![Bollywood actress Kriti Sanon appearance with boyfriend](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/krist.jpg.webp?itok=t4TpZOaG)
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. గతేడాది ఎక్కువగా బాలీవుడ్‌లో పలు చిత్రాలతోనే మెప్పించింది. అయితే ఇటీవల ఎక్కువగా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యాపారవేత్తలో ఈ ముద్దుగుమ్మ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. గతంలో చాలాసార్లు అతనితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. గతంలో అతని బర్త్ డే సందర్భంగా కృతిసనన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లొ నిలిచింది.
డిన్నర్‌కు వెళ్తూ..
తాజాగా మరోసారి తన భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ దహియాతో కలిసి జంటగా కనిపించింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్తూ జంటగా కనిపించారు. వీరిద్దరితో పాటు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా వెంటే ఉన్నారు. అయితే కృతి మాత్రం ఫ్యాన్స్‌కు కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. దీంతో వీరిద్దరిపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ ఖాయమనే అంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా గతేడాది వీరిద్దరు కలిసి గ్రీస్‌కు పర్యటనకు వెళ్లారు. అక్కడే వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడంతో ఈ జంట రిలేషన్‌లో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.
ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం దో పట్టిలో కనిపించింది. అంతేకాకుండా గతేడాది క్రూ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. కాగా.. కబీర్ దహియా వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే కబీర్ దహియా.
Comments
Please login to add a commentAdd a comment