invited
-
పుట్టిన రోజు వేడుకలకని పిలిచి... అవమానించడంతో బాలుడి ఆత్మహత్య
బస్తీ (యూపీ): పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. వచ్చిన బాలుడి బట్టలిప్పించారు. మీద మూత్ర విసర్జన చేశారు. ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. వీడియోను ఫోన్ నుంచి తీసేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులూ పట్టించుకోలేదు. అవమానం భరించలేక 17ఏళ్ల దళిత బాలుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగింది. సంత్ కబీర్‌నగర్ జిల్లాకు చెందిన బాలుడు బస్తీ జిల్లాలోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ రాత్రి గ్రామస్తులు కొందరు బర్త్ డే పారీ్టకి బాలుడిని ఆహా్వనించారు. అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతడిని బట్టలు విప్పి, చితకబాదారు. మూత్ర విసర్జన చేసి అవమానించారు. అంతేకాదు ఉమ్మివేసి నాకాలని బలవంతం చేశారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించారు. జరిగిన అవమానాన్ని బాలుడు ఇంట్లో చెప్పాడు. వీడియోను డిలీట్ చేయాలని కుటుంబ సభ్యులు వారిని కోరినా వినలేదు. దీంతో వారిపై కెపె్టన్గంజ్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎస్హెచ్ఓ నిరాకరించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో ఎస్పీ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెపె్టన్గంజ్ ఎస్హెచ్ఓ దీపక్‌కుమార్ దూబేను సస్పెండ్ చేశారు. బాలుడి మేనమామ ఫిర్యాదు మేరకు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. -
సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈసారి వినూత్నంగా వేడుకలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు తమతమ జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు. ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు తమతమ సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్‌ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్‌మనీని కూడా ఇస్తారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులకు ప్లాన్.. హై అలర్ట్ జారీ.. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. -
'పంద్రాగస్టు'కు ప్రధాని నుంచి పిలుపు
కరీంనగర్: పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పాకాల పురుషోత్తంరెడ్డి, పద్మజ దంపతులకు ప్రధాని నుంచి పిలుపు అందింది. పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం మానకొండూర్ ప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట రైతు ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్ సంద మహేందర్, కవిత దంపతులకు సైతం ఆహ్వానం అందినట్లు శనివారం తెలిపారు. -
బీఆర్ఎస్ పార్టీలో 'ఆకర్ష్ మంత్రం' ! కొత్త జయపాల్‌రెడ్డి చేరిక..
కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. నియోజకవర్గస్థాయిల్లో పేరున్న నేతలతో పాటు అర్ధబలం, అంగబలం, సామాజికవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరడమే ఖాయమని భావించిన స్థానిక మైత్రి గ్రూప్ అధినేత కొత్త జయపాల్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకే మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్‌లు సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా సమ్మతించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణకే కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి జిల్లా నుంచి రానున్న ఎన్నికల్లో మరోసారి విజయ ఢంగా మోగించేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. జిల్లాకేంద్రంలో బలమైన సామాజిక వర్గం, గ్రానైట్, రియల్టర్, మీడియా గ్రూప్‌ల్లో భాగస్వామ్యుడైన కొత్త జయపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో మంతనాలు జరపడం, రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ చెప్పడం, వారం రోజుల్లోనే పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేయడంపై జిల్లాలో రాజకీయ చర్చ మొదలైంది. కొత్త జయపాల్‌రెడ్డి గతంలో నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ అగ్రనాయత్వంతో సంప్రదింపులు జరపడం, కరీంనగర్ బీజేపీ టికెట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు పూర్తయ్యాయని కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఖాయమైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కరీంనగర్ బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో రెండు పార్టీల్లో నుంచి సరియైన సంకేతాలు రాకపోవడంతో జయపాల్‌రెడ్డి గమ్ముగా ఉన్నారు. దీంతో మంత్రి గంగుల అధిష్టానంతో కొత్త జయపాల్‌రెడ్డి చేరికతో లాభనష్టాలపై పార్టీకి విన్నవించడంతో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. త్వరలో మరిన్ని చేరికలు.. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు కొద్ది రోజుల్లోనే ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల్లో స్తబ్దత నెలకొనడం.. అధికార బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తుండడంతో ఆయా పార్టీల్లో గుర్తింపు లేని లీడర్లు బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమయం వరకు చేరికలు భారీగా ఉంటాయని ఆ పార్టీ లీడర్లు పేర్కొంటున్నారు. -
నేను మీ బిడ్డను.. ఆశీర్వదించండి : పైలెట్ రోహిత్‌రెడ్డి
వికారాబాద్: నేను మీ బిడ్డను.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామానికి చెందిన వ్యక్తిని.. నన్ను ఆశీర్వదించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీసీసెల్ మండల అధ్యక్షుడు రావులపల్లి చంద్రశేఖర్‌గౌడ్ (ఆర్సీ) ఆధ్వర్యంలో శుక్రవారం 250 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తాండూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాందాస్, నాయకులు ఉమాశంకర్, నరేందర్‌రెడ్డి, హసన్ పటేల్, రఘుగౌడ్, రాములు, విజయ్ ఉన్నారు. తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. మారుమూల పల్లెలతో పాటు గిరిజన తండాలను నూతన పంచాతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల ధారుని వాగు తండాకు చెందిన బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మొగానాత్ పవర్.. ఎమ్మెల్యే సమక్ష్యంలో బీఆర్ఎస్లో చేరారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పెద్దేముల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గొర్రెల పంపిణీ చేపట్టండి.. రెండోవిడత గొర్రెల పంపిణీని త్వరగా ప్రారంభించాలని శ్రీ మల్లికార్జున ప్రాథమిక గొర్లకాపరుల సహకార సంఘం సభ్యులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి శుక్రవారం వినతిప్రతం అంజేశారు. జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గొర్రెల కోసం ఒక్కొక్కరి వాటా కింద మూడునెలల క్రితం అప్పుచేసి రూ.43,750 డీడీల రూపంలో చెల్లించామన్నారు. వెంటనే పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం డివిజన్ అధ్యక్షుడు వెంకటయ్య, కురుమసంఘం డివిజన్ అధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, కౌన్సిలర్ బాలప్ప, పూజారి పాండు, నర్సింహులు,బాలు,అంజయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమంలో మేమే నంబర్ వన్ అంటూ.. 'ఎవరి ధీమా వారిదే'!
వికారాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై విజయ కేతనం ఎగురవేసేందుకు అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈసారి విజయం మాదంటే.. మాదేనని ధీమా వ్యక్తంచేస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమంలో మేమే నంబర్ వన్‌గా ఉన్నామని.. ప్రజలు తమవైపే మొగ్గుచూపుతారని అధికార బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా గెలుపు మాదేనని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ దారుణంగా విఫలమైందని, ఈ విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో హస్తం పార్టీ వెనకబడిందని చెబుతున్న బీజేపీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న తమకు విజయావకాశాలు దండిగా ఉన్నాయని బీఎస్పీ నేతలు ప్రకటిస్తున్నారు. పథకాలే గెలిపిస్తాయి.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తాండూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని తొంభైశాతానికి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులే గెలుస్తారని బలంగా చెబుతున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచినప్పటికీ తాండూరు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరానని.. అనుకున్నట్లుగానే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు తీయించానని ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి చెబుతున్నారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని, మరోసారి గెలిచి తాండూరును రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెడుతానని పేర్కొంటున్నారు. ఇందుకోసం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. బలమైన ఓటు బ్యాంక్.. గత ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థే గెలుపొందారని, ఈసారి కూడా విజయం తమవైపే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత రమేష్ మహరాజ్ పేర్కొంటున్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన రోహిత్‌రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని, మహేందర్‌రెడ్డిని తాండూరు ప్రజలు గత ఎన్నికల్లోనే తిరస్కరించారని చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలెవరూ వారిద్దరినీ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఇక్కడ మరోసారి కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరినా.. ఆయనతో వెళ్లింది కొద్ది మంది మాత్రమేనని, అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలందరూ ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారంటున్నారు. అన్నింటికి మించి తాండూరులో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని, ఎవరెన్ని చెప్పినా వీరు మారే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారిని సైతం తిరిగి ఆహ్వానిస్తామని, పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని చెబుతున్నారు. బహుజన నినాదంతో.. బహుజన నినాదంతో బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థిగా బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్గపోరును భరించలేని తాండూరు ఓటర్లు బహుజనుల కోసం పాటుపడే బీఎస్పీ వైపు మొగ్గు చూపుతారని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు టికెట్ ఇస్తే..? రాష్ట్రంలో మెజారిటీ జనాభా బీసీలే. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ జిల్లాకు రెండు చొప్పున అసెంబ్లీ స్థానాలను బీసీ అభ్యర్థులకు ఇవ్వాలని బీసీ సంఘాలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బీసీ లేదా జనరల్‌కు కేటాయించినా.. టికెట్ తనదేనని రమేశ్‌మహరాజ్ చెబుతున్నారు. అలాగే బీజేపీ నుంచి బీసీ అభ్యర్థులైన రవిశంకర్, రమేష్ కుమార్, మురళీకృష్ణ గౌడ్, నరేశ్మహరాజ్ బరిలోకి దిగేందుకు పావులు కదుపు తున్నారు. ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీ తాండూరు టికెట్‌ను బీసీలకు కేటాయిస్తే తప్పకుండా తనకే టికెట్ వస్తుందని బీసీ కమిషన్ రాష్ట్ర సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కీలకం కానున్న మైనార్టీ ఓట్లు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మైనార్టీల నుంచి మంచి సపోర్టు ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో నిలిచినా మైనార్టీ ఓట్లు చీలడం మాత్రం ఖాయం. బీజేపీకి మైనార్టీలు ఓటువేసే పరిస్థితిలో లేరని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మైనార్టీ ఓట్లను చీల్చుకుంటే ఇరువురికి ఇబ్బందికరంగానే మారుతుందని.. ఈ క్రమంలో మిగిలిన వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకొనేందుకు తాండూరు బరిలో బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని దింపవచ్చనే టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి తాండూరులో రసవత్తర పోటీ ఖాయమనే చెప్పవచ్చు. ఏ పార్టీ ఎవరికి బీ– ఫారం ఇస్తుందో స్పష్టంగా తెలిస్తే తప్ప ఒక నిర్దిష్టమైన అవగాహనకు రాలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. వర్గపోరే ప్రధాన బలహీనత.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. టికెట్ తనకే వస్తుందని బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ముప్పై ఏళ్లుగా తాండూరు ప్రజలకు సేవ చేస్తున్నానని.. మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేశానని, అన్నివర్గాల ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నానని చెబుతున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేది, తాండూరులో గెలిచేది నేనేనని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండుగా చీలిపోయిన బీఆర్ఎస్ మద్దతుదారులు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఎంత మంది సర్ది చెబుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. తాండూరులో రసవత్తర రాజకీయం.. తాండూరు నడిబొడ్డున కాషాయం జెండా రెపరెపలాడించాలని బీజేపీ నేతలు కూడా విశ్వప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎన్ఆర్ఐ పటేల్ రవిశంకర్‌కు ఇంటిపోరు తప్పలేదు. సొంత పార్టీ నేతల నుంచి ఈయనకు అంతగా మద్దతు లభించలేదు. ఎప్పటి నుంచో పార్టీని పట్టుకుని ఉన్న తనను కాదని ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తికి గురైన స్థానిక బీజేపీ నేత రమేష్‌కుమార్ అప్పట్లో తన క్యాడర్‌తో కలిసి బీఆర్ఎస్లో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలతో తిరిగి సొంతగూటికి వచ్చారు. గత ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించిన మురళీకృష్ణ గౌడ్.. ఆయనతో విడిపోయి బీజేపీలో చేరారు. ప్రస్తుతం గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమయ్యారు. గతంలో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన నరేష్ మహరాజ్ బీఆర్ఎస్లో చేరి.. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రస్తుత తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్న లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకొన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇటీవల ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మరీ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ప్రకటించారు. రమేశ్‌కుమార్, మురళీకృష్ణగౌడ్, నరేష్ మహరాజ్, లక్ష్మారెడ్డి.. ఇలా అందరూ తమను తాము ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకోవడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. -
మహారాష్ట్రలో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచుతాం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశంలో వెనుకబాటుతనం కనిపిస్తోందని రైతులు, పేదల ప్రగతి లక్ష్యంగా రైతు ప్రభుత్వం ఏర్పడాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అబ్ కీ బార్ సర్కార్ నినాదంతో రైతు ప్రభుత్వం ఏర్పాటు మినహా తమకు వేరే కోరికలేవీ లేవన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన నేతలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు కలుపుకుని మొత్తం 65 సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే కేంద్రం మెడలు వంచలేమా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి ఉండదని, ఈ రకంగా దేశానికి నేతృత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు దక్కుతుందన్నారు. అంబానీ, ఆదానికి అప్పగించి.. దేశంలో నిల్వ ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో 150 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా ఆ్రస్టేలియా, ఇండోనేషియా నుంచి కొనుగోలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. అంబానీ, ఆదానీకి అప్పగించి విద్యుత్ బిల్లులు పెంచేందుకు కేంద్రం వింత చేష్టలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి 20వేల మంది స్వయంగా చూసివెళ్లారని చెప్పారు. దేశంలో నెలకొన్న సమస్యలను తొలగించడానికి కొత్త పార్టీ అవసరముందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే మహారాష్ట్రలో రెండు మూడేళ్లలో వెలుగు జిలుగులు వస్తాయన్నారు. త్వరలో బుల్డానా జిల్లా నుంచి 100 శాతం మంది సర్పంచులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూస్తుంటే వందకు వంద శాతం మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీష్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన చైర్మన్ వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జి వంశీధర్ రావు, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సోలాపూర్ నేత నగేష్ పాల్గొన్నారు. బీఆర్ఎస్కు తోకముడిచి కోతలు ఎత్తేశారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ కాలు పెట్టడంతో తోక ముడిచి విద్యుత్ కోతలు ఎత్తేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్ అమలు చేయాలని సూచించిన కేంద్రేకర్ అనే ఐఎఎస్ అధికారిని సీఎం, మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని ఆరోపించారు. అక్కడ తెలంగాణ మోడల్ అమలుకు రూ.49వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని, సంపద కలిగిన ఆ రాష్ట్రంలో ఆదాయం ఏమవుతోందని ప్రశ్నించారు. ఇప్పటివరకు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ సమస్యలను ఎందుకు దూరం చేయలేకపోయాయని నిలదీశారు. సాగునీరు లేక మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, మహారాష్ట్రలో ఇప్పటికే 70వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరో లక్ష మంది అదే బాటలో ఉన్నట్లుగా తనకు తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
అద్దె బస్సులొస్తున్నాయ్!
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల అవసరాలు, అవస్థలు తీర్చడానికి అద్దె బస్సులొస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు ఇవి నడవనున్నాయి. ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్‌లో కొత్తగా 83 అద్దె బస్సులు నడపడానికి అనుమతులు లభించాయి. దీంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండి, బస్సు సరీ్వసులు తక్కువగా ఉన్న రూట్లను గుర్తించారు. విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నంల నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వీటిని నడపనున్నారు. అంతేకాదు చాన్నాళ్ల నుంచి విశాఖ నుంచి కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండ, సోంపేట, మందస వంటి దూర ప్రాంతాలకు బస్సుల డిమాండ్ ఉంది. బస్సుల కొరతతో సరిపడినన్ని సరీ్వసులను నడపలేక పోతున్నారు. ఇప్పుడు ఈ రూట్లలోనూ అద్దె బస్సులను నడిపి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అధికం ఈ అద్దె బస్సుల్లో అత్యధికంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. మొత్తం 83 అద్దె బస్సులకు గాను 39 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లెవెలుగు,తొమ్మిది సిటీ ఆర్డినరీ, ఎనిమిది సూపర్ లగ్జరీ, ఎనిమిది ఎక్స్‌ప్రెస్, ఏడు అల్ట్రా డీలక్స్ సర్వీసులు. పల్లె వెలుగు సర్వీసులను అనకాపల్లి– నర్సీపట్నం–అనకాపల్లి, అనకాపల్లి–విజయనగరం, నర్సీపట్నం–చోడవరంల మధ్య నడుపుతారు. మెట్రోలను విశాఖ నుంచి విజయనగరం, చోడవరం, కొత్తవలస, భీమిలి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి తదితర రూట్లకు, సూపర్ లగ్జరీలను విశాఖ నుంచి అమలాపురం, కాకినాడలకు, అల్ట్రా డీలక్స్‌లను రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండలకు తిప్పుతారు. సిటీ ఆర్డినరీ సర్వీసులను ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి యలమంచిలి, దువ్వాడ రైల్వే స్టేషన్, సింథియా నుంచి సింహాచలంలకు కేటాయించారు. మూడు నెలల్లో రోడ్లపైకి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. నెలాఖరుకల్లా వీటిని ఖరారు చేయనున్నారు. టెండర్లు ఖాయమయ్యాక అద్దె బస్సుల యజమానులకు మూడు నెలల గడువిస్తారు. ఆర్టీసీ యాజమాన్యం అధీకృత బాడీ బిల్డింగ్ యూనిట్లలో మాత్రమే ఈ బస్సులను తయారు చేయాల్సి ఉంటుంది. అద్దె బస్సులు అందుబాటులోకి వస్తే రద్దీ ఉన్న రూట్లలో బస్సుల కొరత తీరి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. -
ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డు
ప్రపంచ చలన చిత్ర రంగంలోని ఏ నటుడైన ప్రతిష్టాత్మకంగా భావిచే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు రావాలని కోరుకుంటారు. అలాగే ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చిన చాలనుకుంటారు. ఈ అరుదైన అవకాశం తాజాగా స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్కు దక్కింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సూర్య, కాజోల్‌తోపాటు గతేడాది బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న రైటింగ్ విత్ ఫైర్ దర్శకులు సుస్మిత్ ఘోష్, రింటూ థామస్, ఇతర కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ విషయాన్ని జూన్ 28న రాత్రి అకాడమీ బోర్డ్ ప్రకటించింది. 2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జాతులకు చెందిన వారిని, 50 శాతం యూఎస్ఏకు వెలుపల 53 దేశాలు, భూభాగాలకు చెందిన వారిని తీసుకుంటున్నట్లుగా అకాడమీ తెలిపింది. చదవండి: గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం కాగా సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్ నుంచి ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడిగా సూర్య గుర్తింపు పొందారు. సూర్య నటించిన 'జై భీమ్', 'ఆకాశం నీ హద్దురా' చిత్రాలు గతంలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో అవార్డును అందుకోలేకపోయాయి. చదవండి: మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు.. -
నాటా వేడుకలకు సీఎంకు ఆహ్వానం
సాక్షి,అమరావతి: వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాటా సభ్యులు ఆహ్వానించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి జి.నారాయణరెడ్డి, పీఆర్వో డీవీ కోటిరెడ్డి సీఎంను కలసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. -
కేటీఆర్.. ఆస్ట్రేలియాకు రండి
ఆ దేశ విదేశాంగ మంత్రి ఆహ్వానం సాక్షి, హైదరాబాద్ : తమ దేశంలో పర్యటిం చాలని ఐటీ మంత్రి కె.తారకరామారావుకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. డిసెంబర్ 5న మెల్బోర్న్లో జరిగే ఇండియా లీడర్షిప్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పేర్కొ న్నారు. ఈ సమావేశానికి ఇరు దేశాల్లోని 50 మంది ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రభు త్వాధినేతలు, మేధావులు, పాలసీ మేకర్లను మాత్రమే ఆహ్వానించగా, అందులో కేటీఆర్ ఒకరు. ఇరు దేశాల్లోని ప్రభుత్వాల పనితీరు, ఆర్థికపరమైన అంశాలు, వ్యాపార రంగా ల్లోని అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలసీలు, వ్యాపార అవకాశాలపై ప్రసంగిం చాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్‌ను కోరింది. తెలంగాణలోని ఐటీ రంగం, పారిశ్రామిక రంగంలో పెట్టుబ డులు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో భాగ స్వాములయ్యేందుకు ఆస్ట్రేలియాలోని వ్యాపా ర, వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొంది. ఈ సమా వేశాల సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానితో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆస్ట్రేలియా హైకమిషన్ కేటీఆర్‌కు ఈమెరుుల్ సమా చారం పంపింది. దీంతోపాటు ఆస్ట్రేలియా కంపెనీల సీఈవోలు, మైనింగ్ పరిశ్రమలు, ఆ దేశ ఐటీ శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశం ఉంటుందని, మెల్బోర్న్ బయో మెడికల్ పార్క్ పర్యటన కూడా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని తెలుగు కమ్యూనిటీతో కలిసే అవకాశం కల్పిస్తామని, ప్రవాస తెలంగాణ వ్యవహారాల మంత్రిగా ఇతర విషయాలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. -
చేతి వృత్తిదారుల రుణాలకు దరఖాస్తులు
కాకినాడ సిటీ : చేతివృత్తిదారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రుణాల కోసం బీసీ సమాఖ్యలు ఈ నెల 18లోగా ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశహాల్లో బీసీ కార్పొరేషన్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ బీసీ సమాఖ్యల ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. 2016–17 సంవత్సరానికి ఫెడరేషన్లకు పెంచిన రుణ, సబ్సిడీ పరిమితులు, ఏపీఓబీఎంఎంఎస్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు విధానం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.జ్యోతి మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి 50 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం కల్పిస్తారని చెప్పారు. 10 బీసీ ఫెడరేషన్ల కింద నమోదైన సంఘాలు లేదా వాటిలోని ఉప సంఘాల సభ్యులకు రూ.లక్ష సబ్సిడీ, రూ.లక్ష బ్యాంకు రుణం కల్పిస్తారన్నారు. జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, వివిధ ఫెడరేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కెరీర్ కోర్సులకు బోధకులు కావాలి
నగర పాలక పాఠశాలల్లో పోస్టులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పాఠశాలల్లో నిర్వహిస్తున్న కేరీర్ ఫౌండేషన్ కోర్సులను బోధించేందుకు అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని అదనపు కమిషనర్ పి.అరుణ్‌బాబు సూచించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ బోధించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో పీరియడ్‌కు రూ.250 గౌరవ వేతనమని తెలిపారు. బీఎస్సి, బీఈడీ, ఎంఎస్సీ, బీటెక్ అర్హత కల్గినవారు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. నగరపాలక సంస్థ ఉప విద్యాశాఖ అధికారి 98665 14224, జిల్లా కన్వీనర్ 81421 16699 లేదా దగ్గర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని సంప్రదించాలని సూచించారు. -
ప్రీ, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం 2016–17 విద్యా సంవత్సరానికి అందించే ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీకార్పొరేషన్ ఈడీ జమీర్ అహమ్మద్ కోరారు. దరఖాస్తులను ఈ నెల 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 10 తరగతి చదువుతున్న మైనార్టీ విద్యార్థులందరూ అర్హులేనని ఆయన తెలిపారు.ఆన్లైన్ చేసిన దరఖాస్తు లను సంబంధిత కాపీలను జతపరిచి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–246615 నంబరులో సంప్రదించాలన్నారు. -
మీ సేవ కేంద్రాల దరఖాస్తుకు తొలగిన అడ్డంకి
అనంతపురం అర్బన్: పంచాయతీల పరిధిలో 158 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ నెల 7న ‘‘వెబ్సైట్ లాక్’’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడి సాంకేతిక అవాంతరాలు తొలగించినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ap.mee seeva.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 158 మీ సేవ కేంద్రాలకు సంబంధించి పంచాయతీల జాబితా వివరాలనుwww.anantapuramu.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. -
ఓపెన్‌స్కూల్ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌స్కూల్) ద్వారా 2016–17 సంవత్సరంకు గాను పదవ తరగతి మరియు ఇంటర్ ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 15లోపు ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు అపరాధరుçసుంతో చెల్లించవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ రామసుబ్బన్న నెం: 9492587172 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఓపెన్ స్కూల్ గురించి గ్రామాలయందు ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, వయోజన విద్య మండల కన్వీనర్లు, ప్రేరక్‌లు, ఉపాధిహామీ పథక సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించి పదవ, ఇంటర్ ప్రవేశాల సంఖ్యను పెంచాలని డీఈఓ సూచించారు. -
ఆ తాత అందర్నీ ఆకట్టుకున్నాడు..!
కాలేజీ విద్యార్థిని కెల్సే హార్మాన్ వారం క్రితం పోస్ట్ చేసిన ఆమె తాతగారి చిత్రం ఇంటర్నెట్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. మనవళ్ళతో సంతోషంగా, ఆనందంగా గడపాల్సిన ఆయన ముఖం ముడుచుకొని దీనంగా కూర్చోవడం ఆమెకు అత్యంత బాధ కలిగించింది. దీంతో తన ప్రియమైన తాతగారి ఫొటో తీసి ఆమె ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. ఇంతకూ ఆతాతగారి బాధకు కారణం ఏమిటంటే... తన మనవళ్ళు ఆరుగురిలో ఐదుగురే తనతోపాటు విందుకు హాజరవ్వడం తీవ్ర నిరాశను మిగిల్చిందట. తాను స్వయంగా తయారు చేసిన హ్యాంబర్గర్లను వారికి అందించేందకు అందర్నీ విందుకు ఆహ్వానించిన తాతగారికి.. పిల్లల్లో ఇద్దరు రాకపోవడం ఎంతో ఆవేదన కలిగించిందట. దీంతో విచార వదనంతో ఉన్న ఆయన ఫొటోను తీసి సదరు మనుమరాలు ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. ఇంకేముందీ అసలే ముసలాయన, అందులోనూ సంబంధ బాంధవ్యాలకు మంచి ప్రాముఖ్యతనిస్తూ అంత ఆప్యాయంగా పిల్లలకు వండి పెడితే వారు తినకపోవడం మరి బాధపెట్టే విషయమే కాదా? ఎంతైనా ప్రేమను పంచే తాతగార్ని వినియోగదారులు సైతం అలా చూస్తూ ఊరుకోలేకపోయారు. హార్మాన్ బాధను షేర్ చేసుకునేందుకు సామాజిక మాధ్యమంలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోకు వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రే తాతగారిపై అందరికీ అత్యంత అభిమానం పెరిగిపోయింది. మార్చి 16న ట్వీట్ చేసిన చిత్రం 1.7 లక్షల సార్లు రీట్వీట్ చేయడంతోపాటు 2.8 లక్షలమంది లైక్ లు కొట్టేశారు. దీంతో ఆ గ్రాండ్ పా నిజంగానే లక్షల మంది అభిమానం, ప్రేమ సంపాదించడంతోపాటు... ఇతర మనవళ్ళుకూడ కూడ వారి వారి తాతల విశేషాలను షేర్ చేసుకుకోవడం మొదలు పెట్ఆరు. -
'చంద్రబాబు, కేసీఆర్ చిరకాల మిత్ర్రులు'
-
రండి.. భూకేటాయింపు తేలికే!
ఏపీలో మీకోసం.. ప్రత్యేక డెస్కు ఏర్పాటు చేస్తా ‘అమరావతి’ నిర్మాణంలో మీరూ ఓచేయి కలపండి చెంగ్డు పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు రెడ్ కార్పెట్ చైనాలో ఐదోరోజు పర్యటనలో బాబు బృందం బిజీ సిచువాన్ నుంచి షాంఘైకి పయనమైన సీఎం బృందం సాక్షి, హైదరాబాద్: ఏపీలో పెట్టుబడులు పెట్టే చైనా పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటూ పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచీ పరిచారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం బృందం 5వ రోజు గురువారం సిచువాన్ రాజధాని చెంగ్డులో ఏర్పాటైన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది. తమ రాష్ట్రంలో భారీ ల్యాండ్ బ్యాంకు ఉందని, భూ కేటాయింపుల్లో ఎలాంటి సమస్యలూ ఉండబోవని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్, జపాన్ తరహాలో చైనా కూడా సహకరించాలని కోరారు. చెంగ్డును తమ రెండో మజిలీగా చేసుకుంటామని, కొత్త రాజధాని అమరావతిని చైనా అలాగే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియానే తమ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా సిచువాన్ ప్రావిన్షియల్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ వైస్ చైర్మన్ యాంగ్ చింగ్ పింగ్ చెప్పారు. తాము ‘వన్ బెల్ట్-వన్ బ్రెడ్ పాలసీ’ని అనుసరిస్తున్నామన్నారు. తమకు నిర్మాణ రంగంలో గొప్ప నైపుణ్యం ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో తమకు మొదటి అవకాశం లభించిందన్నారు. పెట్టుబడులకు 4 కారణాలు! తమ పెట్టుబడులకు ఏపీని కేంద్రంగా చేసుకునేందుకు చైనాకి, సిచువాన్ రాష్ట్రానికి 4 కారణాలున్నాయని చైనాలో భారత రాయబారి అశోక్ కాంతా వాటిని సవివరంగా చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం ఎంవోయులు కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రు లు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. మేం సహకరిస్తాం: చెంగ్డు మేయర్ లియాంగ్జీ ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని చెంగ్డు మేయర్ టాంగ్ లియాంగ్జీ అన్నారు. భారత్ వచ్చినప్పడు తప్పకుండా ఏపీని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు బృందంతో ఆయన భేటీ అయి మాట్లాడుతూ.. ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లో, వర్సిటీల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు సహకరిస్తామన్నారు. అనంతరం సీఎం గౌరవార్ధం బాబు బృందానికి లియాంగ్జీ విందునిచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఏపీలో హార్డ్‌వేర్ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరారు. అనంతరం ఏపీ బృందం సభ్యులు చెంగ్డు నుంచి షాంఘై వెళ్లినట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.