సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజస మని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్ బెంచ్‌కు వెళ్లాలా? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా? అనేది నిర్ణయించుకుంటామని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై న్యాయనిపుణుల సలహా తీసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి ఆధారాలూ దొరకలేదు..అందుకే..
ఈడీ విచారణ పరిధిలో లేకున్నా, తనను పిలిచి ఇబ్బంది పెట్టాలని చూసినా ఏ ఆధారాలు దొరకలేదని రోహిత్‌రెడ్డి చెప్పారు. అందుకనే సీబీఐ రంగంలోకి దిగిందనే అనుమానం తనకు కలుగుతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు సరిగానే జరుగుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని, అయి తే తాను తప్పు చేయనందున ఎవరికీ భయపడా ల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. న్యాయస్థానం, చట్టాలను గౌరవిస్తూనే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
దొంగ స్వాములు చెప్పినట్టు జరుగుతోంది..
బీజేపీకి సంబంధం లేకపోతే ఆరోపణలు ఎదు ర్కొంటున్న వారు ఎందుకు విచారణకు రావడం లేదని ప్రశ్నించారు. దొంగస్వాములు చెప్పినట్లుగా కేసు ముందుకు వెళ్తున్న తీరు విస్మయానికి గురిచే స్తోందన్నారు. ఈ కేసులో నిందితులు విచారణను సీబీఐ అప్పగించాలని కోరిన విషయాన్ని రోహిత్ రెడ్డి గుర్తు చేశారు.
స్వామీజీలతో బీజేపీకి సంబంధం లేదని ప్రకటించిన వారే నిష్ణాతులైన న్యాయ వాదులను రప్పించుకుంటున్నారన్నారు. తన సోద రుడికి గుట్కా వ్యవహారంతో సంబంధం లేదని రోహిత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు వీడియో, ఆడియో కాపీలు తానే ఇచ్చానని తెలిపారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తెలంగాణను చేజిక్కించుకోవాలనే కుట్రను భగ్నం చేసిన తాను, తప్పు చేయలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment