పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు | Aakanksha Singh About Her Marriage Life | Sakshi
Sakshi News home page

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

Sep 26 2019 12:40 AM | Updated on Sep 26 2019 8:03 AM

Aakanksha Singh About Her Marriage Life - Sakshi

‘‘నేను ఇప్పటివరకూ చేసినవి దాదాపు హోమ్లీ క్యారెక్టర్లే. అయితే ‘పహిల్వాన్‌’లో కొంచెం గ్లామరస్‌ రోల్‌ చేశా. హోమ్లీ రోల్సే కాదు.. ఏ పాత్ర అయినా చేస్తా’’ అన్నారు ఆకాంక్షా సింగ్‌. నాగార్జున సరసన ‘దేవదాస్‌’, సుమంత్‌తో ‘మళ్ళీరావా’, సుదీప్‌తో ‘పహిల్వాన్‌’ చిత్రాల్లో నటించిన ఆకాంక్షా సింగ్‌ చెప్పిన విశేషాలు.

► ‘మళ్ళీరావా’ నుంచి ‘పహిల్వాన్‌’ వరకూ నా సినిమాలను ప్రేక్షకులు ఆదిరించి, సపోర్ట్‌ చేశారు. నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్‌లో ఎక్కువమంది హైదరాబాద్‌వారే కావడం హ్యాపీ జైపూర్‌లో పుట్టి పెరిగాను. తెలుగులో ఎక్కువ కాలం పని చేయాలని ఉంది. ‘బాహుబలి’లో అనుష్కగారి పాత్ర చూసి ‘దేవుడా.. ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఇవ్వు’ అనుకున్నా.  

► పెళ్లి చేసుకున్నందు వల్ల నా కెరీర్‌కి ఇబ్బంది అనే ఆలోచనే లేదు. ఎంతో మంది పెళ్లి అయినా హీరోలుగానే చేస్తున్నారు.. పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటోంది. అలాంటప్పుడు పెళ్లి వల్ల కెరీక్‌కి ఇబ్బంది అని హీరోయిన్లనే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. సినిమా రంగంలోనే కాదు ఏ రంగంలోనూ పెళ్లి అనేది కెరీర్‌కి అడ్డంకి కాదు. నా భర్త కునాల్‌ నటుడు కాదు. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా పని చేస్తున్నా. దానికి కారణం ఆయన ప్రోత్సాహమే. ప్రస్తుతం తెలుగు, తమిళ ద్విభాషా సినిమాలో హాకీ ప్లేయర్‌ పాత్ర చేస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement