ప్రీ, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
Published Tue, Aug 9 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం 2016–17 విద్యా సంవత్సరానికి అందించే ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీకార్పొరేషన్ ఈడీ జమీర్ అహమ్మద్ కోరారు. దరఖాస్తులను ఈ నెల 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 10 తరగతి చదువుతున్న మైనార్టీ విద్యార్థులందరూ అర్హులేనని ఆయన తెలిపారు.ఆన్‌లైన్ చేసిన దరఖాస్తు లను సంబంధిత కాపీలను జతపరిచి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–246615 నంబరులో సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement