CAREER
-
కెరీర్ క్యాట్‌ఫిషింగ్.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్..!
తమ అలవాట్లు, సంప్రదాయ విరుద్ధ ధోరణులతో కార్పొరేట్ ప్రపంచంలో జెన్ జెడ్ వార్తల్లో నిలుస్తోంది. ‘కెరీర్ క్యాట్‌ఫిషింగ్’ అనే కొత్త ట్రెండ్‌తో హల్చల్ చేస్తోంది. యువత ఉద్యోగ ఆఫర్లను అంగీకరిస్తారు.. కానీ వారి యజమానులకు తెలియజేయకుండా వారి మొదటి రోజున ఆఫీసులో కనిపించకుండా పోతారు. సదరు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో యజమానికి తెలియకోవడాన్ని ‘కెరీర్ క్యాట్‌ఫిషింగ్’ అంటారు.ఆన్లైన్ రెజ్యూమ్ ప్లాట్‌ఫామ్ ‘సివిజెనియస్’ నివేదిక ప్రకారం జెన్ జెడ్ ఉద్యోగులు జాబ్ ఆఫర్లను స్వీకరిస్తున్నప్పటికీ యజమానులకు తెలియజేయకుండా మొదటి రోజు హాజరు కావడంలో విఫలమవుతున్నారు. 27 ఏళ్లలోపు ఉద్యోగుల్లో ధిక్కారణ ధోరణి పెరుగుతుందని నివేదిక తెలియజేసింది.నెలల తరబడి ఉద్యోగాల వేట, సుదీర్ఘమైన అప్లికేషన్లు, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు కావడం.. దీనికి సంబంధించి ఫ్రస్టేషన్స్ జెన్ జెడ్‌లో కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఇరవై సంవత్సరాల రాస్పిన్కు 32 లక్షల(సంవత్సరానికి) జాబ్ ఆఫర్ వచ్చినా ఆఫర్‌ను తిరస్కరించడం సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ‘ఈ జీతంతో నేను ఎలా బతకగలను? ఈ జీతంతో ఫుల్‌టైమ్ ఉద్యోగమా!’ అని ఆశ్చర్యపోతుంది ఆమె.ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఈ ధిక్కారం ఒక తరం మార్పును నొక్కి చెబుతుంది. ఉద్యోగం లేదా జీవితం వారి అంచనాలకు అందని పరిస్థితి ఉన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించే ధోరణి పెరగుతుంది. నచ్చని, అంచనాలకు తగని విధంగా ఉద్యోగం ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండడానికే యువతలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. -
Rohit Sharma: టీమిండియా కొంప కొల్లేరు చేస్తున్న రోహిత్
-
‘పోస్ట్’ మార్టమ్... శవాలగదిలో ఉద్యోగమా?
మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటి అని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురీ. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్ట్‌మార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం రామ్ప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసన్న... ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడం ఏమిటి!!’ అనే లింగవివక్షతతో కూడిన మాటలు... ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా!’లాంటి వెక్కిరింపులు ఎదుర్కొన్నా... ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. వృత్తి జీవితంపై గౌరవాన్ని తగ్గించుకోలేదు... ఇచ్చోటనే...నిండా పాతికేళ్లు కూడా నిండని యువకుడి శవం. ‘బహుశా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు’ అని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి... తన పిల్లల్ని తలుచుకొని కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నట్లు అనిపిస్తుంది. ‘ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయాలి. వారి పెళ్లి చూడకుండానే వరద నన్ను మింగేసింది’... మధ్యతరగతి తండ్రి శవం అదేపనిగా రోదిస్తున్నట్లుగా ఉంటుంది. శవాలు మౌనంగా చెప్పే కథలు ఎన్నో విన్నది రామ్‌ప్రసన్న. అలా అని శ్మశాన వైరాగ్యంలాంటిది తెచ్చుకోలేదు. వృత్తిని వృత్తిలాగే ధైర్యంగా నిర్వహిస్తోంది.‘నాకు ఉద్యోగం వచ్చింది అనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు...అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు. వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా’ అంటుంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అసిస్టెంట్ (శవపరీక్ష సహాయకురాలు)గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న.ఆసుపత్రి వెనుక వైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తిజీవితం ముడిపడివుంది. ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు... నిత్యం ఆసుపత్రికి వస్తూనే వుంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహాన్ని సిద్ధం చేయటం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రామ్‌ప్రసన్న ఉద్యోగం.భర్త ప్రోత్సాహంతో...ప్రమాదాల్లో రక్తమోడుతున్న మృతదేహాలూ, నీటిలో ఉబ్బిపోయినవీ, డీ కంపోజింగ్‌కు చేరువైనవి... చూడటమే కష్టం. నెలకు పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చే ఇలాంటి మృతదేహాలను శవపరీక్షకు సిద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? సన్నగా, రివటలా ఉండే రామ్‌ప్రసన్న ఆ విధులను వస్త్రాలకు అతుకులు కుట్టినంత శ్రద్ధగా, అలవోకగా చేస్తోంది.రామ్‌ప్రసన్న దూరవిద్యలో బీఏ చేసింది. కూలి పనులకు వెళుతుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది. డీసీహెచ్ఎస్ నుండి వెలువడిన నోటిఫికేష¯Œ లో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్ పోస్టు కనిపించటంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండాప్రోత్సహించాడు.భయం అనిపించలేదు... ఆసక్తిగా అనిపించింది!తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో పోస్టుమార్టమ్ సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించే వారు కొందరు. ఇలాంటి వారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడడం చాలామందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్తసంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు. ‘ఈ ఉద్యోగంలోకి వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణానికి కారణాలు తెలుసుకోవటం ఆసక్తిగా అనిపించింది. భయం అనిపించలేదు. ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నాను.’ అంటుంది రామ్‌ప్రసన్న. ‘మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి’ అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రామ్‌ప్రసన్న వృత్తిజీవితం, అంకితభావం చెంపపెట్టులాంటిది. ఈ ఉద్యోగం నాకు గర్వకారణంనేను చేస్తున్న ఉద్యోగంపై కొందరి సందేహాలు, భయాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వేరే లోకంలో ఉద్యోగం చేయడం లేదు. గ్రహాంతర జీవులు, ప్రమాదకర వ్యక్తుల మధ్య ఉద్యోగం చేయడం లేదు. నిన్నటి వరకు వాళ్లు మనలాంటి మనుషులే. మన మధ్య ఉన్న వాళ్లే. ్రపాణదీపం ఆరిపోగానే వారిని పరాయి వాళ్లుగా చూసి భయపడడం తగదు. నేను భయపడుతూ ఉద్యోగం చేయడం లేదు. గర్వంగా చేస్తున్నాను. అంకితభావంతో చేస్తున్నాను.– రామ్‌ప్రసన్న – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఉద్యోగాలను మించి.. కెరీర్‌పై దృష్టి
సాక్షి, అమరావతి: మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు ఎంతో క్రేజ్ ఉంది. ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక రూ.కోట్లలో ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ సాధిస్తుంటారు. అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్ సర్వే నిర్వహించారు. పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టిఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే–2023 వెల్లడించింది. 57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్‌లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్షిప్ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఎగ్జిట్ సర్వే ఏం తేల్చిందంటే..» 53.1 శాతం అంటే 1,411 మంది అందివచి్చన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.» 8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలని నిర్ణయించుకున్నారు. » 13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం అంటే 47 మంది పీహెచ్డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.» 321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు. » 134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు. -
కార్పొరేటర్ టు సీఎం..రాజకీయ వ్యూహాల్లో దిట్ట ఫడ్నవీస్
ముంబయి: మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవి చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్(54) రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మహారాష్ట్ర సీఎం స్థాయికి వచ్చారు. ఫడ్నవీస్ 1970 జులై 22న నాగ్‌పూర్‌లో జన్మించారు. ఫడ్నవీస్ తండ్రిపేరు గంగాధర్ ఫడ్నవీస్. జనసంఘ్‌లో, ఆ తర్వాత ఏర్పడిన బీజేపీలో గంగాధర్ ఫడ్నవీస్ పనిచేశారు. కార్పొరేటర్ టు మూడుసార్లు సీఎంవిధేయతకు ఫడ్నవీస్ మారుపేరు. వినమ్రతకు నిలువెత్తు ఉదాహరణ. ఫడ్నవీస్ దగ్గర పార్టీ ధిక్కార స్వరమనేది ఉండదు. రాజకీయాల్లో పలు రికార్డులు ఆయన సొంతం. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి గురువారం (డిసెంబర్ 5)న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ 1989లో బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు.న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. విద్యార్థి నేతగా చురుగ్గా వ్యవహరిస్తూ తన 22వ ఏట నాగ్‌పుర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా ఎన్నియ్యారు.1997లో నాగ్‌పూర్ అక్కడి మేయర్ పదవిని చేపట్టేప్పుడు ఆయన వయసు 27 ఏళ్లంటే ఆశ్చర్యం కలగక మానదు. అతిచిన్న వయసులో మేయర్ పదవి చేపట్టారు ఫడ్నవీస్. దేశంలో చిన్న వయసులో మేయర్ అయిన రెండోవ్యక్తి ఆయన.మోదీ,అమిత్‌షాలకు వీర విధేయుడు తొలిసారి 1999లో నాగ్‌పుర్ నైరుతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. తాజాగా జరిగిన 2024 ఎన్నికలతో కలిపి ఇప్పటికి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.2014లో ఫడ్నవీస్ తొలిసారి సీఎం అయ్యారు. అయిదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శరద్‌పవార్ తర్వాత అతి చిన్న వయసులో (44ఏళ్లకే) మహారాష్ట్ర సీఎం అయిన రికార్డు ఫడ్నవీస్ సొంతం. 2019లో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ మిత్రపక్ష పార్టీగా ఉన్న శివసేన(ఉద్ధవ్) పార్టీ హ్యాండివ్వడంతో మూడు రోజులకే ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది.2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని తన వ్యూహాలతో ఘన విజయం సాధించేలా చేసి మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇదీ చదవండి: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
National Nutrition Week 2024 : స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా మారాలంటే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. సరైన పోషకాహారం, ఆరోగ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఆటగాళ్లకు ఆరోగ్యంతో కూడిన ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్లకు అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.క్రీడా మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ఏ క్రీడా జట్టుకైనా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంతో అవసరం. అథ్లెట్లు, వారి కోచ్‌లకు అనుసంధానంగా క్రీడా పోషకాహార నిపుణులు పని చేస్తుంటారు. అథ్లెట్ లేదా ఆటగాడి పనితీరు వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సూచనలు, సలహాలు అందించే ఆరోగ్య నిపుణులు రాష్ట్రానికి లేదా దేశానికి పతకాలు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కావడానికి బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సు చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక మెడికల్ స్ట్రీమ్‌లోకి వెళ్లేవారు లేదా న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన ఈ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్ లేదా న్యూట్రిషన్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేయడం ద్వారా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా ఉపాధి లేదా ఉద్యోగం పొందవచ్చు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అందిస్తోంది. డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును అన్నామలై యూనివర్సిటీ అందిస్తోంది. డైటెటిక్స్‌లో ఎంఎస్సీని కేరళ విశ్వవిద్యాలయం అందిస్తోంది.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం. క్రీడా పోషకాహార నిపుణులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి, ఉద్యోగ మార్గాలను అందుకోవచ్చు. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులో దివ్య దేశ్‌ముఖ్ (ఫోటోలు)
-
GenAI: మహిళల వృద్ధికి బ్రహ్మాస్త్రం..
ఆకాశంలో సగం అన్న పోవూరి లలిత కుమారి (ఓల్గా) మాటలు నిజమవుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. ప్రస్తుతం ఇండియా టెక్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 36 శాతం మంది స్త్రీలే ఉన్నారు. కానీ నాయకత్వ పాత్రల దగ్గరకు వచ్చేసరికి ఈ సంఖ్య తగ్గుతోంది. కార్యనిర్వాహక స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల శాతం 4 నుంచి 8 శాతం మాత్రమే.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI) ఈ సంఖ్యను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2027 నాటికి గ్లోబల్ AI మార్కెట్ 320 నుంచి 380 బిలియన్లకు చేరుతుందని అంచనా. వృద్ధి 25 నుంచి 35 శాతానికి పెరుగుతుంది. జెన్ ఏఐ ఇందులో 33 శాతం ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని సమాచారం.మహిళల ఎదుగుదలకు జెన్ ఏఐ గణనీయంగా సహాయపడుతుంది. వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి.. విభిన్న బృందాలలో కీలకమైన బాధ్యతలు అందిపుచ్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.భారతదేశ సాంకేతిక రంగానికి వైవిధ్యం అవసరం. ఇది పక్షపాతాలను తొలగించడం, విభిన్న నైతికతలను కలుపుకోవడం ద్వారా సమర్థవంతమైన వ్యవస్థలను నిర్ధారిస్తుంది. టెక్ పరిశ్రమలో లింగ అసమతుల్యతను సరిచేయడానికి అవకాశాలను చేజిక్కించుకోవాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీషా జార్జ్' (Sreyssha George) అన్నారు.నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ 'సంగీతా గుప్తా' మాట్లాడుతూ.. టెక్ పరిశ్రమలో జెన్ఏఐ ఆధిపత్యం చెలాయిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మహిళలు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా స్వంత విజయాన్ని పెంచుకోవడమే కాకుండా ఆయా రంగాల్లో ఆధిక్యత కూడా సాధ్యమవుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?కొత్త టెక్నాలజీకి మద్దతు ఇచ్చే, ప్రోత్సహించే వాతావరణాలను సృష్టించడం ద్వారా GenAI స్వీకరణ సాధ్యమవుతుంది. దీనికి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. వృద్ధి మార్గాలను అన్వేషించడం, అధికారిక & అనధికారిక మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మార్గనిర్దేశం, నైతిక శిక్షణ అందించడం, సాధికారత, వైవిధ్యం సంస్కృతిని నిర్మించడం వంటి వాటికి జెన్ఏఐ దోహదపడుతుంది. -
సత్య నాదెళ్ల సక్సెస్ అయింది ఇలాగేనా..?
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా యాపిల్‌ను అధిగమించేలా మైక్రోసాఫ్ట్‌ను సత్య నాదెళ్ల విజయవంతంగా నడిపించారని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.తనను విజయపథంలో నడపడానికి దోహదపడిన అంశాల గురించి సత్య నాదెళ్ల పలు సందార్భాల్లో వెల్లడించారు. వాటిలో 10 మేనేజ్మెంట్, కెరీర్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం..ఏదీ లేనప్పుడు స్పష్టతను సృష్టించగలగడం ఏ నాయకుడికైనా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.విషయాలు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి మన చుట్టూ శక్తిని సృష్టించుకునే నైపుణ్యాలను పెంచుకోవాలి.నాయకుడనే వాడు మితిమీరిన నియంత్రిత ప్రదేశంలోనూ విజయాన్ని సృష్టించగలగాలి.ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి.విధుల్లో మానసిక భద్రతను పెంపొందించడంలో తాను పెద్దవాడినని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ప్రశ్నలు అడిగినందుకు, ఆందోళనలను పంచుకున్నందుకు లేదా తప్పులు చేసినందుకు ఉద్యోగులు శిక్షకు భయపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది.సత్య నాదెళ్ల సహానుభూతిని మృదువైన నైపుణ్యంగా పరిగణించరు. వాస్తవానికి ఇది మనం నేర్చుకునే కఠినమైన నైపుణ్యమని ఆయన నమ్ముతారు.ఎవరూ "పరిపూర్ణ" నాయకుడు కారు. కానీ వారు తమ ఉద్యోగులకు మరింత స్పష్టత, శక్తి లేదా స్వేచ్ఛను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించే వారు ఎల్లప్పుడూ మెరుగుపడతారు.మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీ ప్రస్తుత బాధ్యతల నుంచి నేర్చుకుంటూ ఉండండి. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు సీఈవో అవుతానని సత్య నాదెళ్ల ఎప్పుడూ అనుకోలేదు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా రాణించడంపైనే దృష్టి పెట్టారు.అడాప్టబుల్గా ఉండండి. మైక్రోసాఫ్ట్ లో పనిచేసినంత కాలం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తాను పనిచేసిన బృందాలు, తాను నిర్వహించిన విభాగాలను బట్టి నిరంతరం మారాల్సి వచ్చిందని సత్య నాదెళ్ల చెప్పారు.మీ లక్ష్యం.. మిమ్మల్ని నడిపించేది ఏమిటో తెలుసుకోండి. మనం ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నందున, పనికి లోతైన అర్థం గురించి ఆలోచించడం అవసరం. -
12 మందితో ఎఫైర్స్.. ఆ ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
1991లో సుభాష్ ఘాయ్ 'సౌదాగర్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్, గోవిందతో లాంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎంత త్వరగా అయితే ఫేమ్ తెచ్చుకుందో.. అంతే వేగంగా కెరీర్ నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ తెలుసుకోవాలనుందా? అయితే ఓ లుక్కేయండి.కెరీర్ నాశనం.. 1990వ దశకంలో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ మనీషా కొయిరాలా.'గుప్త్', 'దిల్ సే', 'కచ్చే ధాగే' 'మన్'లాంటి కమర్షియల్ హిట్స్ సాధించింది. తక్కువ కాలంలోనే భారీ హిట్ సినిమాలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత తన చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. మద్యానికి బానిసై తన అవకాశాలను దెబ్బతీసుకుంది. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. కొద్ది కాలంలోనే ఆమె 50 చిత్రాలు ఫ్లాఫ్గా నిలిచాయి. అంతే కాకుండా 2012లో మనీషాకు క్యాన్సర్ రావడం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు పదేళ్ల పాటు ఆ మహమ్మారితో పోరాడింది.పలువురితో ఎఫైర్స్మనీషా తన నటనా జీవితంలో రిలేషన్ పరంగా కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట ఆమె 'సౌదాగర్'లో హీరో వివేక్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత నానా పటేకర్, డీజే హుస్సేన్ లాంటి వారితో ఎఫైర్‌తో వార్తల్లో నిలిచింది. అంతే కాకుంజా సెసిల్ ఆంథోనీ, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్, అజీజ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, రాజీవ్ ముల్చందానీ, సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డెరిస్ ఇలా దాదాపు 12 మంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ చివరికీ మనీషా కొయిరాలా కూడా నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను 2010లో వివాహం చేసుకుంది. వీరికి పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారు. సినీ జీవితంతో పాటు నిజ జీవితంలో ఇబ్బందులు పడిన మనీషా ఇటీవల ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ విశేష అదరణ దక్కించుకుంది. -
మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా మంచి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.. సాంకేతికతలలో ఉద్యోగులకు నైపుణ్యం లేకుండా పోవడమే అని తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఎవరైతే.. నైపుణ్యం పెంచుకుంటారో వారికే భవిష్యత్తు ఉంటుందని స్టేట్ ఆఫ్ అప్‌స్కిల్లింగ్ కన్స్యూమర్ సర్వే ద్వారా తెలిసింది.2023తో పోలిస్తే.. 2024లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిసింది. కెరీర్లో ముందుకు వెళ్ళటానికి ఇది చాలా అవసరమని ఉద్యోగులకు అర్థమవుతోంది. 97 శాతం మంది మెరుగైన కెరీర్ అవకాశాల కోసం నైపుణ్యం ఒక ముఖ్యమైన అంశం అని భావిస్తున్నారు.డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి వాటిలో నైపుణ్యం సంపాదిస్తున్నారు.ఎప్పటికప్పుడు మారుతున్న ల్యాండ్‌స్కేప్‌లో.. ఎదగాలంటే డేటా సైన్స్, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యం అవసరమని సింప్లిలేర్న్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కాబ్బటి ఉద్యోగులు తమ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను తప్పకుండా పెంపొందించుకోవాలి.లింక్డ్ఇన్ ప్రకారం ప్రస్తుత కార్పోరేట్ లైఫ్‌లో టాప్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపింది. మంచి కమ్యూనికేషన్‌తో పాటు కస్టమర్ సర్వీస్ గురించి అవగాహన ఉన్నవాళ్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని తెలిపింది. అలాగే టీంను నడిపించే నాయకత్వ లక్షణాలు/అనుభవం, కీలకమైన ప్రాజెక్టులను నిర్వహించిన సామర్థ్యం, వేర్వేరు టాప్ పొజిషన్లలో చేసిన నైపుణ్యం ఉన్నవారికి ఢోకా లేదని తెలిపింది.నెంబర్లను విశ్లేషించి వ్యూహాలను మార్చుకునే అనలిటిక్స్ స్కిల్, ఎలాంటి బృందంతోనైనా పని చేసే కలుపుగోలు మనస్తత్వం, దేన్నయినా విక్రయించే టాలెంట్, సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే ట్రబుల్ షూటింగ్ పరిజ్ఞానం అలాగే లోతైన పరిశోధన అభ్యర్థులను అగ్రస్థానంలో ఉంచుతుందని తెలిపింది. (Image Source : LinkedIn Learning) -
Virat Kohli Completes 15 Years In International Cricket: విరాట్ కోహ్లి @ 15 ఏళ్లు.. కింగ్ అరుదైన ఫొటోలు చూశారా?
-
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్‌లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్‌జోన్ దాటి చాలా ఎమోషన్స్‌తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్‌ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్‌గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్‌గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్‌మెడల్ గెలిచింది. స్విమ్మింగ్‌తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్‌గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్‌కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్‌ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్‌గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్‌తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. (ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్ ) ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ముద్దుగుమ్మ. మోడలింగ్‌పై ఆసక్తితో దిల్లీ నుంచి ముంబయి చేరుకున్నట్లు కృతి సనన్ తెలిపింది. అయితే మొదట్లో అవకాశాల కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. సినిమాలు వెళ్లిపోదామనుకున్నా అయితే ఓ ర్యాంప్‌షోలో కొరియోగ్రాఫర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అందరి ముందు అవమానించాడని తెలిపింది. ఆ బాధతో మోడలింగ్ వదిలేద్దామనుకున్నట్లు వివరించింది కృతి. ఇంటికొచ్చేస్తానంటూ ఏడుస్తూ అమ్మకి ఫోన్ చేశానని పేర్కొంది. ప్రతిచోటా సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం సాధిస్తామని ఆ సమయంలో అమ్మ తనకు చెప్పిందని వెల్లడించింది. తన వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది ఆదిపురుష్ భామ. ( ఇది చదవండి: ఓవల్‌లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!) -
నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి
సాథ్ నిభానా సాథియా -2తో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహా జైన్. ఆమె ప్రస్తుతం 'జనమ్ జనమ్ కా సాత్ షో'లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపారు. మొదట్లో సరైన అవకాశాలు ఎన్నోసార్లు మానసికంగా దెబ్బతిన్నానని చెప్పుకొచ్చింది. స్నేహా ఇప్పటికే క్రైమ్ పెట్రోల్, కృష్ణదాసి, క్రైమ్ పెట్రోల్ డయల్ 100 లాంటి సిరీస్‌ల్లో కనిపించింది. (ఇది చదవండి: రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్) స్నేహా జైన్ మాట్లాడుతూ.. 'నాకు చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. మొదట యాక్టింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేశా. ఆ తర్వాత క్రాఫ్ట్ బాగా నేర్చుకునేందుకు థియేటర్ కోర్సు కూడా చేశా. నా పాత్రలు ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేసుకోవాలనుకున్నా. మొదట కొన్ని పాత్రలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కెరీర్ ప్రారంభంలో నాకు స్నేహితుల పాత్రలు వచ్చినందున డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డా. నాకు రోజుకు కేవలం రూ.2 వేలే ఇచ్చేవారు. నలుగురైదుగురు అమ్మాయిలతో కలిసి గదిని పంచుకునేదాన్ని. ఆ రోజులు నాకు జీవితమంటే చాలా నేర్పించాయి. ఇప్పటికీ నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నా. ఈ పరిశ్రమలో అంతులేని పోరాటంగా భావిస్తున్నా.'అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) -
మొదట్లో చాలా భయపడేదాన్ని: ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో భయపడినట్లు తెలిపింది. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. '20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకునేదాన్ని. మానసికంగా ఇబ్బందులు పడ్డా. ఏదైనా సినిమా ఫెయిలైనా.. ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధపడేదాన్ని. నేను చూసిన బిగ్గెస్ట్ స్టార్స్‌తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక ఓ కూతురు కూడా జన్మించింది. తన ముద్దుల కూతురికి మేరీ మాల్టా అని పేరు పెట్టింది. (ఇది చదవండి: పొలిటీషియన్‌ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!) -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్‌ఫామ్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్‌కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
ఇలా చేశారంటే ఇక మీ కెరీర్ రాకెట్ స్పీడే.. దూసుకుపోతుందంతే..!
ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఒక లెక్క ఉంటుంది.. 4 సంవత్సరాల ప్రిపరేషన్, పరీక్షల తర్వాత, వారు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి కెరీర్‌ను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతారు. జాబ్ మార్కెట్‌ను ఛేదించే సామర్థ్యం తమకు ఉందని నమ్ముతారు. కానీ ప్రస్తుత వాతావరణంలో ’ఫ్రెషర్’ లేబుల్ చాలా మంది గ్రాడ్యుయేట్లకు అడ్డంకి మారుతోంది. ఫ్రెషర్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ సాధారణంగా సంస్థల యాజమాన్యాలు అప్పటికే నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌లు కలిగిన సిబ్బందిని కోరుకుంటాయి. ఎందుకంటే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఫ్రెషర్ల వల్ల అయ్యే తక్కువ నియామక ఖర్చుల కన్నా ఎక్కువ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు తరగతి గదిలో సంస్థాగత గత విధులు నేర్చుకోలేరు. అది అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. అందుకే గ్రాడ్యుయేట్లు కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మొదటి ఉద్యోగాలను పొందడం కష్టంగా భావించడంలో ఆశ్చర్యం లేదు. గ్లోబల్ అస్థిరత అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో పోస్ట్–పాండమిక్ జాబ్ మార్కెట్ లో కష్టతరమైన పరిస్థితులను ఫ్రెషర్లు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు తమ ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నాయి లేదా కొత్త, మరింత కఠినమైన నియామక పద్ధతుల నేపథ్యంలో తమ రిక్రూట్‌మెంట్‌ను ఆలస్యం చేస్తున్నాయి, దీనివల్ల వీరు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్యమే.. విజయం.. ఫ్రెషర్లు కెరీర్ వేటలో ఉన్నప్పుడే మరింత ఎక్కువ నైపుణ్యత సాధించి, పోటీని దూరం చేయవచ్చు, ఆకర్షణీయమైన సామర్ధ్యాల పోర్ట్‌ఫోలియోను రూపొందించడం ద్వారా అడ్డంకులను దాటవేయవచ్చు. గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం పెంచుకోవడంలో వ్యయ ప్రయాసలను పెట్టుబడి పెట్టే వారు తోటివారి కంటే రెండింతలు ఎక్కువ సంపాదిస్తారు. ఎక్కువ ఇంక్రిమెంట్లను పొందుతారు. మిగతా వారి కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్య్రం పొందుతారు. ఆధునిక జాబ్ మార్కెట్ నైపుణ్యం రీస్కిల్లింగ్‌ను చాలా ముఖ్యంగా పరిగణిస్తుంది. ఎంపిక జాగ్రత్త.. వ్యక్తిగత సామర్ధ్యాల గురించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత దేనిని ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఫైనాన్స్ టెక్నాలజీ పరిశ్రమలు అధిక జీతాలను అందించేవిగా పరిగణించబడుతున్నాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో, ముఖ్యంగా డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ హాటెస్ట్ సెక్టార్లలో ఒకటిగా ఉద్భవించింది. గత 2022లో, డేటా సైన్స్‌లో నైపుణ్యాలను పెంపొందించడం వల్ల 2040 నాటికి వారి జీతం 57.9 ఎల్పిఎకి.. నైపుణ్యం లేని వారి తోటివారి కంటే 3 రెట్లకు చేరుకునే అవకాశం ఉందని గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం వెల్లడించింది. అదేవిధంగా, 2022లో నైపుణ్యం పెంచుకునే మార్కెటింగ్ ప్రొఫెషనల్ 10 సంవత్సరాల వ్యవధిలో వారి తోటివారి కంటే 100 శాతం ఎక్కువ సంపాదిస్తారు. అలాగే ఆధునిక–యుగపు నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిపుణుడు తోటివారి కంటే 4రెట్ల వరకు సంపాదించగలరు. నైపుణ్యం లేని ఒక ప్రొఫెషనల్ వారి పదవీ విరమణ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం 60 సంవత్సరాల ఆగాల్సి వస్తే... నైపుణ్యం కలిగిన నిపుణులు 50 సంవత్సరాల వయస్సులోపే వారి పదవీ విరమణ నిధిని కూడబెట్టుకుంటారు. పేపర్ పులి కావద్దు... కేవలం కాగితంపై స్కిల్స్ థృవీకరణ పొందడం కంటే వాస్తవిక సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సమయం, డబ్బుపై సాధ్యమైనంత ఎక్కువ రాబడిని సాధించడానికి, పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అందించే ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. ఈ ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. నియామక కంపెనీలతో అనేక అప్‌స్కిల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లు కనెక్షన్లను కలిగి ఉన్నాయి. నెట్వర్క్ పెంచుకోండి.. సామాజిక వృత్తిపరమైన పరిచయాలను పెంచుకోవడం అవసరం. ఇది అప్‌స్కిల్లింగ్‌లో తరచుగా చాలా మంది పట్టించుకోని అంశం. పరిశ్రమ డొమైన్లో అభ్యర్థి తమ నైపుణ్యం సెట్లను అప్డేట్ చేసిన తర్వాత, తదుపరి దశలో తోటి అభ్యాసకుల ద్వారా పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం అలాగే ఉపాధి–కేంద్రీకృత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను తరచుగా పరిశీలించాలి. అలాగే సృజనాత్మకతను, వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడే సోషల్ నెట్‌వర్క్‌ను రూపొందించుకోవాలి. ఒకే రకపు ఆలోచన కలిగిన నిపుణులతో పరస్పర చర్చలు చేయాలి. నైపుణ్యాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోకపోవచ్చు; వాటిని ప్రదర్శించాలి ఎందుకు మీరు అర్హత పొందారో చూపించాలి: అందుబాటులో ఉన్న టూల్స్ ను నేర్చుకోవడం ద్వారా వాటి ప్రయోజనాన్ని పొందాలి. గ్రూపులు ఫోరమ్‌లలో చేరాలి. అలాగే వివిధ ఈవెంట్లలో పాల్గొనాలి. సుస్థిరమైన సభ్యుల గ్లోబల్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ కావాలి. పరిశ్రమకు సంబంధించిన ప్రోగ్రామ్‌లు, హ్యాకథాన్లు సమ్మిట్ల వంటి లైవ్ ప్రాజెక్ట్‌లలో పాల్గొనడం ద్వారా నెట్‌వర్కింగ్‌ను బలోపేతం చేసుకోవాలి. పోర్ట్‌ఫోలియో... ఓ గుర్తింపు. పోర్ట్‌ఫోలియో అనేది మీ గుర్తింపు, మీరు వ్యక్తిగతంగా కాబోయే యజమానిని కలిసే ముందు అది మీ గురించి చెబుతుంది. అలాగే, ఆధునిక, సమకాలీనమైన మీ ప్రతిభ సామర్థ్యాలపై అంతర్గత వీక్షణను అందించగల నిర్దిష్ట డాక్యుమెంటు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ అనుభవాలను వివరించాలి. మీ విజయాలను ప్రదర్శించడానికి వెనుకాడకండి. ప్రాజెక్ట్‌లలో మీరు చూపించిన డైరెక్ట్ రిజల్టులను హైలైట్ చేయండి, పురోగతి భావాన్ని, విజయం సాధించాలనే ఆరాటాన్ని ప్రదర్శించండి. మీరు ఎంచుకున్న నైపుణ్యాలతో సివిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. –హరికృష్ణన్ నాయర్, కో ఫౌండర్, గ్రేట్ లెర్నింగ్ -
అతడి కంటే అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్‌గా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు. దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్‌కు వెళ్లాను. పాండీబజార్‌లోని ఫిలిం ఇన్స్టిట్యూట్కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి. చదవండి: ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..! కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్ వైపు వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్‌ఫాదర్‌గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు. -
అపురూప కల్పన
ముంబైకి చెందిన ఆష్తి మిల్లర్‌ను ‘ఆర్కిటెక్ట్’ అంటే మాత్రమే సరిపోదు. అలా అని ‘ఆర్ట్’కు మాత్రమే పరిమితం చేయలేము. ఇలస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైన్లతో తనప్రోఫెషనల్ కెరీర్‌కు కొత్త మెరుపు తీసుకువచ్చింది. అదే తన ప్రత్యేకశైలిగా మారింది... నేను చేసే వర్క్స్‌లో వీలైనన్ని వివరాలు ఉండేలా జాగ్రత్త పడతాను. దీంతో వీక్షకులు అందులో కొత్తదనాన్ని చూస్తారు. నా ఆలోచన విధానం ఏమిటో తెలిసిపోతుంది. నా మది ఎప్పుడూ రకరకాల ఐడియాలతో నిండిపోయి ఉంటుంది. వాటిలో నుంచి కొన్ని ఐడియాలను తీసుకొని పనిచేస్తాను. – మిల్లర్ ముంబైలోని ఆష్తి మిల్లర్ ఇల్లు క్రియేటివిటీకి సంబంధించిన విషయాలకు కేంద్రంగా ఉండేది. తల్లి ఫైన్ ఆర్టిస్ట్. తండ్రి ఆర్కిటెక్ట్. ఇంటినిండా ఆర్ట్‌కు సంబంధించిన ముచ్చట్లే! చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు రకరకాల మ్యూజియమ్లు, ఆర్ట్గ్యాలరీలకు వెళుతుండేది మిల్లర్. అవి ఊరకే ఉండనిస్తాయా! తనలో సృజనాత్మకమైన ఆలోచనలను పెంపొందించాయి. సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్‌గా తండ్రికి మంచి పేరు ఉంది. అయితే అది రాత్రికి రాత్రి వచ్చేందేమీ కాదు. ఎంతో కష్టపడ్డాడు. తండ్రి కష్టం తనకు ఆదర్శం అయింది. తండ్రి బాటలోనే ఆర్కిటెక్చర్ కోర్సు చదువుకుంది. ‘మిల్లర్ ఇంక్ స్టూడియో’ మొదలు పెట్టింది. ఈ స్టూడియో ద్వారా ప్రోఫెషనల్ కెరీర్ ‘ఆర్కిటెక్ట్’ను తన క్రియేటివిటీకి సంబంధించిన ఇలస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్లతో మిళితం చేసి యూనిక్ స్టైల్‌తో తిరుగులేని విజయం సాధించింది మిల్లర్. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది. మారథాన్లకు సంబంధించిన మెడల్స్‌ను యూనిక్ స్టైల్లో డిజైన్ చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించుకుంది. ఒక ఫిన్‌టెక్ కంపెనీ బ్రాండ్‌కు సంబంధించి మనీఆర్ట్ సిరీస్ కోసం మిల్లర్ సృష్టించిన 14 లేయర్లతో కూడిన ఆర్ట్ వర్క్‌కు మంచి పేరు వచ్చింది. ప్రతి లేయర్లో వివిధ దేశాలకు చెంది కరెన్సీ, వివిధ భౌగోళిక ప్రాoతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ ప్రతిఫలిస్తాయి. మిల్లర్ ఆర్ట్‌వర్క్స్ దేశవిదేశాల్లోని ప్రసిద్ధ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. ‘మిల్లర్ ఆర్ట్‌వర్క్‌లో తాజాదనం కనిపిస్తుంది. సూటిగా మనసును తాకే ఆకర్షణీయత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటి వైవిధ్యాన్ని తన కళలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంది’ అంటుంది క్యూరెటర్ అమ్బ్రోగి. ‘మిల్లర్లోని ప్రత్యేకత ఏమిటంటే ఒకే సమయంలో భిన్నమైన విషయాల గురించి ఆలోచించడం. వాటిని సృజనాత్మకంగా సమన్వయం చేసుకోవడం. ఆమె ఆర్ట్వర్క్స్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, శిల్పం, చిత్రం మిళితమై కనిపిస్తాయి’ అంటున్నాడు ఆర్కిటెక్చరల్ సంస్థ పికార్ట్‌కు చెందిన ఆంథోనీ మార్కెస్.ఆంథోనితో కలిసి అర్బన్ మాస్టర్ ప్లాన్స్ నుంచి పర్సనల్ స్పేసెస్ వరకు ఎన్నోప్రాజెక్ట్లలో పనిచేసింది ఆష్తి మిల్లర్.‘మోర్ ఈజ్ బెటర్’ అనే ఫిలాసఫీని నమ్ముతున్న ఆష్తి మిల్లర్ తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’లో చోటు సంపాదించింది. -
నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్
నార్త్ నుంచి వచ్చి ముందు సౌత్‌లో స్టార్ హీరోయిన్ అయ్యారు రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్ 2’, ‘అయలాన్’లో నటిస్తున్నారు. కాగా హిందీలో ఆమె నటించిన ‘ఛత్రీవాలీ’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్ సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్‌గా నటించారు. ‘‘కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడం. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మనం మారాలి. పిల్లలకు అవగాహన కల్పించాలి. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ఇక.. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రకుల్ చెబుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. ముంబైలో నేను కాండీవాలీలో ఉండేదాన్ని. కానీ నా ట్రైనర్‌తో కలిసి బాంద్రాలో ఒక కేఫ్‌లో కూర్చుని, ఏయే ఆఫీస్‌కి వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలి? అని ప్లాన్ చేసేదాన్ని. బాంద్రా, అంథేరీల్లో ఏమైనా ఆడిషన్స్ ఉంటే వెళ్లొచ్చని ఆ కేఫ్‌కి వెళ్లేదాన్ని. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? బ్యాగులో కొన్ని డ్రెస్సులు పెట్టుకుని, కారులోనే మార్చుకునేదాన్ని. చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. ఒక్కోసారి నాతో షూటింగ్ చేసి, వేరే హీరోయిన్ని తీసుకునేవారు. ఇదంతా నేను పోరాటం అనుకోలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే ‘పోరాటం’ అనే పదం నాకు నచ్చదు. ఆ రోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అన్నారు.