కెరీర్ కోర్సులకు బోధకులు కావాలి
నగర పాలక పాఠశాలల్లో పోస్టులు
విజయవాడ సెంట్రల్ :
నగరపాలక సంస్థ పాఠశాలల్లో నిర్వహిస్తున్న కేరీర్ ఫౌండేషన్ కోర్సులను బోధించేందుకు అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని అదనపు కమిషనర్ పి.అరుణ్‌బాబు సూచించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ బోధించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో పీరియడ్‌కు రూ.250 గౌరవ వేతనమని తెలిపారు. బీఎస్‌సి, బీఈడీ, ఎంఎస్‌సీ, బీటెక్ అర్హత కల్గినవారు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. నగరపాలక సంస్థ ఉప విద్యాశాఖ అధికారి 98665 14224, జిల్లా కన్వీనర్ 81421 16699 లేదా దగ్గర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని సంప్రదించాలని సూచించారు.