాహ్నం శంషాబాద్ ఠాణాకు వచ్చి నిందితులను స్వయంగా విచారించారు. వేర్వేరుగా ముగ్గురిని విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులతో పార్టీలు మాత్రమే జరుగుతుంటాయని రోహిత్‌రెడ్డి అడ్వొకేట్ శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో తెలిపారు. పాత సంఘటలను కాకుండా ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాత్రమే విచారించాలని కోర్టు సూచించినట్టు చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు, కాల్పుల వ్యవహారంపై ఆరా కాల్పుల వ్యవహారం, డ్రగ్స్ కొనుగోలు అంశాలపై సిట్ అధికా రులు నిందితులను ప్రశ్నించినట్టు తెలిసింది. డ్రగ్స్ ఎక్కడ కొను గోలు చేశారు.. ఎవరు సరఫరా చేశారు.. డ్రగ్స్ పార్టీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి వంటి ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కాల్పుల వ్యవహారంపై నమిత్‌శర్మను ప్రశ్నించి పలు విషయాలు తెలుసు కున్నారు. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసింది రోహిత్‌రెడ్డే కావడంతో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విచారణలో నాలుగు కొత్త పేర్లు బయటకొచ్చినట్టు సమాచారం. మిగిలిన రెండు రోజుల విచారణలో డ్రగ్స్ మూలాలకు సంబంధించిన వివరా లను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
పొంతన లేని సమాధానాలు!
మొయినాబాద్: ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆరో రోజు ఆదివారం సిట్ విచారణ జరిగింది. స్టేషన్ బెయిల్ పొందిన వారిలో ఏడుగురు నిందితులు విచారణకు హాజరయ్యారు. వారిని వేర్వేరుగా విచారించారు. విచారణలో కొందరు నిందితులు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారిని పదేపదే విచారించి అసలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా, పెడ్లర్లపై దృష్టి సారించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను కస్టడీకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు బయటకొస్తాయని.. కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు వెళ్తుందని పోలీసులు భావిస్తున్నారు.కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పుడ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మ కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు వరుస సెలవులు ఉండటంతో కస్టడీ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది. -
రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ సీజ్?
మొయినాబాద్, శంషాబాద్ రూరల్ : ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ పార్టీలో గన్ ఫైరింగ్ చేయడంతో ఇప్పటికే రోహిత్‌రెడ్డితోపాటు అతని తమ్ముడు రితీష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మను పోలీసులు జైలుకు పంపారు. డ్రగ్స్ మూలాలపై దృష్టి పెట్టిన పోలీసులు ఫాంహౌస్ కేంద్రంగా ఏయే రకాల దందాలు కొనసాగుతున్నాయనే విషయాలను వెలికితీస్తున్నారు.మరో వైపు అసైన్డ్ భూమిలో ఉన్న రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్ చేసేందుకు లేఖ రాస్తామని పోలీసులు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రెవెన్యూ అధికారులకు లేఖ అందే అవకాశం ఉంది. మూడో రోజు సుదీర్ఘ విచారణ.. మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో స్టేషన్ బెయిల్ పొందిన నిందితులను సిట్ అధికారులు మూడో రోజు సుదీర్ఘంగా విచారణ చేశారు. స్టేషన్ బెయిల్ పొందిన ఎనిమిది మందిలో ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు గురువారం మూడో రోజు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 11 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది? ఎవరు సరఫరా చేశారు? రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఎంత కాలం నుంచి డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి? వీటికి ఎవరిని పిలిచారు? శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రధానంగా ఏం చర్చించాలనుకున్నారు? అనే విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ్రపాంతాలకు చెందిన 11 మంది డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారంటే వీరి మధ్య ఎలాంటి బిజినెస్ డీల్ జరిగిందనే కోణంలో ఆరా తీశారు. ప్రధానంగా డ్రగ్స్ మూలాలపైనే సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్‌శర్మలను కస్టడీకి తీసుకుంటే అసలు విషయాలు బయటకొస్తాయని ఓ అధికారి తెలిపారు. ఫాంహౌస్ సీజ్ చేసే అవకాశం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 177/33లో ఉన్న 3.39 ఎకరాల భూమిలో రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ ఉంది. ఈ భూమిని ప్రభుత్వం అంతంగారి జంగయ్యకు అసైన్డ్ చేసింది. కొంత కాలం క్రితం రోహిత్‌రెడ్డి తన తండ్రి విఠల్‌రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేశారు. అయితే రెవెన్యూ రికార్డులో ఇప్పటికీ అంతంగారి జంగయ్య పేరుతోనే కొనసాగుతోంది. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ నిర్మించి అందులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు తోపాటు డ్రగ్స్ పార్టీ, గన్ ఫైరింగ్ వంటి వివాదాలకు ఈ ఫాంహౌస్ కేంద్ర బిందువుగా మారడంతో సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేడే.. డ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, నమిత్‌శర్మను ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్‌పై రాజేంద్రనగర్ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. దీనిపై బుధవారం వాదనలు జరగడంతో తీర్పును శుక్రవారానికి రిజర్వు చేశారు. శుక్రవారం కోర్టు కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది. వారిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపితే కీలక విషయాలు వెలుగుచూస్తాని పోలీసులు సైతం భావిస్తున్నారు. -
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
-
రాజకీయాలు కంటే వివాదాలే ఎక్కువ..!
వికారాబాదు జిల్లా: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏదో ఒక అంశంపై మీడియాలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వచ్చారు. 2016 నుంచి మొదలైన కేసుల పరంపర ఏటా పెరుగుతూ వస్తున్నాయి. మూడేళ్ల క్రితం బెంగళూరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం.. 2022లో మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల ఎర.. మున్సిపల్ ఎన్నికల సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు అధికారులతో గొడవ వంటి అనేక కేసులు ఆయనపై ఉన్నాయి. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో పలు రాష్ట్రాలకు చెందిన తాజా, మాజీ ప్రజా ప్రతినిధులతో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ ఈగల్ టీమ్‌కు పట్టుబటడం రోహిత్‌రెడ్డి వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది. ఇందర్‌చెడ్ గ్రామానికి చెందిన రోహిత్‌రెడ్డి 2008లో క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో మన పార్టీ నుంచి తాండూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 270 ఓట్లతో ఘోరపరాజయం పొందారు. తర్వాత 2011లో టీఆర్ఎస్ పారీ్టలో చేరారు. నాటి నుంచి అందులోనే కొనసాగుతూ వచ్చారు. 2014లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో నాటి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి, రోహిత్‌రెడ్డికి అనేక వివాదాలు ఉండేవి. ఈ క్రమంలో ఆయన్ను పారీ్టలో నుంచి బహిష్కరించారు. 2018లో కాంగ్రెస్ టికెట్ సాధించి పట్నం మహేందర్‌రెడ్డిపై స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. గెలిచిన రోహిత్‌రెడ్డి ఆరు నెలలకే బీఆర్ఎస్ గూటికి చేరారు. వివాదాలతో హైలెట్ 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాటి నుంచి రోహిత్‌రెడ్డి వివాదాలతో హైలెట్‌గా నిలుస్తూ వచ్చారు.. బెంగుళూరు కేంద్రంగా సాగిన డ్రగ్స్ కేసులో.. సోదరుడు రితీష్‌రెడ్డి పబ్‌లో చేసిన గొడవతో.. పట్టభద్రుల ఎన్నికల సమయంలో దొంగ ఓట్ల వివాదం.. 2023లో తాండూరులో నిర్వహించిన రాజశ్యామల యాగం సమయంలో పోలీసు సిబ్బందితో రీల్స్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోలీసు అధికారులతో గొడవ పడ్డారు. ఇలా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారం రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి కోర్టు నుంచి బెయిల్ పొందన తర్వాత బయటకు వచ్చారు. ప్రతి సోమవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి నగరంలో ఉంటున్నారు. రోహిత్‌రెడ్డి ఇలా ప్రతిసారీ ఏదో ఒక అంశంలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వార్తల్లో ఉంటున్నారు. -
ఫామ్‌హౌస్ డ్రగ్స్‌పై సిట్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్/శంషాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా పలువురు హైప్రొఫైల్ వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటంతో ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 9 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్‌బాబు పర్యవేక్షణలో ఈ బృందం పనిచేయనుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. సిట్ దర్యాప్తు సమయంలో కేసు మూలాలను పరిశీలించడంతోపాటు, నేరం జరగడానికి సంబంధించిన అన్ని అంశాలనూ విచారించాలని డీజీపీ పేర్కొన్నారు. పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి ఈ పార్టీ ఎందుకు పెట్టారు? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఒక భారీ డీల్ గురించే మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏపీలోని ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, వారి మిత్రులు కలిసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో రియల్ఎస్టేట్ లావాదేవీలపైనా డ్రగ్పార్టీ మీటింగ్‌లో చర్చించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో పలు రాష్ట్రాల వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉండటం.. ఏకంగా పోలీసులను బెదిరించేందుకు కాల్పులకు తెగబడటంతో వారంతా ఏదో పెద్ద డీల్ గురించే చర్చలు చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. రియల్ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు వీరి మధ్య ఉన్నాయని, సెటిల్మెంట్లలోనూ కలిసి పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో కొంతకాలంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. ప్రధానంగా ఫామ్‌హౌస్ కేంద్రంగా రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న వీకెండ్ పార్టీలు, వాటికి హాజరవుతున్న హైప్రొఫైల్ వ్యక్తులు సహా రోహిత్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై వివరాలు సేకరించనుంది. కేసు విచారణలో రాబట్టాల్సిన కీలక విషయాలపై సిట్ అధికారులు శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సమావేశమయ్యారు. ఈ కేసు మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి.. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు.. డ్రగ్స్ పార్టీ ఎందుకు నిర్వహించారు.. పార్టీ తరువాత వీరంతా ఏం చేయాలనుకున్నారు.. వంటి కీలక విషయాలను విచారణలో రాబట్టాలని చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు పోలీసులపై కాల్పులకు దిగిన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన చేసే వ్యాపారాలు ఏంటి? రోహిత్ రెడ్డితో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరంతా ఎప్పుడైనా కలిశారా..? వీరి మధ్య ఇప్పటివరకు ఏమైనా రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగిందా? ఇలా పలు కోణాల్లో సిట్ వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఫాంహౌస్ సీజ్! పోలీసులు ఇప్పటికే చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ మినహా మిగతా 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అయితే ఈ విచారణకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తోపాటు మరో నలుగురు నిందితులు హాజరు కాలేదు. పుట్టా మహేశ్ తరఫున న్యాయవాది విచారణకు హాజరైనట్లు తెలిసింది. నమిత్‌శర్మకు సంబంధించిన వివరాలతోపాటు పార్టీలో డ్రగ్స్ వినియోగం, కాల్పులకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ వివరాలతో సిట్ బృందం బుధవారం నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. ఏపీకి చెందిన పుట్టా మహేశ్, ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మ సహా పలు రాష్ట్రాలతో లింకులు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోనూ సిట్ దర్యాప్తు చేయనుంది. కాగా, రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన గన్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిట్ అధికారులు ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్‌బాబుకు లేఖ రాశారు. మరోవైపు అసైన్డ్ భూమిలో ఉన్న రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్ చేయాలని సిట్ అధికారులు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. -
పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజు నోటీసులు
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ షోకాజు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై షోకాజు నోటీసులు పంపింది. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గడువు సమయంలో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని షోకాజు నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. డీసీపీ యోగేష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందిరంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. మత్తు కిక్కు కోసమే టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వారి మిత్రులు మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారు. పార్టీని రంజుగా ఎంజాయ్ చేసేందుకే ఖరీదైన పలు బ్రాండ్ల మద్యంతోపాటు కొకైన్ తెప్పించుకున్నారు. పోలీసుల సోదాల అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ టెస్ట్‌లు, అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, నమిత్ శర్మలకు పాజిటివ్ వచ్చింది.నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయింది. పార్టీలో వాడిన కొకైన్‌ను తానే తెచ్చానని కౌశిక్ రవి పోలీసుల ఎదుట అంగీకరించాడు. సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్‌ను ఒక్కో గ్రాము రూ. 15,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ అంగీకరించాడు. -
రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన అజీజ్‌నగర్ ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విందులో వాడిన కొకైన్ ఎవరు సరఫరా చేశారు..? ఎంత కాలం నుంచి ఇక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి..? ఎప్పుడెప్పుడు జరిగాయి? ఎవరెవరు వస్తుంటారు..? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత ఇక్కడ పలుసార్లు విందులు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తాజా ఘటన నేపథ్యంలో నిశిత పరిశీలన చేస్తున్నారు. నెలలో రెండు, మూడుసార్లు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో పార్టీలు నిర్వహిస్తుంటారని తెలుస్తోంది. అప్పుడప్పుడు తప్ప ప్రతిసారీ కొత్త వ్యక్తులే వస్తారనే ప్రచారం ఉంది. ఇలా ఇప్పటివరకు వచి్చనవారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పార్టీలో విదేశీ మద్యం, గాంజా, డ్రగ్స్ వినియోగించారా? ఎక్కడినుంచి వచ్చాయి. ఎవరు తెచ్చారు. ఎవరెవరు తీసుకున్నారు? అనే వివరాలను రాబడుతున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్ పార్టీ, కాల్పుల తర్వాత ఎవరెవరు వచ్చారనేది తెలుసుకునేందుకు గస్తీ కాస్తున్నారు. ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. -
ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్‌పూల్ దగ్గర డ్రగ్స్‌తో పాటు మందు పార్టీ జరిగింది. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లగానే మొదట బుల్లెట్ సౌండ్ వినపడింది. బుల్లెట్ సౌండ్ విని వెంటనే అప్రమత్తమయ్యాం. మేం పోలీసులం కాల్చవద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచాం. మేము చెప్తున్నప్పటికీ కూడా.. పట్టించుకోలేదు. మరో రెండుసార్లు బుల్లెట్ సౌండ్ వినపడింది. మరోవైపు మీరు కాల్పులు జరపండి.. నేను మొత్తం చూసుకుంటా.. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా అరిచేసరికి ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయింది. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్‌హౌస్ సెర్చ్ చేసేందుకు మేము వారెంట్ తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన వెంటనే.. సెర్చ్ వారెంట్లను రోహిత్‌రెడ్డికి ఇచ్చాం. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో.. తుపాకీని మేం స్వాధీనం చేసుకున్నాం.బుల్లెట్ షెల్స్ పట్టుకొని మరొకరున్నారు. అతనిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లో ఓ మహిళతో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని విడివిడిగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదేపదే విచారించడంతో చివరికి శరత్‌కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిని చెక్ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడింది. కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు.పైలెట్ రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. కొకైన్ తానే తెచ్చానని కౌషిక్ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు తానే కొకైన్ తీసుకొని వచ్చానని చెప్పాడు.’అని తెలిపారు. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్‌తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు. -
Hyderabad: ఫాంహౌసుల్లో అసాంఘిక కార్యకలాపాలు
వారాంతపు విడిది కోసమని నిర్మించుకున్న ఫాంహౌస్‌ల్లో చీకటి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. మందు, రేవ్, డ్రగ్స్, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి అపాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడి చేసి గుట్టురట్టు చేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. కొన్ని రకాల సెటిల్మెంట్లు, రాజకీయ నేతల రహస్య భేటీలు సైతం ఫాంహౌసుల్లోనే జరుగుతుండటం విశేషం. హైదారబాద్: నగర శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలామంది ప్రముఖులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారు. అడ్డగోలు దందాలు... ఫాంహౌస్ యజమానులు గెట్టుగెదర్, ఫ్యామిలీ పార్టీలు, బర్త్‌డేలకు రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. అయితే కొందరు నిర్వాహకులు రేవ్, ముజ్రా పార్టీలు, జూదం, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. ప్రముఖుల ఫాంహౌస్‌ల్లో.. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్‌తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు. వెలుగుచూస్తున్న వరుస ఘటనలు కొంత కాలం క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఏడాదిన్నర క్రితం నజీబ్‌నగర్ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్ ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం అజీజ్‌నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి జూదరులను అరెస్టు చేశారు. పది నెలల క్రితం ఎత్‌బార్‌పల్లిలోని ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్, మద్యం, నగదు స్వా«దీనం చేసుకున్నారు. -
ఇది మూడోసారి!
సాక్షి, హైదరాబాద్: ఏలూరు ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత పుట్టా మహేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్న రేవ్ పార్టీతో మెయినాబాద్ అజీజ్‌నగర్‌లో ఉన్న ఫామ్‌హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో ఇది వివాదాస్పదం కావడం ఇది మూడోసారి. కాగా పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో తాజాగా రేవ్ పార్టీకి తోడు కాల్పుల కలకలం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. తొలిసారి..: ఈ ఫామ్‌హౌస్ తొలిసారిగా 2022 అక్టోబర్‌లో వార్తల్లోకి ఎక్కింది. ఆ నెల 26 రాత్రి నిఘా విభాగం, సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న తిరుపతికి చెందిన సింహయాజులు, ఫరీదాబాద్‌లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, హైదరాబాద్ వాసి నందకుమార్‌లను పట్టుకున్నారు. అక్కడ మొదలైన ఈ కథ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు, రోహిత్‌రెడ్డి సహా అనేక మంది విచారణ వరకు వెళ్లింది. ఈ ‘ఎర’కు సంబంధించిన ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు సీబీఐ, సిట్‌ల్లో ఎవరు దర్యాప్తు చేయాలనే అంశంపై ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. మలిసారి..: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ట్యాపింగ్‌పై 2024 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన సిట్ కొన్ని కీలకాంశాలు గుర్తించింది. 2022లో మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ జరిగిన ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చినట్లు తేల్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే ఈ విషయాన్ని నాటి నిఘా వర్గాలు గుర్తించినట్లు సిట్ తేల్చింది. అందుకు అవసరమైన ఉపకరణాలను సైతం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించింది. తాజాగా..: ఈ ఫామ్‌హౌస్‌లో శనివారం మధ్యాహ్నం మొదలైన రేవ్ పార్టీ రాత్రి వరకు కొనసాగింది. ఈగల్, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో రోహిత్‌రెడ్డి, పుట్టా మహేశ్ సహా 11 మంది చిక్కారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పోలీసుల దాడికి ముందు కాల్పులు సైతం చోటు చేసుకోవడంతో ఈ కేసులో మాదకద్రవ్యాల చట్టంతో పాటు ఆర్మ్స్ యాక్ట్‌ను జోడించారు. పుట్టా మహేశ్, రోహిత్ రెడ్డి సహా ఇతర నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. -
చిన్న పార్టీ కాదు.. పెద్ద డ్రగ్స్ మాఫియా
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగింది చిన్న పార్టీ కాదని, అదో పెద్ద డ్రగ్స్ మాఫియా అని, బడా రాకెట్ నడుస్తోందని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ యువతను చెడగొట్టడానికి ఈ డ్రగ్స్ మాఫియా పనిచేస్తోందని విమర్శించారు. ఈ ముఠా వెనుక ఉన్న వారిని ఈగల్ టీం బయటకు లాగుతుందని, త్వరలోనే ఈ రాకెట్లో ఉన్న వారి పేర్లు బయటకు వస్తాయని అన్నారు. ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పదేళ్ల పాటు ఆడిందే ఆట పాడిందే పాటగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని, ఇప్పుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వ్యవహారం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మనోహర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక నిలబడినందుకు తాండూరు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో పెకిలించేలా అందరూ సహకరించాలని, రోహిత్‌రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ వద్ద దిష్టిబోమ్మల దహనం కేటీఆర్‌తోనే తెలంగాణలోనే డ్రగ్స్ కల్చర్ వచ్చిందని రోహిత్‌రెడ్డి వ్యవహారంతో మరోమారు రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు అన్నారు. ఆదివారం ఉదయం గాంధీభవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబోమ్మను దహనం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించాలని, ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం సాయంత్రం గాం«దీభవన్ ఎదుట కేటీఆర్, పైలెట్ రోహిత్‌రెడ్డిల దిష్టిబోమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుర్రం శ్యాంచరణ్‌రెడ్డి, ఎర్రమల్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నితిన్ శర్మ గన్‌తో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అర్మ్స్ ఆక్ట్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నారు. -
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ.. పోలీసులపై ఒత్తిడి మొదలైందా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. వీఐపీలతో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే, పుట్టా మహేష్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్‌ను తప్పించడానికి పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్ పోలీసులపై అప్పడే ఒత్తిడి మొదలైందా?. పుట్టా మహేష్‌ను తప్పించడానికి రాజకీయ, ఆర్థిక బలాలు ఉపయోగిస్తున్నారా?. పుట్టా మహేష్‌ను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారా?. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఆరుగురిపై పోలీసుల నెక్ట్స్ ఎలా ఉండబోతుంది’’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిన్న రాత్రి 7.30 సమయంలో మాకు సమాచారం అందింది. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం. 11మందికి టెస్టులు చేశాం.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మేం లోపలికి వెళ్లేటప్పుడే గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయి. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు గుర్తించాం. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు’’ అని ఎస్పీ స్పష్టం చేశారు. -
మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాలా!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులో ఇన్నాళ్లూ భేతాళ విక్రమార్క కథలు చూశాం! సాక్షుల వాంగ్మూలం పేరుతో సిట్ ద్వారా టీడీపీ పెద్దలు ఆడిస్తున్న నాటకాలు తాజాగా బట్టబయలయ్యాయి! హైకోర్టులో వేసిన పిటిషన్‌తో ఈ విషయం మరోసారి తేలిపోయింది. తాము చెప్పని విషయాలతో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద విచారణ సంస్థ తయారు చేసిన వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ కేసులో సాక్షులు పెనకా శరత్ చంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెనకా రోహిత్‌రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది. తాము చెప్పిన వాస్తవాలను నమోదు చేయకపోవడాన్ని చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో వారిద్దరూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద తాము ఏ వాంగ్మూలాలైతే ఇచ్చామని సీఐడీ చెబుతోందో... వాటిని తాము స్వచ్ఛందంగా ఇవ్వనేలేదని వారు తమ పిటిషన్లో స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారి సాక్షుల వాంగ్మూలాలను వారు చెప్పిన విషయాలను చెప్పినట్లుగా నమోదు చేయాల్సి ఉంటుందని.. అలాగే వాంగ్మూలం ఇచ్చే ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయాల్సి ఉన్నా, అలాంటిదేమీ చేయలేదని తమ పిటిషన్లో కోర్టుకు నివేదించారు. నిష్పాక్షిక దర్యాప్తు అన్నది రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగమన్నారు. దర్యాప్తు ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, దర్యాప్తు నిష్పాక్షికతను పరిరక్షించేందుకు కోర్టు తనకు స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చునని నివేదించారు. మేం చెప్పింది వేరు.. వాంగ్మూలాల్లో ఉన్నది వేరు...మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ అధికారులు గత నెల 13న హైదరాబాద్ వచ్చి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద తమ వాంగ్మూలాలను నమోదు చేశారని పిటిషన్లో తెలిపారు. ల్యాప్‌టాప్‌లో తమ వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు ఈ ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయలేదని పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరిస్తామని, తెలిసిన విషయాలన్నీ చెబుతామని ఆ అధికారులకు చెప్పామన్నారు. ఆ తరువాత తమకు తెలిసిన విషయాలు వారికి చెప్పామన్నారు. రెండు గంటల పాటు వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు, వాటిని ఓసారి చదువుకోవాలని ల్యాప్‌టాప్ తమకు ఇచ్చారని, అందులో ఉన్న వివరాలన్నీ సరైనవేన్నారు. ఇదిలా ఉంటే, గత నెల 16న సోషల్ మీడియాలో తాము ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ ఓ రిపోర్ట్ విస్తృతంగా సర్కూలేట్ అయిందని తెలిపారు. ఆ తరువాత సిట్ అధికారులు నమోదు చేసిన వాంగ్మూలం కాపీని తీసుకుని పరిశీలించామని, విçస్మయకరంగా తాము చెప్పిన దానికి భిన్నమైన విషయాలో ఆ వాంగ్మూలాల్లో ఉన్నాయని శరత్ చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి తమ పిటిషన్లో వెల్లడించారు. ఇవి తాము స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావని స్పష్టం చేశారు. విచారణ అర్హత ఉంది.. సుప్రీం తీర్పులున్నాయి.. శరత్ చంద్రారెడ్డి, రోహిత్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. వ్యాజ్యం విచారణకు రాగానే పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మయాంక్ జైన్ ఈ కేసు గురించి వివరిస్తుండగా.. సీఐడీ, సిట్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలను సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని, దీనిపైనే మొదట వాదనలు వినిపిస్తామన్నారు. దీనిపై మయాంక్ జైన్ ప్రతిస్పందిస్తూ.. విచారణ అర్హత ఉందని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని నివేదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీ, సిట్‌ని ఆదేశించారు. నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ మద్యం విధానంపై అక్రమ కేసులో సాక్షులుగా మారాలని దర్యాప్తు సంస్థ ‘సిట్’ ద్వారా తీవ్ర ఒత్తిళ్లు తెస్తూ.. అందుకు ఒప్పుకోకపోతే వారి కుటుంబ సభ్యులనూ టీడీపీ పెద్దలు వేధించారు. సిట్ ద్వారా ఓ కట్టుకథ అల్లేసి.. సోదాల పేరుతో ఏమార్చే కుట్రలకు దిగారు. వాస్తవాలు, ఆధారాలతో నిమిత్తం లేకుండా.. కోర్టులపై గౌరవం లేకుండా లెక్కలేనితనంతో వ్యవహరించారు. కేసు విచారణ పేరుతో తమకు నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ టీడీపీ పెద్దల కుట్రలకు తలొగ్గారు! అసలు తాను చెప్పని అంశాలను వాంగ్మూలం పేరుతో రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారంటూ ఈ అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి గతంలోనే న్యాయస్థానానికే మొరపెట్టుకోగా.. ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ పెద్దల కనుసన్నల్లో పచ్చ కుట్రలు, కట్టు కథలు ఎలా అల్లారో ఒకసారి పరిశీలిద్దాం..దర్యాప్తు పేరిట వేధింపులు, బెదిరింపులువాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, అనూషలపై ఒత్తిడిమద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తులో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌లను బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే సిట్ ఆధారంగా చేసుకుంది. అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరిస్తూ, సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డిప్యుటేషన్ ముగిసినా కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వకుండా, రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించింది. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడంతో ఆ వెంటనే రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. సత్యప్రసాద్ ఎన్నో ఏళ్లుగా మానసిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తాజాగా వైద్య నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వ్యక్తితో ఇప్పించిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అక్రమ కేసును దర్యాప్తు చేస్తుండటం విస్మయపరుస్తోంది. రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుతంత్రం..!అసలు ఈ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. అసలు విషయం ఏమిటంటే.. రాజ్ కేసిరెడ్డి టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కావడం గమనార్హం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన సన్నిహితుడు కూడా. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగానే.. అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి.. కేశినేని చిన్ని భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ కూడా అన్నది బహిరంగ రహస్యమే! అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీయడం తెలిసిందే. మరి రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. దీంతో ఇదంతా చంద్రబాబు రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. డిస్టిలరీల ప్రతినిధులకు వేధింపులు..అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని టీడీపీ పెద్దలు డిస్టిలరీల ప్రతినిధులను వేధించారు. వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. రూ.11 కోట్ల జప్తు డ్రామారాజ్ కేసిరెడ్డి కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో రూ.11 కోట్లు స్వా«దీనం చేసుకున్నామని సిట్ మరో కట్టుకథ అల్లింది. అయితే ఆ నగదు తనది కాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ కుట్రకథ అడ్డం తిరిగింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా ఎప్పుడు? ఏ బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేశారు? ఆర్బీఐ ద్వారా దీనిపై విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరడంతో సిట్ తోకముడిచింది. వెంకటేష్ నాయుడుకు ప్రలోభాలుఅబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని టీడీపీ పెద్దలు రియల్టర్ వెంకటేశ్ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ఆయన నోట్ల కట్టలను లెక్కిస్తున్నట్లుగా ఓ వీడియోను సెల్‌ఫోన్ నుంచి రిట్రీవ్ చేశామంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారంలోకి తెచ్చింది. ఎన్నికల ఖర్చు కోసం ఆ డబ్బు వినియోగించారని దుష్ప్రచారానికి తెర తీశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్‌రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి.. సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే ఆయనకు ప్రమోషన్ కల్పించి మరీ జీతం పెంచారు. అందుకు సమ్మతించని మదన్‌రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిథున్‌రెడ్డిపై నిరాధార అభియోగాలు..మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ పెద్దలు యత్నించారు. గత ప్రభుత్వంలో మిథున్‌రెడ్డి ఎంపీగా మాత్రమే ఉండగా.. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేకపోవడం గమనార్హం. ఎంపీ మిథున్‌రెడ్డిపై నమోదు చేసిన అభియోగాలు అవాస్తవమని స్పష్టమైంది. ఆయన కంపెనీలోకి అక్రమంగా నిధులు వచ్చాయన్న సిట్ అభియోగాలు న్యాయస్థానంలో తేలిపోయాయి. మిథున్‌రెడ్డి తమ బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని, ఒక్క దానికీ ఆధారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. తప్పుల తడకగా చార్జ్షీట్లు న్యాయస్థానం సాక్షిగా సిట్ అక్రమ అరెస్టుల కుట్రలు బెడిసికొట్టాయి. సిట్ దాఖలు చేసిన మొదటి చార్జ్‌షీట్, అనుబంధ చార్జ్షీట్లను పరిశీలించిన న్యాయస్థానమే వాటి చట్టబద్ధతను ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయస్థానం వ్యక్తం చేసిన 21 అభ్యంతరాలపై సిట్ కనీసం సమాధానం చెప్పలేకపోయింది. దాంతో ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు న్యాయస్థానం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాలతో హడావుడి భేతాళ కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాల పేరుతో హడావుడి చేస్తూ ఏదో ఒక పేరును తెరపైకి తెచ్చి సిట్ ఏమారుస్తోంది. తనిఖీల పేరుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నిస్తోంది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఓ డాక్యుమెంట్‌ను వదలడం.. అందుకు ఎల్లో మీడియా తాన తందానా అంటూ బ్రేకింగ్ న్యూస్‌గా ప్రచారం చేస్తోంది. అక్రమ కేసును నిజమని భ్రమింప చేసే ఎత్తుగడలకు తెర తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ అనిల్‌రెడ్డి కార్యాలయాల్లో సోదాల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యత్నించింది. ఇక ఆయన కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా వ్యవహరించారని ఎల్లో మీడియా దు్రష్పచారం చేసింది. వాస్తవానికి వైఎస్ అనిల్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్ భారతి ఆ కంపెనీల్లో గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసాల్లోనూ తనిఖీల పేరిట సిట్ రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో కొన్ని సందేహాస్పద పత్రాలను ఆయన నివాసంలో చేరవేసేందుకు సిట్ యత్నించడం గమనార్హం. ఆ వాహనంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఉండటంతో అసలు కుట్ర బట్టబయలైంది. రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయని రాజ్ కేసిరెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా భ్రమింపజేసేందుకు సిట్ అక్రమ అరెస్టులకు తెగబడింది. అప్రూవర్‌గా మారి తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ పెద్దలు రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే అరెస్టు చేశారు. అసలు రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయడం ఈ కుట్రకు పరాకాష్ట. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కసిరెడ్డి నిరాకరించారని సిట్ స్వయంగా తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. దీంతో అసలు బండారం బయటపడింది. అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరితెగిస్తోందన్నది ఆ నివేదికే బట్టబయలు చేసింది. -
లగచర్ల ఘటన కుట్ర కాదు.. తిరుగుబాటు: పైలట్ రోహిత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:లగచర్ల ఘటన రైతుల బాధతో జరిగిన తోపులాటే కానీ కుట్ర కానే కాదని బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 16) ఈ విషయమై రోహిత్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘లగచర్ల గ్రామం చుట్టుపక్కల పచ్చని పంటపొలాలు,అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి.ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తోంది. దాడి జరిగిన రోజు కలెక్టర్‌కు పోలీసులు భద్రత ఎందుకు కల్పించలేదు. బాధతో తిరగబడితే రైతులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు.బీఆర్ఎస్ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీకి కొత్తగా భూసేకరణ ఎందుకు.జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనుక మహేందర్ రెడ్డి హస్తం ఉంది.నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్‌రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి,చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి’అని రోహిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లే ఫినిష్ అయ్యారు -
మన పార్టీ వాళ్లే ఓడించారు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం వేదికగా పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. శుక్రవారం జరిగిన చేవెళ్ల సమావేశంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మన వాళ్లే పనిచేశారని ఓడిన నా యకుడు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాండూరు అసెంబ్లీస్థానం నుంచి ఓడిపోయిన పైలట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై సభా వేదికగానే విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. ఓడిన నేతను వేదికపై ఎలా కూర్చోబెడతారు? సమావేశంలో పైలట్ రోహిత్‌రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడాన్ని పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులు తప్పు పట్టడంతో వివాదం రేగింది. ఓడిపోయిన నాయకున్ని స్టేజీ మీద ఎలా కూర్చోబెడతారని, రోహిత్‌రెడ్డిని కిందికి దించాలని మహేందర్‌రెడ్డి వర్గం పట్టుపట్టింది. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, ఆయన వల్లనే ఓడిపోయామని పైలట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారని సమాచారం. ఈ సమయంలోనే మహేందర్‌రెడ్డి కారణంగానే తాను ఓడినట్లు రోహి త్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో మహేందర్ రెడ్డి సైతం రోహిత్‌పై విమర్శలు చేసినట్లు చెబుతున్నారు. ఓ సమయంలో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు అరుచుకుంటూ కుర్చిలు విసిరేసే వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి టి. హరీశ్‌రావు జోక్యం చేసుకొని పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సమావేశంలో గొడవ పడితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరినీ సముదాయించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం: పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానానికి రంజిత్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. రంజిత్‌రెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయించామని, మరోసారి గెలిపిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై కొందరిలో ఆవేదన ఉందని, ఇప్పుడన్నీ సమసిపోయాయన్నారు. ఇల్లు అన్నప్పుడు ఏవో చిన్న చిన్న సమస్యలు సహజమని, అందులో భాగంగానే రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చేవెళ్ల ఎంపీ జి. రంజిత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆరే తన బలం, చేవెళ్ల పార్లమెంట్ ప్రజలే తన బలగమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. -
పట్నం వర్సెస్ పైలట్.. స్వల్ప ఉద్రిక్తత!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది. ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది! చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. -
తాండూరు నియోజకవర్గం BRS అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డితో టుడేస్ లీడర్
-
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దు: కేసీఆర్
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని.. అలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారని సీఎం కేసీఆర్.. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మన గతి కూడా అంతే అవుతుందని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు కోసం 7500 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు 2 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రూ.200 ఉన్న పింఛను రూ. 2వేలు చేశామని, రైతుల బాగోగుల కోసం రైతు బంధు ప్రవేశపెట్టామని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ‘ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ భూమాతను ప్రవదిశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వం చేతిలో రైతుల బతుకు ఉండే. ఇప్పుడు మీ బొటనవేలు పెడితేనే భూ యజమాన్యం మారుతది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్రభుత్వం మీకు ధారపోసిన ఆ అధికారాన్ని పొడగొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణయించుకోవాలి. చదవండి: TSRTC: ఉద్యోగుల జీతాలు కట్.. ఈసీని కలిసిన టీఎస్ఆర్టీసీ జేఏసీ కరవు, వలసలతో గత కాంగ్రెస్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు నేడు తెలంగాణలో లేవు. నీటిపన్ను రద్దు చేశాం. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. 24 గంటల కరెంట్ ఉంటది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్ ఆగమైపోతది. కాబట్టి మీరు రోహిత్‌కు ఓటేయాలి. బీజేపీ నాయకులు నాయకులు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. వారిని పైలట్ రోహిత్‌రెడ్డి పట్టించారు. అందుకే ఆయన ఏ పనులు అడిగినా వెంటనే నిధులు మంజూరు చేశాను. 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారు. దాని వల్ల తాండూరు పరిధిలోని ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మించాంజ’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
మినిస్టర్ ‘పట్నం’
తాండూరు: తాండూరు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి లభించింది. గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. పైలెట్‌కు టికెట్ ఇవ్వడంతో.. కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకోనుండడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నేను మీ బిడ్డను.. ఆశీర్వదించండి : పైలెట్ రోహిత్‌రెడ్డి
వికారాబాద్: నేను మీ బిడ్డను.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామానికి చెందిన వ్యక్తిని.. నన్ను ఆశీర్వదించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీసీసెల్ మండల అధ్యక్షుడు రావులపల్లి చంద్రశేఖర్‌గౌడ్ (ఆర్సీ) ఆధ్వర్యంలో శుక్రవారం 250 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తాండూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాందాస్, నాయకులు ఉమాశంకర్, నరేందర్‌రెడ్డి, హసన్ పటేల్, రఘుగౌడ్, రాములు, విజయ్ ఉన్నారు. తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. మారుమూల పల్లెలతో పాటు గిరిజన తండాలను నూతన పంచాతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల ధారుని వాగు తండాకు చెందిన బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మొగానాత్ పవర్.. ఎమ్మెల్యే సమక్ష్యంలో బీఆర్ఎస్లో చేరారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పెద్దేముల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గొర్రెల పంపిణీ చేపట్టండి.. రెండోవిడత గొర్రెల పంపిణీని త్వరగా ప్రారంభించాలని శ్రీ మల్లికార్జున ప్రాథమిక గొర్లకాపరుల సహకార సంఘం సభ్యులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి శుక్రవారం వినతిప్రతం అంజేశారు. జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గొర్రెల కోసం ఒక్కొక్కరి వాటా కింద మూడునెలల క్రితం అప్పుచేసి రూ.43,750 డీడీల రూపంలో చెల్లించామన్నారు. వెంటనే పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం డివిజన్ అధ్యక్షుడు వెంకటయ్య, కురుమసంఘం డివిజన్ అధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, కౌన్సిలర్ బాలప్ప, పూజారి పాండు, నర్సింహులు,బాలు,అంజయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
కేజీఎఫ్ స్టైల్లో వీడియో: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, తాండూరు: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా మారడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. అయితే, రోహిత్ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తన గన్మెన్లు, వై.సెక్యురిటీ సిబ్బందితో రోహిత్ రెడ్డి చేసిన వీడియో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ వీడియోలో ముందుగా రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తుండగా.. ఆయన వెనక నుంచి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటారు. బ్యాగ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ క్రమంలో రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది నడుస్తుండగా.. మధ్యలో రోహిత్ రెడ్డి నడుచుంటూ వస్తుంటారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: అక్కడ వందల కోట్ల స్కాం జరిగింది: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్ -
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
సాక్షి, వికారాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికు పెను ప్రమాదం తప్పింది. కర్నాటకలోని ఉడిపి సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని శృంగేరి పీఠ సందర్శనకు వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు.. చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బులెట్ ప్రూఫ్ వాహనం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ హైకోర్టులో రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘మనీలాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఆర్ చట్ట విరుద్ధం. పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు.. ఇక్కడ డబ్బు ఎక్కడా లభ్యం కాలేదు’’ అని రోహిత్‌రెడ్డి తరఫు లాయర్ పేర్కొన్నారు. నిన్న ఈడీ విచారణకు రావాలని రోహిత్‌రెడ్డి నోటీసులు ఇచ్చామని, విచారణకు రాకపోవడంతో 30న మళ్లీ రావాలని నోటీసులు ఇచ్చామని ఈడీ తెలిపింది. సమన్లలో అడిగిన అన్ని వివరాలు ఇచ్చామని ఈడీ పేర్కొంది. వాదనలు విన్న హైకోర్టు.. ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఈడీలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కి కోర్టు వాయిదా వేసింది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరు.. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ఈడీ విచారణకు గైర్హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం తన పిటిషన్ విచారణకు రానున్నట్లు తెలిపారు. ఈడీకి సంబంధంలేని కేసులో విచారణ సరికాదని తెలిపారు. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపించారు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్తానని తెలిపారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిరి రెండు సార్లు విచారించిన ఈడీ.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు ఇచ్చింది. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని రోహిత్‌ను ఆదేశించింది. అయితే ఈడీ ఎదుట హాజరు కాకుడదని రోహిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. హై కోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. తాను విచారణకు హాజరు కాలేనని రోహిత్ పేర్కొన్నారు. మరోవైపు బుధవారం హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండగా.. హై కోర్టు తీర్పు ఒచ్చాకే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరోవైపు రోహిత్ రెడ్డి మెయిల్‌కు ఈడీ అనుమతి ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఎమ్మెల్యే గైర్హాజరుతో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్ ఆనంద్ -
సిట్‌ను కాదని సీబీఐకి ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజస మని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్ బెంచ్‌కు వెళ్లాలా? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా? అనేది నిర్ణయించుకుంటామని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై న్యాయనిపుణుల సలహా తీసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు..అందుకే.. ఈడీ విచారణ పరిధిలో లేకున్నా, తనను పిలిచి ఇబ్బంది పెట్టాలని చూసినా ఏ ఆధారాలు దొరకలేదని రోహిత్‌రెడ్డి చెప్పారు. అందుకనే సీబీఐ రంగంలోకి దిగిందనే అనుమానం తనకు కలుగుతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు సరిగానే జరుగుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని, అయి తే తాను తప్పు చేయనందున ఎవరికీ భయపడా ల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. న్యాయస్థానం, చట్టాలను గౌరవిస్తూనే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. దొంగ స్వాములు చెప్పినట్టు జరుగుతోంది.. బీజేపీకి సంబంధం లేకపోతే ఆరోపణలు ఎదు ర్కొంటున్న వారు ఎందుకు విచారణకు రావడం లేదని ప్రశ్నించారు. దొంగస్వాములు చెప్పినట్లుగా కేసు ముందుకు వెళ్తున్న తీరు విస్మయానికి గురిచే స్తోందన్నారు. ఈ కేసులో నిందితులు విచారణను సీబీఐ అప్పగించాలని కోరిన విషయాన్ని రోహిత్ రెడ్డి గుర్తు చేశారు. స్వామీజీలతో బీజేపీకి సంబంధం లేదని ప్రకటించిన వారే నిష్ణాతులైన న్యాయ వాదులను రప్పించుకుంటున్నారన్నారు. తన సోద రుడికి గుట్కా వ్యవహారంతో సంబంధం లేదని రోహిత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు వీడియో, ఆడియో కాపీలు తానే ఇచ్చానని తెలిపారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తెలంగాణను చేజిక్కించుకోవాలనే కుట్రను భగ్నం చేసిన తాను, తప్పు చేయలేదని అన్నారు. -
ఎమ్మెల్యేల కేసులో భారీ ట్విస్ట్.. నందకుమార్‌పై రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. కాగా, విచారణ అనంతరం.. రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు సంపూర్ణంగా సహకరించాను. నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టినందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. నందకుమార్ ద్వారా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూశారు. ఇప్పుడు నందకుమార్‌ను విచారిస్తామని అంటున్నారు. కేవలం నన్ను లొంగదీసుకునేందుకే ఈడీ విచారణ జరిపింది. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ ద్వారా నాకు నోటీసులు పంపించి విచారణ జరిపారు. దీంతో, బీజేపీ జాతీయ నేతల బండారం బయటపడింది. మొదటి రోజు నన్ను ఆరు గంటల పాటు విచారించినా ఈ కేసు గురించి ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు గురించి రెండో రోజు ప్రశ్నించారు. అది కూడా నేను అడిగితే చెప్పారు. కంప్లైంట్ చేసిన నన్ను విచారించారు తప్ప.. నిందితులను ఎందుకు ప్రశ్నించడంలేదు?. నంద కుమార్ ద్వారా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. నందకుమార్ ద్వారా స్టేట్మెంట్ తారుమారు చేయబోతున్నారు. కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రజాస్వామ్యాన్ని కొల్లగొడుతోంది. ప్రజలు తన్నుకు చావాలన్నదే బీజేపీ విధానం. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్తాను. నేను గులాబీ సైనికుడిగా బీజేపీ కుట్రలను తిప్పికొడతాను. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ కొత్త కుట్రలను మేము భగ్నం చేస్తాము. ఈడీ నోటీసుల మీద రేపు హైకోర్టులో రిట్ వేయబోతున్నాను. బీజేపీ అగ్ర నేతలు ఎందుకు విచారణకు రావడంలేదు. నాకు, నందకుమార్‌కు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్: చిక్కుల్లో పైలట్.. ఉత్సాహంలో పట్నం
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలకంగా వ్యవహరించిన రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా సాగుతున్న తాండూరు గులాబీ రాజకీయాలు.. ఏ మలుపు తీసుకుంటాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. చిక్కుల్లో పైలట్ .. ఉత్సాహంలో పట్నం రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంచలనంగా మారారు. అప్పటి నుంచి వార్తల్లో హైలెట్ గా నిలిచారు. ఈ కేసు తరవాత చాలా రోజులు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. కేసు కారణంగా సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. పక్షం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రోహిత్‌రెడ్డి...ఎమ్మెల్సీ వర్గాన్ని బలహీన పరిచే పనిలో పడ్డారు. పైలెట్ రోహిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ సపోర్ట్ ఉందనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి క్రమంగా కేడర్ దూరం అవుతోంది. ఎమ్మెల్యే కారణంగా తన క్యాడర్ దూరం అవుతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి... తన వర్గబలం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. పెద్ద బాస్ భరోసా ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బలంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం దూకుడుగా వెళ్తున్నారు. ఎమ్మెల్యేల ఎర అంశంతో తాండూరు పేరు జాతీయ స్థాయికి తీసుకువెళ్ళానని ప్రచారం చేసుకుంటున్నారు. తాండూరు అభివృద్ధికి సీఎం కేసీఆర్ ను ఒప్పించి నిధులు తెస్తున్నానని పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మళ్లీ తానే పోటీ చేస్తానని కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. తాండూరు గులాబీ తోటలో ఇప్పడు సీటు విషయమై రచ్చ రచ్చ అవుతోంది. భారతీయ రాష్ట్ర సమితి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కేడర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలపై నజర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. విచారణ పేరుతో ఇప్పటికే ఒకరి తర్వాత మరొకరికి నోటీసులు జారీ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తుండటంతో ఇన్నాళ్ల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన బంధువులు, ముఖ్య అనుచరులు, వ్యాపార భాగస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం వీరిని చూస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. ఈ కేసుల్లోకి తమను ఎక్కడ లాగుతారోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు ఆయా నేతల దృష్టిలో పడేందుకు రోజంతా వారి ఇళ్లు, క్యాంపు ఆఫీసుల ఎదుట పడిగాపులుగాసిన వారు సైతం అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. విదేశాల్లో క్యాసినో గేమ్స్‌తో మొదలు.. మెయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వరకూ ఇలా ప్రతి కేసు జిల్లా నేతలకు, వారి ముఖ్య అనుచరులకు, ఆర్థిక బినామీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనీలాండరింగ్ కేసులో మంచిరెడ్డికి మనీలాండరింగ్‌కు పాల్పడిన అభియోగంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఆగస్టులో ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు తమ ఆఫీసుకు పిలిపించి 14 గంటలకుపైగా విచారించింది. 2014లో మంచిరెడ్డి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించారు. ఈ సమయంలో చేసిన ఖర్చులతో పాటు 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టారనే అభియోగంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై మనీలాండరింగ్ ఆరోపణ లు రావడం, ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారణకు సైతం హాజరు కావడంతో జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. అప్పటి వరకు ఆయన అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూసిన వారు ఆ తర్వాత మంచిరెడ్డి ఎదురుపడితే సైలెంట్‌గా సైడై పోతుండటం గమనార్హం. అక్రమ ఆస్తుల కేసులో మంత్రికి మెడికల్ కాలేజీల్లో ఫీజుల వసూలు, పన్నుల ఎగవేత వంటి పక్కా సమాచారంతో మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఇటీవల ఐటీ సోదాలు నిర్వహించింది. నవంబర్ 22న ఏకకాలంలో 50 బృందాలు బోయిన్‌పల్లిలోని ఆయన ఇల్లుతో సహా విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో సోదాలు చేపట్టింది. వరుసగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో మంత్రి అల్లుడు, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, వ్యాపార భాగస్వాముల బ్యాంకు లావాదేవీల వివరాలు, లాకర్లు తెరిపించి పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు. ఈ సమయంలో మంత్రితో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక అవకతవకల కోణంలో విచారించేందుకు ఈడీకి లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు మంత్రి వెంట మౌనంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రస్తుతం ఆయనపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం మైనంపల్లి ఫాంహౌస్ వేదికగా ముఖ్యనేతలంతా భేటీ కావడం, మంత్రి వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పైలెట్ మెయినాబాద్ ఫాం హౌస్(ఎమ్మెల్యేల ఎర) కేసులో కీలక ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై ఈడీ దృష్టి సారించింది. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఇటీవలే పైలెట్‌కు నోటీసులు జారీ చేయగా, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత సోమవారం మధ్యాహ్నం విచారణ సంస్థ ముందు హాజరయ్యారు. ఏడు గంటల పాటు విచారించిన ఈడీ మరుసటి రోజు మళ్లీ హాజరు కావాల్సిందిగా సూచించింది. దీంతో రెండో రోజైన మంగళవారం కూడా ఆయన ఈడీ ముందుకు వెళ్లారు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపిన స్థిర, చర ఆస్తులు, ఆ తర్వాత ఆయన కూడబెట్టిన ఆస్తులు, విద్యార్హత, బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్టు, పాన్, ఆధార్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఆయనపై అనేక ఆరోపణలు రావడం, సిట్ విచారణ కొనసాగుతుండటం, మరో వైపు ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండటం, ఇదే సమయంలో ఆయనకు ఈడీ నోటీసులు రావడం వంటి వరుస పరిణామాలు అధికార బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటి వరకు ఎమ్మెల్యేతో అంటకాగిన నేతలు, అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాములు ప్రస్తుతం పైలెట్ వెంట వెళ్లేందుకు జంకుతున్నారు. (క్లిక్ చేయండి: ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త) -
రోహిత్‌రెడ్డి ఈడీ విచారణలో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి – ఈడీ కేసులో కొత్త ట్విస్ట్. ఎమ్మెల్యేలకు ఎర కేసులోనే తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని రోహిత్‌రెడ్డి చెప్పిన 24 గంటల్లోనే ఈడీ అధికారులు ‘7 హిల్స్ మాణిక్‌చంద్’ పాన్ మసాలా యజమాని అభిషేక్ ఆవాలకు నోటీసులు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్‌గోయల్ స్పష్టం చేశారు. 2015 నుంచి అన్ని బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లు, ఏయే సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్ తనను రూ.1.75 కోట్ల మేరకు మోసం చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అభిషేక్ ఈనెల రెండోవారంలో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అభిషేక్, రోహిత్‌రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ లావాదేవీలు ఏ సందర్భంగా జరిగాయి? ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు? రోహిత్‌రెడ్డితో ఉన్న సంబంధాలపై పూర్తిస్థాయిలో కూపీ లాగేందుకు అభిషేక్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రెండురోజులపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న రోహిత్‌రెడ్డి తనను ఎమ్మెల్యేల ఎర కేసులోనే విచారించారని, ఈ కేసులో తాను ఫిర్యాదుదారుడిగా ఉన్నా.. దోషులను వదిలిపెట్టి తనను విచారణకు పిలవడం ఏమిటో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ అధికారులు మాత్రం ‘7 హిల్స్ మాణిక్‌చంద్’ పాన్ మసాలాకు సంబంధించిన లావాదేవీలపై రోహిత్‌రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాన్‌మసాలా కేసులోనే రోహిత్‌రెడ్డిని విచారించినట్లు స్పష్టమవుతోంది. 2015లోనే సొంత బ్రాండ్‌పై... మాణిక్‌చంద్ గుట్కాకు హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన పంపిణీదారుగా ఉన్న అభిషేక్ ఆవాల 2015లో సొంత బ్రాండ్‌తో పాన్ మసాలా తయారీని ప్రారంభించారు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్‌చంద్’ పేరుతో పాన్ మసాల, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలెట్టాడు. ఆపై గుజరాత్ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా అమ్మకాలు సాగించినట్లు సమాచారం. ఆ దందాలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందుకుమార్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. అభిషేక్, నందుకుమార్ సంయుక్తంగా వే ఇండియా టుబాకో ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మార్కెటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూ3 హాస్పిటాలిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. డబ్ల్యూ3 సంస్థలో రాజేశ్వర్‌రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థను ముగ్గురూ కలిసి 2015 నవంబర్ 6న ఏర్పాటు చేశారు. ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’ ఉత్పత్తులకు సంబ«ంధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ అభిõÙక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా, పశి్చమబెంగాల్‌లోని అనేక మందిని మోసం చేశారన్న అభియోగాలున్నాయి. ఈ వ్యవహారాల్లోనూ నందుకుమార్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయ్యప్ప దీక్షను విరమించిన రోహిత్‌రెడ్డి తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అర్ధాంతరంగా అయ్యప్ప దీక్ష విరమించారు. ఆయన అన్న కుమారుడు శశాంక్‌రెడ్డి మంగళవారం అర్ధరాత్రి బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామంలో మృతిచెందారు. దీంతో అయ్యప్ప దీక్షలో కొనసాగడం మంచిది కాదని, విరమించినట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత? వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?' -
రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. మానీలాండరింగ్ కేసులో ఈడీ అడిగిన ఫార్మాట్‌తో వివరాలతో విచారణకుహజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు ఉదయం 10.30 గంటలకు రమ్మన్నారని తెలిపారు. అయ్యప్ప దీక్షలో ఉండటంతో పూజా కార్యక్రమం వల్ల రాలేకపోయానని తెలిపారు. అయ్యప్ప దీక్ష కారణంగా ఆలస్యం అవుతుందని ఉదయం ఈడీ అధికారులకు మెయిల్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో మధ్యాహ్నం తరువాత విచారణకు వచ్చేందుకు ఈడీ అధికారులు అనుమతిచ్చారన్నారు. పూజ , భిక్ష పూర్తి చేసుకొని విచారణకు వచ్చినట్లు తెలిపారు. కాగా మానీలాండరింగ్ కేసులో రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఎమ్మెల్యేపై ఈసీఐఆర్ 48/2020 ప్రకారం కేసు నమోదు చేసి ప్రశ్నిస్తోంది. సోమవారం సుమారు ఆరుగంటలపాటు రోహిత్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. మరోసారి మంగళవారం విచారణకు రావాలని ఆదేశించింది. పర్సనల్ ప్రొఫైల్, బిజినెస్ ప్రొఫైల్‌తో హాజరు కావాలని ఈడీ తెలిపింది. రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలు.. విదేశీ ప్రయాణాలు, ఫోన్ నెంబర్స్ తీసుకురావాలని పేర్కొంది. రోహిత్ రెడ్డిఫై గతంలో నమోదు అయినా కేసుల వివరాలు తెలపాలంది. కంపెనీ ఇన్‌కం టాక్స్ వివరాలు తీసుకురావాలని చెప్పింది. ఎమ్మెల్యే ఆర్థిక స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్స్, లాకర్స్ వివరాలు సమర్పించాలని తెలిపింది. ఈడీ అడిగిన వివరాలతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. చదవండి: దిగ్విజయ్‌ని నియమించటం హర్షణీయం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గడువు కావాలని కోరుతూ చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించడంతో విచారణకు హాజరయ్యారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్జి. రోహిత్ రెడ్డి లేఖను తిరస్కరిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు కచ్చితంగా హాజరుకావాలని స్పష్టం చేసింది ఈడీ. దీంతో తాను విచారణకు హాజరైనట్లు చెప్పారు రోహిత్‌రెడ్డి. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు సమయం కోరాను. కానీ అందుకు ఈడీ నిరాకరించింది. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో వచ్చాను. చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చాను ఏ కేసులో విచారణకు పిలిచారో తెలియదు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. ఇదీ చదవండి: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్! -
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. రోహిత్‌రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఆయన లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రోహిత్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా, విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని, వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే రోహిత్‌రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. -
డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్..
సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈమేరకు మాట్లాడారు. రోహిత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ను దొర అని తిట్టారని, కానీ ఇప్పుడు అదే దొర వద్ద ఆయన పనిచేస్తున్నారని రఘునందన్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను డబ్బులు వసూలు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా.. విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్‌రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. రూ.100ల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్‌చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. చదవండి: TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి -
ఇప్పుడు రాలేను.. ఈడీకి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి లేఖ.. విచారణపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈడీ విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 25 వరకు గడువు కావాలని ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ రాశారు. విచారణ షెడ్యూల్ మార్చాలని కోరారు. ఈడీ ఎంత సమయం ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని రోహిత్ రెడ్డి అంటున్నారు. వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ.. దాని నమూనాను నోటీసులతో జత చేసింది. చదవండి: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్ అసమ్మతి నేతలపై ఫోకస్ -
రఘునందన్‌కు రూ.వందల కోట్లు ఎలా వచ్చాయి?
దూద్‌బౌలి: విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్‌రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివాసం ఉంటున్నారో, రూ.వందల కోట్లను ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ రూ.వందల కోట్లు పఠాన్‌చెరులో పరిశ్రమలనుంచి వసూలు చేసిన సొమ్ముకాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే శనివారం భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించిన రోహిత్‌రెడ్డి ఆదివారం మరోసారి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బండి సంజయ్‌కు సవాలు విసిరితే ఆయన స్పందించకుండా ఎమ్మెల్యే రఘునందన్‌రావు సీన్లోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సెప్టెంబర్‌కు ముందు సింహయాజులును కలిసినట్లు నిరూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని రోహిత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈడీ నోటీసుల విషయంలో మా న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
‘నా సవాల్‌ను బండి సంజయ్ స్వీకరించలేదు’
హైదరాబాద్: తన సవాల్‌ను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వీకరించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి విమర్శించారు. డ్రగ్స్ కేసులో తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని శనివారం సవాల్ చేశారు రోహిత్‌రెడ్డి. ఈ రోజు(ఆదివారం) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చిన రోహిత్ రెడ్డి.. తన సవాల్‌ను బండి సంజయ్ స్వీకరించలేదంటూ ఎద్దేవా చేశారు. దాంతో సంజయ్ చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో తాను తప్పుడు పత్రాలు సమర్పించినట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చేసిన ఆరోపణులు నిరూపించాలని సవాల్ విసిరారు రోహిత్‌రెడ్డి. రఘునందన్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే రఘునందన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధంలేదు
-
‘నేను ప్రమాణం చేసి చెబుతున్నా..నాకు సంబంధం లేదు’
హైదరాబాద్: తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను కావాలనే ఇందులో ఇరికించాలని చూస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు రోహిత్‌రెడ్డి. డ్రగ్స్ కేసుతో తనకు ఎటువంటి సంబంధ లేదని తాను భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి చెబుతున్నానని, మరి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధారాలతో నిరూపిస్తారా అంటూ సవాల్ విసిరారు. ఆధారాలు ఉంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని చాలెంజ్ చస్త్రశారు. తాను ఆదివారం ఇదే టైమ్‌కి ఇక్కడకి వస్తానని, బండి సంజయ్ ఆధారాలతో రావాలన్నారు. తమకు నోటీసులు వస్తాయిన బీజేపీకి ముందే ఎలా తెలుసని రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, కర్ణాటక పోలీసులు నుంచి కూడా తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. -
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి.దేవేందర్ బాబు.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదీ తాండూరు శాసనసభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం అధికార పరిధిలో లేని మేజిస్ట్రేట్ నమోదు చేయాల్సి ఉంది. సరూర్‌నగర్ పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య ఎమ్మెల్యేను కోర్టులో హాజరు పరిచారు. -
రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణి.. కానీ.. తాండూరు కోసమే..
బషీరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం మల్కన్‌గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామ యువకులు కొందరు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న బాలకృష్ణ అనే యువకుడితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘తాండూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా. లేకుంటే వాళ్లు ఇచ్చే వంద కోట్ల రూపాయలు తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను కదా. కానీ నేను మన కోసం రిస్క్ తీసుకున్నా. మీ గ్రామం అభివృద్ధికి ఏమేమి కావాలో నాకు లెటర్ రాయండి. మీ గ్రామం డెవలప్మెంట్ నేను చూసుకుంటా. సమస్యను నా దృష్టిలో పెట్టుకుంటా. ప్రభుత్వం ముందు ప్రపోజల్ చేస్తా..’అని తెలిపారు. నా కోసం దీక్ష విరమించాలని కోరారు. కాగా వారం రోజుల్లో మల్కన్‌గిరి గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దీక్ష చేస్తున్న యువకులు చెప్పారు. రిలే దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
ఎమ్మెల్యేల ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్.. రోహిత్ రెడ్డికి ఊహించని ఫోన్ కాల్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ఇప్పటికే నిందితులను సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోహిత్ రెడ్డి. తనకు యూపీ, గుజరాత్‌కు చెందిన 11 నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను హత్య చేస్తామంటూ బెదిరించనట్టు రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్స్ రికార్డు చేసింది సిట్ బృందం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. నిందితులు ఎలా సంప్రదించారనే కోణంలో సిట్ విచారణ చేపట్టింది. రూ. 100 కోట్ల డీల్‌పై ఫాంహౌస్‌లో ఏం మాట్లాడారనే అంశంపై విచారణ జరిపింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గత నెలలో మొయినాబాద్ పోలీసులు రామచంద్రభారతి, సింహయాజితోపాటు నగరానికి చెందిన నందుపై కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, రామచంద్రభారతి తనకు రెండు డ్రైవింగ్ లైసెన్సులు, రెండు పాన్‌కార్డులు, రెండు ఆధార్ కార్డులు చూపించి ప్రభుత్వంలో తాము ఏమైనా చేయగలమని చెబుతూ మోసం చేసేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రామచంద్రభారతిపై ఐపీసీ 467, 468, 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడం గమనార్హం. చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? -
కేటీఆర్ సీఎం కాడనే భయంతో కేసీఆర్ చిల్లర రాజకీయాలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
Kishan Reddy: ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే స్వామీజీలు అవసరమా?
న్యూఢిల్లీ: మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆందోళనపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. రోహిత్‌రెడ్డితో ప్రభుత్వం కూలిపోతుందనుకుంటే మేం చేసేదేమీ లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే స్వామీజీలు అవసరమా? మేం చేర్చుకోలేమా? అని ప్రశ్నించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. బ్రోకర్లను మధ్యలో పెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటు చర్య అని మండిపడ్డారు. కేటీఆర్ సీఎం కాడనే భయంతో కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన మాకు లేదు. రాష్ట్రంలో మాకు ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. వచ్చే ఎన్నికల్లో మేం ప్రజాస్వామ్య బద్ధంగానే అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని మేం ఎప్పుడూ చెప్పలేదన్నారు. గతంతో టీడీపీ ఎలా బురదజల్లే ప్రయత్నం చేసిందో ఇప్పుడు కేసీఆర్ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. 2014 నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు చేర్చుకున్నారు?. ఒక్క ఎమ్మెల్యేతోనైనా రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు. నలుగురు ఆర్టిస్ట్‌లను పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు వేరే పార్టీ నుంచి వచ్చారు. ఆ ఎమ్మెల్యేలకు వంద కోట్లు కాదు వంద పైలు కూడా అనవసరమే అని ఎద్దేవా చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిచిచ అధికారం చేపడుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సవాల్) -
కొబ్బరి నీళ్లు తీసుకురా..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసు కావటంతో పక్కా సాక్ష్యాధారాలతో నిందితులను పట్టుకునేందుకు ప్రణాళిక రూపొందించాకే సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజి స్వామిలను పకడ్బందీ స్కెచ్‌తో ట్రాప్‌లో పడేశారు. ముందస్తు ప్రణాళికతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జేబుల్లో వాయిస్ రికార్డర్లు, హాల్లో కెమెరాలు అమర్చారు. రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా..’ అంటూ సంకేతాన్ని ఇచ్చిన తర్వాత దాడి చేసేలా వ్యూహం రూపొందించారు. ఈనెల 26న రాత్రి మెయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు బీజేపీ రాయబారులు వస్తున్న సంగతి ముందుగానే తెలియడంతో ఈ మేరకు స్కెచ్చేశారు. శుక్రవారం హైకోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఈ అంశాలన్నీ పొందుపరిచారు. రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ కావటంతో ఆయన్నే లీడ్‌గా తీసుకొని ఈ స్కెచ్ వేసినట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లినట్లు తెలిపారు. రిమాండ్ రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్పష్టంగా రికార్డయ్యేలా.. ఎమ్మెల్యేలతో ముగ్గురు నిందితుల ఆడియో, వీడియో సంభాషణలు స్పష్టంగా రికార్డయ్యేలా అత్యాధునిక కెమెరాలను వినియోగించారు. రోహిత్‌రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు, వారు కూర్చొని ఉన్న హాల్లో నాలుగు అత్యాధునిక రహస్య కెమెరాలు భేటీ కంటే ముందే బిగించారు. ఫామ్‌హౌస్ హాల్లోని రహస్య కెమెరాలను మధ్యాహ్నం 3.05 గంటలకు ఆన్ చేశారు. మరో 5 నిమిషాల తర్వాత 3.10 గంటలకు ముగ్గురు నిందితులతో కలిసి రోహిత్ రెడ్డి హాల్లోకి వచ్చారు. సాయంత్రం 4.10 గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతరావులు వచ్చినట్లు రికార్డయింది. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు. సిగ్నల్ ఇవ్వగానే.. ఎమ్మెల్యేలతో నిందితులు సంభాషిస్తున్నప్పుడు ఏ సమయంలో పోలీసులు దాడి చేయాలన్నది ముందుగానే స్కెచ్ వేశారు. చర్చలు పూర్తయ్యాక ఏదైనా ఒక సిగ్నల్ వస్తే లోపలికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవా లని పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితులతో భేటీ పూర్తికాగానే రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా’ అని సిగ్నల్ ఇచ్చేలా ఆయన్ని ముందుగానే ప్రిపేర్ చేశారు. ఆ మేరకు రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా’ అని అనగానే సైబరాబాద్ పోలీసులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించారు. తలుపులు తెరిచి నలుగురు ఎమ్మెల్యేలతో ఉన్న ముగ్గురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైంది. అలాగే కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా ఆపరేషన్ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ, తుషార్‌కు రామచంద్రభారతి ఫోన్ చేయడం కూడా రికార్డయ్యాయి. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్‌కు రామచంద్రభారతి సెల్‌ఫోన్ సందేశం పంపినట్లు కూడా రికార్డయింది. కాగా ఈ మెసేజ్‌తో పాటు రామచంద్ర భారతి, నందకుమార్ వాట్సప్ చాటింగ్‌లను స్క్రీన్ షాట్లు తీసి సాక్ష్యాధారాల కోసం పొందుపరిచినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. నందు డైరీలో 50 మంది జాబితా.. నందకుమార్ డైరీలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేల వివరాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందులో 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. ‘సంతోష్ బీజేపీ‘ పేరుతో ఉన్న ఫోన్ నంబర్‌కు రామచంద్రభారతి వాట్సప్ మెసేజ్ పంపించారని తెలిపా. ఇలావుండగా నిందితుల నుంచి పోలీసులు సెల్ఫోన్లు, డైరీ స్వాధీనం చేసుకున్నారు. -
ఆడియో టేపు-2 రిలీజ్: ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?.. నువ్వే టీమ్ లీడర్ అవుతావు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్ మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండో ఆడియో టేప్ బయటకు వచ్చింది. మొత్తం 27 నిమిషాల పాటు ఆడియో కాల్ సాగింది. ఈ సందర్భంగా.. ఆడియోలో డబ్బుల గుర్తించి ప్రస్తావించడం విశేషం. ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలనేదానిపై ముగ్గురి మధ్య చర్చ సాగింది. ఒక్కొక్కరు రూ. 100 అడుతున్నారని రామచంద్ర భారతి, సింహయాజితో నందు చెప్పాడు. ఇలా వీరి మధ్య సంభాషణ కొనసాగింది. నందు: పైలట్ రోహిత్ రెడ్డితో నేను మాట్లాడాను. నువ్వు ముందుగా వస్తే.. నువ్వే టీమ్ లీడర్ అవుతావు అని చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని చెప్పాను. రామచంద్రభారతి: ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?. నందు: రోహిత్ రెడ్డి ఒక్కరికే రూ. 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మిగిలిన వారి మరో రేట్. రామచంద్రభారతి: అయితే నేను పైన చెప్పేటప్పుడు పైలట్ తనతో పాటు నలుగురిని తీసుకువస్తాడని చెప్తాను. రోహిత్‌ను తీసుకుంటే ఆయనతోపాటు మిగిలినవారు వస్తారని నేను చెప్తాను. నందు: ఇక్కడ వ్యవస్థ సరిగాలేదని పైన చెప్పండి. పైలట్ రోహిత్‌రెడ్డి చాలా విలువైన లీడర్ అని పైన చెప్పండి. రామచంద్రభారతి: మనం ఎక్కడ కూర్చుంటున్నామో గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు ఒకసారి కమిట్ అయితే వెనక్కి వెళ్లలేం. బండి సంజయ్, కిషన్‌రెడ్డితో కాదు.. ఇంకా పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం. నందు: ఈ విషయం స్థానిక లీడర్లకు తెలియకూడదు. రామచంద్రభారతి: మనం చేసే ఆపరేషన్ తెలంగాణ లీడర్లకు తెలియకుండా చేస్తాం. మునుగోడు ఎన్నికల కంటే ముందు రూ. 100 అడిగినా నేను పైన మాట్లాడతాను. నన్ను పైలట్ రోహిత్‌రెడ్డితో మాట్లాడించండి. ఇప్పుడు ఎంత మంది రెడీగా ఉన్నారని తుషార్‌కు చెప్పాలి. మునుగోడు ఎన్నికల కంటే ముందు దీన్ని కంప్లీట్ చేయాలి. నన్ను వాట్సాప్‌లో వారితో కాన్ఫరెన్స్‌లో పెడితే నేను మాట్లాడాతాను. సింహయాజులు: 100 కిలోమీటర్ల రేడియస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. కొడంగల్, తాండూర్, చేవేళ్ల ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడాను. రామచంద్రభారతి: కేవలం ఇద్దరు ముగ్గురి కోసం ఢిల్లీ నుంచి వారు రావడం సరికాదు. కనీసం 5 నుంచి ఆరుగురు జాయిన్ అయితే ఢిల్లీ వారిని రప్పించాలి. బల్క్‌గా ఎవరైనా చేరితేనే ఇంపాక్ట్ ఉంటుంది. సింహయాజులు: రూ. 100 కావాలని రోహిత్ అంటున్నాడు. రాజీనామా చేయాల్సి వస్తే ప్రభుత్వంతో ఢీకొనడం ఈజీ కాదని రోహిత్ అంటున్నాడు. రామచంద్రభారతి: రోహిత్ రాజీనామా చేస్తే.. నెలరోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఢిల్లీలోనూ మేం పనిచేస్తున్నాం, 43 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. అంటూ సంభాషణ కొనసాగింది. -
ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ వేదికగా జరిగిన ఘటనను ఖండిస్తూ అధికార పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర చండూరు: టీఆర్ఎస్ను చూస్తుంటే బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ తమను టార్గెట్ చేసిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. చండూరులో విలేకరు లతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలో సింహ యాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ల ద్వారా టీఆర్ఎస్కు చెందిన గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను రూ.100 కోట్లకు పైగా నగదు, కాంట్రాక్టులు, ఇతర పదవులను ఇవ్వజూపి బీజేపీలోకి రావాలని ప్రలోభ పెట్టే యత్నం జరిగిందని తెలిపారు. ఇదే విషయం తమ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో భారీ మెజారీ్టతో గెలవబోతోందని.. బీజేపీ డిపాజిట్ కోల్పోతుందనే భయంతో కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అడ్డదారిన.. దొడ్డి దారిన కొనే యత్నం మొదలు పెట్టిందని సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ నాటకాలాడితే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రలోభాలకు లోనుకారు.. అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పరిహాసం చేస్తోంది. ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వం సాగిస్తోంది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగరు. బీఆర్ఎస్తో ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం. కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతున్నందునే ఈ కుతంత్రం. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు దురాలోచనతో అడ్డదారులు ఎంచుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదు. కేసీఆర్ ముందు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. – మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి మోదీ, అమిత్ షా కుట్ర దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ ఓర్వలేక మోదీ, అమిత్ షా కుట్ర జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరహాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగే రకం కాదు. – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలంగాణలో కుదరదు మునుగోడులో విజయం సాధించలేమనే భయంతోనే నీచ రాజకీయాలను బీజేపీ మొదలు పెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీ తరం కాదు. మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కుదరదు. –శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ బేరసారాలకు లొంగదు టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదు. ఇది కే సీఆర్ పార్టీ ఎవరూ కొనుగోలు చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం. – గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. తమ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుండగా.. తమకు అలాంటి అవసరమే లేదని బీజేపీ చెబుతోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 84 సీసీ కెమెరాల్లో ఈ ఆపరేషన్ దృశ్యాలు రికార్డయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నుంచి సంప్రదింపులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు ఫామ్‌హౌజ్‌లో గంట 20 నిమిషాల వీడియో ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాడీవోర్న్ కెమెరాలో సంభాషణ దృశ్యాలు రికార్డ్ అయిన దృశ్యాలను సేకరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు మూడు రోజులుగా నిఘా పెట్టి చివరకు రంగంలోకి దిగారు. చదవండి: బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 8. సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులను లోపలికి రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫామ్‌హౌజ్‌లోనే ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ జగధీశ్వర్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. పట్టుబడ్డ కారు, నగదు సైతం అక్కడే ఉంది. చదవండి: తొందరపడి ఒక కోయిల ముందే కూసింది: రేవంత్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఘటనపై గురువారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రలోభ పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వినిపిస్తున్న ఈ కేసులో కీలకంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రగతిభవన్లోనే ఉన్నారు. బేరసారాల ఆడియో టేపులు ఉన్నాయని ఎమ్మెల్యేలు అంటున్న నేపథ్యంలో.. వాటిని కూడా మీడియా ముందు బయటపెట్టే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
పంతం నీదా.. నాదా!.. ‘మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా’
నేతల మధ్య నెలకొన్న వైరం.. అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తాండూరులో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకులు వ్యక్తిగత ఎజెండాల అమలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు. రెండేళ్లకుగా పైగా ఈ తతంగాలను గమనిస్తున్న నియోజకవర్గ ప్రజలు వీరి తీరును ఈసడించుకుంటున్నారు. సాక్షి, వికారాబాద్: అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వ్యవహార శైలిపై ప్రజలు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం వినూత్న నిరసనలతో వీరి తీరును ఎండగడుతున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గల్లోనూ అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కనిపిస్తున్నా తాండూరులో ఇవి తార స్థాయికి చేరాయి. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగడం పరిస్థితికి అద్దం పట్టింది. తాండూరులో రోడ్ల దుస్థితిపై చెప్పుల దండ వేసుకుని నిరసన మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా.. ‘జనం బాధలు పట్టించుకోని ఈ నేతలకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నా’ అంటూ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చెప్పుల దండ మెడలో వేసుకుని ఇటీవల నిరసన తెలిపాడు. ‘తాండూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని రోడ్ల ను చూసి.. ఈ నాయకుల్లో చలనం రాకపోవడం తమ దౌర్భాగ్యం’ అని పట్టణ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు, అభివృద్ధిలో నూతన ఒరవడి సృష్టిస్తానని చెప్పిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సైతం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్యటనల్లో ఆందోళన చేస్తున్న ప్రజలను అరెస్టులు, గదమాయింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైలెట్ చేరికతో సీన్ రివర్స్ టీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్లో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మొదటినుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా తమవంతు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో హరీశ్వర్‌రెడ్డి వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి పార్టీకి పెద్దదిక్కుగా మారారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్న ఐదేళ్లలో మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. అనూహ్యరీతిలో 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలవగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆతర్వాత కొద్ది రోజులకే రోహిత్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీలో గ్రూపు తగాదాలకు తెరలేచింది. మంత్రి సబితారెడ్డి సమక్షంలో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు, మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, రోహిత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరుతో జనం అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి పనుల నిర్వహణ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సమయంలో నూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వీరి మధ్య అధికారులు సైతం నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల పెద్దేముల్ మండలంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేయడం నేతల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సొంత కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారనే చర్చ సాగుతోంది. -
‘నువ్వెంత అంటే నువ్వెంత’..పైలట్, పట్నం వాగ్వాదం
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఒకదశలో వారు కొట్టుకునేంత పనిచేశారు. ఎమ్మెల్సీ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారంటూ ఎమ్మెల్యే వర్గం అభ్యంతరం తెలపడం గొడవకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తాండూరులో గ్రామపంచాయతీలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీలు పట్నం, సురభి వాణీదేవి హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్సీ వర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆశీనులు కాగా, ఎమ్మెల్యే వర్గాని కి చెందిన సర్పంచ్ రాములు, ఎంపీటీసీ సాయిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ అభ్యంతరం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం హాజరైతే అభ్యంతరమెందుకని మున్సిపల్ చైర్పర్సన్ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. నేతల గొడవపట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఇరువర్గాల నేతలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
నన్ను అందరికంటే ఎక్కువగా ఏడిపించే వ్యక్తి నా భర్త: నటి
‘నువ్వు నేను’ హీరోయిన్, నటి అనిత హసానందాని తరచూ తనకు సంబంధించిన విషయాలను, భర్త రోహిత్ రెడ్డిని సరదాగా ఆటపట్టించే వీడియోలు, తన ముద్దుల తనయుడి ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన భర్తను ఆటపట్టిస్తూ అనిత షేర్ చేసిన ఓ పోస్టు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అనిత తన భర్తతో క్లోజ్‌గా తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నన్ను ఏడిపించేది నువ్వే. అందుకే నీకు చిరాకు తెప్పించే ప్రతి మూమెంట్లో నేను నీతో ఉండాలనుకుంటాను’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది. కాగా బిజినెస్‌మేన్ రోహిత్‌రెడ్డిని ప్రేమించిన అనిత 2013లో అతడిని వివాహం చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఇటీవల ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
సాగర్ ఎన్నికలు: ఆ అభ్యర్థి పై అనర్హత వేటు వేయాలి!
హైదరాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయనపై విచారణ జరిపి అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జి.నిరంజన్, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి గురువారం ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) శశాంక్ గోయెల్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 2009, 2018 ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లు, అసెంబ్లీ వెబ్సైట్లో ఆయన బయోడేటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆయన సమర్పించిన కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తే ఆయన వివిధ సందర్భాల్లో తన విద్యార్హతల విషయంలో పొంతన లేని సమాచారం ఇచ్చారని తేలిందన్నారు. స్వీడన్‌లోని బీటీహెచ్ వర్సిటీ నుంచి బీటెక్, ఎంఎస్ చేసినట్టు తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం కనీసం 60 క్రెడిట్ పాయింట్లు కావాల్సి ఉండగా, రోహిత్ రెడ్డి సమర్పించిన సర్టిఫికెట్లో 30 పాయింట్లు మాత్రమే వచ్చినట్టు ఉందని, ఇది డిగ్రీగా చెల్లుబాటు కాదన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ముఠాతో రోహిత్‌కు సంబంధాలున్నాయన్నారు. ఈ అంశంపై డీజీపీతో విచారణ జరిపించాలన్నారు. తమ ఫిర్యాదుపై స్పందించిన సీఈఓ శశాంక్ గోయెల్, జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై త్వరలో గవర్నర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతంఫిర్యాదు చేస్తామన్నారు. -
బిగ్‌బాస్ షోలో పాల్గొంటా, కానీ: నటి
బుల్లితెర బాస్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఒక్కసారిగా అడుగు పెట్టారంటే వారికి ఎక్కడలేని పాపులారిటీ వస్తుంది. మారుమూల పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరికీ అందులోని కంటెస్టెంట్లు సుపరిచితులుగా మారిపోతుంటారు. ఇక హౌస్‌లో వారి వేషధారణ, నడత, మాట తీరు అన్నింటి ఆధారంగా ప్రేక్షకులు అభిమానులుగా మారిపోతుంటారు. ఇష్టమైన కంటెస్టెంట్‌ను గెలిపించుకునేందుకు నెలల తరబడి కష్టపడుతుంటారు. ఇక షో నుంచి వచ్చిన వారు సైతం సినిమా అవకాశాలను చేజిక్కించుకుని కెరీర్లో దూసుకుపోతుంటారు. అయితే బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు టీవీ తారలు చూపించినంత శ్రద్ధాసక్తులు సినీ సెలబ్రిటీలు చూపించరు. తాజాగా నటి అనిత హసానందాని బిగ్‌బాస్ షోలో పాల్గొననున్నట్లు పేర్కొంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు, ఆమె ఊరికే జోక్ చేసింది. ఇంతకీ ఏమైందంటే హిందీ బిగ్‌బాస్ 13 విజేత సిద్దార్థ్ శుక్లా అనిత భర్త రోహిత్ రెడ్డిని కలిశాడు. సిద్దార్థ్ కండలు చూసి రోహిత్ స్టన్న్ అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు సిద్దార్థ్‌ను పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇది చూసిన అనిత కూడా ఓ ఫన్నీ కామెంట్ చేసింది. "బోలెడన్ని కామెంట్లు వస్తూనే ఉన్నాయి. నా కొడుకు అరవ్‌ను తీసుకుని నేను కూడా తర్వాతి సీజన్లో పాల్గొంటాను. బై రోహిత్" అంటూ జోక్ చేసింది. కాగా ‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అనిత తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించింది. యే మొహబ్బతే, నాగిని వంటి హిట్ సీరియల్స్‌లో నటించింది. గత నెలలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా వుంటే హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో రుబీనా దిలైక్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. చదవండి: ఏడేళ్ల తర్వాత తొలి సంతానం.. బుడ్డోడి పేరేమిటంటే! -
‘30 ఏళ్లు దాటితే సంతానం కష్టమన్నారు’
ముంబై: నటి అనిత హసానందాని మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. తన బుజ్జాయిని చూసి మురిసిపోతూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు గల సంతోషకర క్షణాలను వీడియోలో బంధిస్తూ అనిత అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన కొడుకు పేరిట స్నేహితులకు బహుమతులు పంపించారు. ఈ కానుక అందుకున్న వారిలో బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో అనిత- రోహిత్‌రెడ్డి దంపతుల తనయుడి పేరు బహిర్గతమైంది. ‘‘ఆరవ్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్టులు ఆక్సెప్ట్ చేస్తున్నాడు’’అని రాసి ఉన్న గిఫ్ట్‌ప్యాక్‌ను భారతీ ఇన్‌స్టా స్టోరీలో రివీల్ చేశారు. దీంతో చిన్నారి పేరు ఎంతో బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆరవ్ పేరిట అతడి తల్లిదండ్రులు ఇప్పటికే ఓ ఇన్‌స్టా పేజ్‌ను క్రియేట్ చేశారు. కాగా ‘‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అనిత తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించారు. యే హై మొహబ్బతే, నాగిని వంటి హిట్ సీరియల్స్‌లో మెరిశారు. రోహిత్‌రెడ్డి అనే వ్యాపారవేత్తను ప్రేమించిన ఆమె.. 2013లో ఆయనను వివాహం చేసుకున్నారు. పెళ్లైన దాదాపు ఏడేళ్ల తర్వాత, ఫిబ్రవరి 9న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం గురించి అనిత మాట్లాడుతూ.. ‘‘ఇరు కుటుంబాల నుంచి సంతానం కోసం మాపై ఎలాంటి ఒత్తిడి రాలేదు. నాచ్ బలియే షో తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నాం. లాక్డౌన్లో గర్భం దాల్చాను. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత సహజ పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వడం కాస్త కష్టమైన పని అన్నారు. కానీ నా విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. తల్లిదండ్రులుగా మారిన తర్వాత రోహిత్, నేను ఆనందంలో తేలిపోతున్నాం. నిజానికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. సరైన ఆహారపుటలవాట్లు, జీవనశైలి పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు’’ అని స్ఫూర్తి నింపారు. కాగా అనిత ఏప్రిల్ 14, 1981లో జన్మించారు. ఆమె వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. చదవండి: ‘అమ్మ పొట్టలో ఎవరున్నారు జాకీ.. చెల్లెలు’ -
అబ్బాయి పుట్టాడు: నటి
ముంబై: నటి అనిత హసానందాని, రోహిత్ రెడ్డి దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భార్యను ఆత్మీయంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన రోహిత్‌రెడ్డి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ‘‘లవ్ యూ బేబీ.. మన జీవితంలోని అత్యంత మధురు క్షణాలు ఇవే’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు ఏక్తా కపూర్, సమీరారెడ్డి, హీనా ఖాన్, నకుల్ మెహతా, కరణ్ వీర్ వోహ్రా తదితరులు విషెస్ తెలిపారు. ఇక.. ‘‘రెడ్డి కోసం వేచి చూస్తున్నాం’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని అనిత క్యూట్ వీడియో ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబరులో ముంబైలో నిర్వహించిన అనిత సీమంతంలో ఏక్తా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేసిన ఫొటోలు కూడా ఆమె షేర్ చేశారు. కాగా ‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అనిత తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించారు. యే మొహబ్బతే, నాగిని వంటి హిట్ సీరియల్స్‌లో నటించారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... బిజినెస్‌మేన్ రోహిత్‌రెడ్డిని ప్రేమించిన ఆమె.. 2013లో ఆయనను పెళ్లాడారు. ఇక వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత వీరు ఫిబ్రవరి 9న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తమ జీవితాల్లోకి చిన్నారి రావడంతో ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాగా భార్యను ఎల్లప్పుడూ ప్రోత్సహించే రోహిత్ రెడ్డి, డాన్స్ రియాలిటీ షో "నాచ్ బలియే 9" సీజన్లో ఆమెతో కలిసి పాల్గొన్నారు. చదవండి: ‘అమ్మ పొట్టలో ఎవరున్నారు జాకీ.. చెల్లెలు’ View this post on Instagram A post shared by Rohit Reddy (@rohitreddygoa) -
మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారినపడిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కోలుకున్నారు. ఇక కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.10 రోజుల క్రితం కరోనా బారినపడిన నంది ఎల్లయ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. (సిద్దిపేట ముద్దుబిడ్డ, ఐదుసార్లు అక్కడి నుంచే) -
విట్టల్ వాడిలో ఏం జరిగింది?
రోహిత్ రెడ్డి, సుధా రావత్ జంటగా నటించిన చిత్రం ‘విట్టల్ వాడి’. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతం పేరు విట్టల్ వాడి. ఆ నేపథ్యంలోనే సినిమా ఉంటుంది. ఎన్.ఎన్. ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ పతాకంపై జి.నరేశ్ రెడ్డి నిర్మించారు. నాగేందర్ దర్శకత్వం వహించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందించిన చిత్రం ఇది. నాగేంద్ర బాగా తెరకెక్కించారు’’ అన్నారు. నాగేంద్ర మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత నరేశ్ గారికి థ్యాంక్స్. రోహిత్ ఈ కథకు కరెక్ట్‌గా సరిపోయాడు. కొత్త హీరో అయినా అనుభవం ఉన్న నటునిలా నటించారు’’ అన్నారు. ‘‘రియల్ ఇన్సిడెంట్లతో తీసిన ఈ సినిమాని చాలా సహజంగా తెరకెక్కించారు దర్శకుడు’’ అన్నారు నరేశ్. -
చిచ్చురేపిన సభ్యత్వ నమోదు
సాక్షి, తాండూరు: పట్టణంతో పాటు పలు మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గడువు ముగిసిన తర్వాత, స్థానిక ఇన్‌చార్జ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా మెంబర్‌షిప్‌లు ఇవ్వడంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఈ సారి టీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. పార్టీ సభ్యత్వం ముగిసిందని అధికారికంగా స్పష్టంచేశారు. అయితే రెండు రోజులుగా తాండూరులో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తి చేసి.. వివరాలను పార్టీ ఇన్‌చార్జ్‌లకు అందించారు. ఇదిలా ఉండగా ఆయా మండలాలు, మున్సిపల్ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షుడు గత నెలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వం పూర్తి చేసి సభ్యత్వ రశీదు బుక్కులతో పాటు సమకూరిన నగదును పార్టీకి చెల్లించారు. తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశామని నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ కమిటీల నియామకం.. మండలాల్లో, పట్టణంలో గ్రామ కమిటీలతో పాటు, వార్డు కమిటీల ఏర్పాటు సైతం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే గ్రామ కమిటీల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. అయితే రెండు రోజులుగా కొంత మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసిన స్థానిక నాయకులు విషయాన్ని తాండూరు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్‌తో పాటు మండలాల అధ్యక్షులకు చెప్పారు. సభ్యత్వ నమోదు చేస్తున్నది తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులుగా గుర్తించారు. మరోసారి వర్గపోరు.. తాండూరు నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. స్థానికంగా పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేందర్‌రెడ్డి వర్గీయులను రెచ్చగొట్టే విధంగా.. ఎమ్మెల్యే వర్గీయులు.. గడువు ముసిగిన తర్వాత సభ్యత్వం చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేశాం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి బుక్కులు, నగదును ఇన్‌చార్జ్‌లకు అందించాం. సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే వర్గీయులు మెంబర్షిప్ చేస్తున్నారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జ్‌లకు సైతం ఈ విషయాన్ని చెప్పడం లేదు. దీనిపై పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టు రామచందర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాం. – అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు -
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలకు ఇంటెలిజెన్స్ సెక్యురిటీ విభాగం అదనపు భద్రత కల్పించింది. నియోజకవర్గాలలో తిరుగలేకపోతున్నామని భద్రత పెంచాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరడంతో 4 ప్లస్ 4 గన్మెన్లను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వీరిద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్‌రెడ్డి పార్టీ మారిన తర్వాత ఈ నెల 6న టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనమైంది. తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. (చదవండి: శత్రువు వచ్చి అడిగినా సాయం చేశా: ఎమ్మెల్యే బీరం) -
టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి?
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కబురు రావడంతో 4 రోజుల క్రితం రోహిత్‌రెడ్డి ఆయనను కలసినట్లు తెలిసింది. అయితే ప్రాదేశిక ఎన్నికల అనంతరం పార్టీలో చేరుతానని రోహిత్‌రెడ్డి కేటీఆర్‌కు చెప్పినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే రోహిత్ కాంగ్రెస్‌ను వీడి సొంత గూటికి చేరనున్నారు. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. -
అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక..
‘చిన్నప్పటి నుంచి నాకు పైలెట్ కావాలని కోరిక ఉండేది. ఆ కోరికను నెరవేర్చుకున్నా. కానీ, ఎక్కువ కాలం పైలెట్‌గా పనిచేయలేదు. ఆ ఉద్యోగం వీడినా నా ఇంటిపేరు ‘పైలెట్’గానే నిలిచిపోయింది’ అని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి చెప్పారు. తన నాన్న, బాబాయ్‌లను చూసి రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల మధ్య ఉండడం ఇష్టమని ఆయన వెల్లడించారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుంటుంబ విశేషాలను వివరించారు. తాండూరు: మాది బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామం. నాన్న విఠల్‌రెడ్డి, అమ్మ ప్రమోదినిదేవి. అమ్మ చిల్కూరు గురుకుల విద్యాలయంలో ఫిజికల్ డైరక్టర్‌గా పనిచేసి రిటైర్మెంట్ అయింది. నాన్న రాజకీయాల్లో ఉన్నారు. గ్రామంలో మా తాత పంజుగుల లింగారెడ్డిది ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ కుటుంబమంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటాం. ఎలాంటి నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకుంటాం. నేను ప్రాథమిక విద్య, ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. స్వీడన్‌లోని బీటీహెచ్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు స్వీడన్‌కు వచ్చిన విద్యార్థులకు నేను కోఆర్డినేటర్‌గా కొనసాగాను. పైలెట్ కావాలని కోరికతో.. పైలెట్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం అమెరికాకు వెళ్లి కాలిఫోర్నియాలో పైలెట్ కోర్సులో చేరాను. ఏడు నెలల పాటు పైలెట్ శిక్షణ పొందాను. శిక్షణ పూర్తికాగానే ఆరు నెలల పాటు అక్కడే పైలెట్‌గా పనిచేశాను. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి బిజినెస్‌పై ఆసక్తి చూపించాను. అయితే, నేను పైలెట్ వృత్తి మానేసినా నా ఇంటిపేరు మాత్రం ‘పైలెట్’గానే నిలిచిపోయింది. పెద్దలు కుదిర్చిన వివాహం మా మామ స్వస్థలం విశాఖపట్నం. వారి కుటుంబం కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటోంది. నా పెళ్లిచూపులు చెన్నైలోనే జరిగాయి. మా పెళ్లి నిడారంబరంగా తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో జరిగింది. నా భార్య ఆర్తి కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. కూతురు నక్షత్ర, కుమారుడు జయదేవ్రెడ్డిలు పుట్టగానే మాకు కలిసొచ్చింది. నా కొడుకు పుట్టిన రోజే తాండూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నేను ఎప్పటికీ మరిచిపోని రోజు. రజనీకాంత్‌తో పరిచయం ఇలా.. సూపర్‌స్టార్ రజనీకాంత్, మా మామ విక్టర్ ప్రసాద్ ప్రాణ స్నేహితులు. నా భార్య ఆర్తితో కలిసి ఎప్పుడు చెన్నైకి వెళ్లినా రజనీకాంత్‌ను కలుస్తాను. నిరాడంబరంగా జీవిస్తున్న వారిలో రజినీకాంత్ ఒక్కరినే చూశాను. రాజకీయాలపై ఆసక్తి ఇలా.. కుటుంబంలో నాన్న విఠల్‌రెడ్డి, బాబాయ్ శ్రీశైల్రెడ్డిలు రాజకీయాలలో ఉన్నారు. వారిని చూసి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాను. అప్పటి నుంచి తాండూరు ఎమ్మెల్యే కావాలని కోరిక పుట్టింది. అందుకోసం పదేళ్ల పాటు రాజకీయాలలో కొనసాగాను. ఇటీవల జరిగిన ఎన్నికలలో తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించాను. నాకు ఇష్టమైనవి ఇవీ.. క్రికెట్ ఆడటమంటే ఎంతో ఇష్టం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడాను. రంజీ సెలక్షన్ వరకు వెళ్లి తర్వాత మధ్యలో వదిలేశాను. వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ చూస్తాను. నాకు ఇష్టమైన టూరిస్ట్ స్పాట్ కాలిఫోర్నియా, కశ్మిర్. కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్తాను. సినిమా హీరోలలో చిరంజీవిని ఇష్టపడతాను. ఇటీవల కాలంలో నేను జెర్సీ సినిమాను చూశాను. రోహిత్‌కు భార్య కావడం నా అదృష్టం రోహిత్‌రెడ్డి నా జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఆయన బిజినెస్, రాజకీయాలలో బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆయనకు నాన్‌వెజ్ చేసి పెట్టడమంటే నాకేంతో ఇష్టం. రోహిత్ మనసు తెలుసుకొని మసలుకుంటాను. – ఆర్తిరెడ్డి, రోహిత్‌రెడ్డి భార్య -
లాటరీ ఎమ్మెల్యే.. నాపై విమర్శలా?
బషీరాబాద్: ‘మొన్న తాండూరులో జరిగిన ఎన్నికల్లో లక్కీలాటరీలా.. ఎమ్మెల్యేగా గెలిచినోడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు.. నేను లోకల్ కాదని, నన్ను షాబాద్ పంపిస్తానని.. భాష రాదని.. ఎగతాలిచేస్తుండు.. నేను తలుచుకుంటే తాండూరులో బట్టలు ఊడదీసి పంపిస్తా..రాజకీయాల్లో హుందాగా విమర్శించడం నేర్చుకో.. మాజీ మంత్రి మాణిక్‌రావు కూడా ఇలా నాపై విమర్శలు చేయలేదు. నీలా దిగజారి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు..’’ అంటూ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బషీరాబాద్ వచ్చిన ఆయన మైల్వార్‌లో నిర్వహించిన సమావేశంలో మొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన రోహిత్‌రెడ్డి వారిని మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే పచ్చి అబద్ధాలకోరు.. మూర్ఖత్వంతో అలా మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో సద్విమర్శలు చేస్తే మంచిది.. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో 18 జెడ్పీటీసీ సీట్లు గెలిచి సునీతారెడ్డి మూడో సారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కాబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిలా మారాయన్నారు. ఎన్నికలు ముగిసన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం రెండింతల పెన్షన్లు, ఎకరాకు రూ.5 వేల రైతుబంధు సాయం అందజేస్తామని స్పష్టంచేశారు.టీఆర్ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పోరవాటి మాట్లు మాట్లాడుతున్నాడన్నారు. కనీసం పెద్దవాళ్లనే సంస్కారం కూడా లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం ఎక్మాయి, మంతన్‌గౌడ్‌తండా, క్యాద్గిర, జీవన్గీ, మర్పల్లి, నవల్గా గ్రామాల్లో మహేందర్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ అభ్యర్థి మిరాణం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాకేశ్, సీనియర్ నాయకుడు రాజుగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, మాజీ ఎంపీపీ కావలి భాస్కర్, అజయ్‌ప్రసాద్, శంకర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, అబ్దుల్ ఖాలీద్, సుధాకర్‌రెడ్డి, బన్సీలాల్, నర్సిరెడ్డి, హరిసూధన్‌రెడ్డి, శ్రావన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, ఎక్మాయి రాజుగౌడ్, సర్పంచులు సీమా సుల్తాన, నారాయణ, వసంతమ్మ, లక్ష్మమ్మ, కోటం నవనీత, డి. నర్సిములు, ఎంపీటీసీ అభ్యర్థులు షాజాదీబేగం, వినోద, శ్రీనివాస్, పుర్మ సునీత తదితరులు పాల్గొన్నారు. -
నెట్‌లింక్స్ ఎండీగా రోహిత్ లోకారెడ్డి
హైదరాబాద్: ఇంటర్నెట్ సేవల సంస్థ నెట్‌లింక్స్ ఎండీగా, అదనపు డెరైక్టరుగా రోహిత్ లోకారెడ్డి నియమితులయ్యారు. ప్రధానంగా ఆయన జీడీఆర్‌లు, ఇతరత్రా నిధుల సమీకరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితర అంశాలపై దృష్టి సారిస్తారని సంస్థ చైర్మన్ మనోహర్ లోకారెడ్డి వెల్లడించారు. మరోవైపు స్వతంత్ర అదనపు డెరైక్టర్లుగా సుబ్రహ్మణ్యేశ్వరరావు కాకరాల, కిరణ్ కాకరాల నియమితులైనట్లు నెట్‌లింక్స్ తెలిపింది. -
నేను ప్రెగ్నెంట్ కాలేదు!
తేజ నువ్వు-నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి వెళ్లిపోయింది ఈ భామ. అనంతరం కొన్ని హిందీ సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనితా హస్సనందానీ త్వరలో తల్లి కాబోతున్నదని, ఆమె గర్భవతి అయిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసకట్టిన ఈ కథనాలపై అనిత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. తాను ప్రెగ్నెంట్ అయినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన ఆమె.. తాను బరువు పెరగడానికి చాక్లెట్లు, పిజ్జాలే కారణమని చెప్పుకొచ్చింది. 'ప్రతి మీడియా సంస్థ నుంచీ నాకు కాల్స్ వస్తున్నాయి. ఏమైనా 'గుడ్ న్యూస్' ఉందా అని అడుగుతున్నారు. ఔను శుభవార్త ఉంది. అదేమిటంటే నేను డైటింగ్ చేయడం లేదు. నేను చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు బాగా తింటున్నాను. నేను అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తున్నానంటే అందుకు కారణం మా ఆయనతో ప్రేమలో ఉండటమే. నేను గర్భవతిని అయితే ఆ విషయాన్ని మీ అందరికీ గర్వంగా తెలియజేస్తాను' అని అనిత తనదైన స్టైల్లో వివరణ ఇచ్చింది. -
దిల్ దీవానా టీంతో చిట్ చాట్
-
దిల్ దీవాన ప్రెస్ మీట్
-
దిఫరెంట్ లవ్‌స్టోరీ దిల్ దివానా
-
‘దిల్‌దివానా’ సందడి
నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ : నెల్లూరుకు చెందిన యువకుడు రోహిత్‌రెడ్డి హీరోగా నటించిన దిల్‌దివానా చిత్ర యూనిట్ నగరంలో మంగళవారం సందడి చేసింది. ప్లాటినమ్ డిస్క్ ఆవిష్కరణ కోసం నెల్లూరుకు వచ్చిన సినీ నటులు డీఆర్ ఉత్తమ్ హోటల్లో బస చేశారు. హీరోలు రోహిత్‌రెడ్డి, రాజ్‌అర్జున్, హీరోయిన్లు నేహాదేశ్‌పాండే, కృతికా సింగాల్, దర్శకులు కిరణ్ తుమ్మా, నిర్మాత రాజారెడ్డి, సంగీత దర్శకుడు రామ్నారాయణతో పాటు యూనిట్ సభ్యులను చూసేందుకు యువత పోటీపడ్డారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సింహపురిలో పుట్టి నటుడిగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులో ఓ సినిమాను చిత్రీకరించి ఇక్కడి రుణం తీర్చుకుంటానని చెప్పారు. దర్శకుడు కిరణ్తుమ్మా మాట్లాడుతూ వచ్చే నెల 7వ తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. డైమండ్స్ విడుదల నగరంలోని జైన్‌గోల్డ్ షోరూంను దిల్‌దివానా చిత్ర యూనిట్ సందర్శించారు. వజ్రాభరణాలను తిలకించి అలంకరించుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం జైన్‌గోల్డ్ ఆధ్వర్యంలో డైమండ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. నటులు రోహిత్, రాజ్, నేహ, కృతికలు వాటిని ధరించారు. అనంతరం జైన్‌గోల్డ్ అధినేత మణిలాల్ జైన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో వీవీఎస్/ఈఎఫ్ క్వాలిటీతో నూరుశాతం దోషరహితమైన వజ్రాలను గ్యారెంటీతో విక్రయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం నరేంద్రజైన్, పారస్మల్జైన్, రాజేష్‌జైన్ పాల్గొన్నారు. నెల్లూరు బిర్యానీ సూపర్ వీఆర్సీ సెంటర్లోని ఉన్న శుభమస్తు షోరూంలో చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. హీరోయిన్లు నేహా, కృతిక మాట్లాడుతూ నెల్లూరు చాలా బాగుందన్నారు. ఇక్కడి వారి అభిమానం జీవితంలో మరిచిపోలేమని చెప్పారు. నెల్లూరు బిర్యానీ సూపర్ అన్నారు. అనంతరం ఇక్కడి సిబ్బంది, అభిమానులతో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో బయ్యా శ్రీనివాసులు, బయ్యా రమణయ్య, బయ్యా రవి పాల్గొన్నారు.


