ఓపెన్‌స్కూల్‌ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | Invited applications for admission to open school | Sakshi
Sakshi News home page

ఓపెన్‌స్కూల్‌ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Jul 22 2016 6:23 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

ఓపెన్‌స్కూల్‌ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - Sakshi

ఓపెన్‌స్కూల్‌ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్‌:
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌స్కూల్‌)  ద్వారా 2016–17 సంవత్సరంకు గాను పదవ తరగతి మరియు ఇంటర్‌ ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 15లోపు ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు అపరాధరుçసుంతో చెల్లించవచ్చని సూచించారు.  మరిన్ని వివరాలకు  ఓపెన్‌ స్కూల్స్‌  కో–ఆర్డినేటర్‌ రామసుబ్బన్న నెం: 9492587172 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ గురించి గ్రామాలయందు ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, వయోజన విద్య మండల కన్వీనర్లు, ప్రేరక్‌లు, ఉపాధిహామీ పథక సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించి పదవ, ఇంటర్‌ ప్రవేశాల సంఖ్యను పెంచాలని డీఈఓ సూచించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement