కాలేజీ విద్యార్థిని కెల్సే హార్మాన్ వారం క్రితం పోస్ట్ చేసిన ఆమె తాతగారి చిత్రం ఇంటర్నెట్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. మనవళ్ళతో సంతోషంగా, ఆనందంగా గడపాల్సిన ఆయన ముఖం ముడుచుకొని దీనంగా కూర్చోవడం ఆమెకు అత్యంత బాధ కలిగించింది. దీంతో తన ప్రియమైన తాతగారి ఫొటో తీసి ఆమె ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది.
ఇంతకూ ఆతాతగారి బాధకు కారణం ఏమిటంటే... తన మనవళ్ళు ఆరుగురిలో ఐదుగురే తనతోపాటు విందుకు హాజరవ్వడం తీవ్ర నిరాశను మిగిల్చిందట. తాను స్వయంగా తయారు చేసిన హ్యాంబర్గర్లను వారికి అందించేందకు అందర్నీ విందుకు ఆహ్వానించిన తాతగారికి.. పిల్లల్లో ఇద్దరు రాకపోవడం ఎంతో ఆవేదన కలిగించిందట. దీంతో విచార వదనంతో ఉన్న ఆయన ఫొటోను తీసి సదరు మనుమరాలు ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. ఇంకేముందీ అసలే ముసలాయన, అందులోనూ సంబంధ బాంధవ్యాలకు మంచి ప్రాముఖ్యతనిస్తూ అంత ఆప్యాయంగా పిల్లలకు వండి పెడితే వారు తినకపోవడం మరి బాధపెట్టే విషయమే కాదా? ఎంతైనా ప్రేమను పంచే తాతగార్ని వినియోగదారులు సైతం అలా చూస్తూ ఊరుకోలేకపోయారు. హార్మాన్ బాధను షేర్ చేసుకునేందుకు సామాజిక మాధ్యమంలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోకు వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రే తాతగారిపై అందరికీ అత్యంత అభిమానం పెరిగిపోయింది.
మార్చి 16న ట్వీట్ చేసిన చిత్రం 1.7 లక్షల సార్లు రీట్వీట్ చేయడంతోపాటు 2.8 లక్షలమంది లైక్ లు కొట్టేశారు. దీంతో ఆ గ్రాండ్ పా నిజంగానే లక్షల మంది అభిమానం, ప్రేమ సంపాదించడంతోపాటు... ఇతర మనవళ్ళుకూడ కూడ వారి వారి తాతల విశేషాలను షేర్ చేసుకుకోవడం మొదలు పెట్ఆరు.
ఆ తాత అందర్నీ ఆకట్టుకున్నాడు..!
Published Tue, Mar 22 2016 2:22 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM
Advertisement