
రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బస్టర్ వెల్ కమ్ చెపాల్సిందే. హీరో ఎవరైనా సరే.. ఆమె జోడి కడితే కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవాల్సిందే. అలా అని మహానటి పేరు లేదు. గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు. టోటల్‌గా లక్ ఫ్యాక్టర్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో తనని తిరుగులేని నటిగా నిలబెడుతోంది. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
నాలుగు నెలల్లో మూడు వేల కోట్లు!
రష్మిక కథానాయికగా నటించిన పుష్ప 2 (Pushpa 2: The Rule) గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీతో 1800 కోట్ల వసూళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛావా రిలీజ్.. 800 కోట్ల కలెక్షన్స్. అంటే ఏడాదిలోపే, 2600 కోట్ల వసూళ్లు. ఇప్పుడు ఈద్‌కు మరో బాలీవుడ్ ఫిలిం సికిందర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంత లేదనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల కోట్ల వసూళ్లకు రష్మిక కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది అనేది సంచలనం సృష్టిస్తోంది.
దేశ సినీచరిత్రలోనే..
బాలీవుడ్‌ను ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా భట్, కత్రినాకైఫ్‌కు కూడా ఇలాంటి రికార్డ్ లేదు. భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు. వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డ్ రూ.3500 కోట్లు దాటుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్‌కు ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది. బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది.

(చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్)
కొంత కష్టం.. కొంత అదృష్టం
కెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ. పైగా కష్టపడం ఈ హీరోయిన్‌కు మరింత ఇష్టం. అందుకే ఇంత అందలం. ఆకాశమే హద్దుగా స్టార్ డమ్. ఒక్క బ్లాక్ బస్టర్ అందివస్తేనే కెరీర్ పరుగులు పెడుతుంది. అలాంటిది బాలీవుడ్‌లో రష్మికపై బ్లాక్ బస్టర్స్ వర్షం కురుస్తోంది. హిట్ మీద హిట్, రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి, పడుతున్నాయి. సికందర్‌లో తనకంటే 31 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఆడిపాడింది రష్మిక. ఇక్కడ కూడా మంచి మార్కులే వేయించుకుంది. తనదైన నటనతో సల్మాన్ మనసు గెల్చుకుంది. అందుకే భాయ్ జాన్.. ఏజ్ గ్యాప్‌పై ఓపెన్ అయిపోయాడు.
రష్మికకు, వాళ్ల ఫాదర్ కు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ప్రశ్నించాడు. సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతోందీ బ్యూటీ. అందులో స్త్రీ సిరీస్ లాంటి హారర్ కామెడీ మూవీ కూడా ఉంది. సికిందర్ బాక్సాఫీస్ రిజల్ట్ అనుకున్న స్థాయిలో ఉన్నా, లేకపోయినా ఆ తర్వాత కనిపించే హారర్ కామెడీ మెప్పించకపోయినా బాలీవుడ్‌లో రష్మిక కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏం లేదు. ఎందుకంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లైన్‌లో ఉంది. ఆలాగే పుష్ప-3 పట్టాలెక్కాల్సి ఉంది. ఈ రెండు సీక్వెల్స్‌తో రష్మిక నేమ్, రష్మిక రికార్డ్స్, రష్మిక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య