వికారాబాద్: నేను మీ బిడ్డను.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామానికి చెందిన వ్యక్తిని.. నన్ను ఆశీర్వదించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ బీసీసెల్ మండల అధ్యక్షుడు రావులపల్లి చంద్రశేఖర్‌గౌడ్ (ఆర్‌సీ) ఆధ్వర్యంలో శుక్రవారం 250 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. తాండూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాందాస్, నాయకులు ఉమాశంకర్, నరేందర్‌రెడ్డి, హసన్ పటేల్, రఘుగౌడ్, రాములు, విజయ్ ఉన్నారు.
తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
మారుమూల పల్లెలతో పాటు గిరిజన తండాలను నూతన పంచాతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల ధారుని వాగు తండాకు చెందిన బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మొగానాత్ పవర్.. ఎమ్మెల్యే సమక్ష్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పెద్దేముల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గొర్రెల పంపిణీ చేపట్టండి..
రెండోవిడత గొర్రెల పంపిణీని త్వరగా ప్రారంభించాలని శ్రీ మల్లికార్జున ప్రాథమిక గొర్లకాపరుల సహకార సంఘం సభ్యులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి శుక్రవారం వినతిప్రతం అంజేశారు. జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గొర్రెల కోసం ఒక్కొక్కరి వాటా కింద మూడునెలల క్రితం అప్పుచేసి రూ.43,750 డీడీల రూపంలో చెల్లించామన్నారు. వెంటనే పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం డివిజన్ అధ్యక్షుడు వెంకటయ్య, కురుమసంఘం డివిజన్ అధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, కౌన్సిలర్ బాలప్ప, పూజారి పాండు, నర్సింహులు,బాలు,అంజయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment