![Adipurush Heroine Kriti Sanon Shares Her Career Struggles In Bollywood - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/11/Adipurush%20Heroine%20Kriti%20Sanon%20Shares%20Her%20Career%20Struggles%20In%20Bollywood-01.jpg.webp?itok=sgZvtITk)
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్‌తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది.
(ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్ )
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ముద్దుగుమ్మ. మోడలింగ్‌పై ఆసక్తితో దిల్లీ నుంచి ముంబయి చేరుకున్నట్లు కృతి సనన్ తెలిపింది. అయితే మొదట్లో అవకాశాల కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది.
సినిమాలు వెళ్లిపోదామనుకున్నా
అయితే ఓ ర్యాంప్‌షోలో కొరియోగ్రాఫర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అందరి ముందు అవమానించాడని తెలిపింది. ఆ బాధతో మోడలింగ్ వదిలేద్దామనుకున్నట్లు వివరించింది కృతి. ఇంటికొచ్చేస్తానంటూ ఏడుస్తూ అమ్మకి ఫోన్ చేశానని పేర్కొంది. ప్రతిచోటా సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం సాధిస్తామని ఆ సమయంలో అమ్మ తనకు చెప్పిందని వెల్లడించింది. తన వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది ఆదిపురుష్ భామ.
( ఇది చదవండి: ఓవల్‌లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment