ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో పలు చిత్రాలతో మెప్పించింది. అయితే గత కొంతకాలంగా కృతి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్ చూస్తే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో కృతి సనన్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కృతిసనన్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో మెరిసింది. ఆ పెళ్లి మరోవరిదో కాదు.. తన ప్రియుడు కబీర్ బహియా బంధువులదే కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో కృతి సనన్ పెళ్లి చేసుకోబోతోందా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కాగా.. గతంలో కృతి సనన్, కబీర్ బహియా కలిసి విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అయితే తమ రిలేషన్ గురించి వీరిద్దరు ఎక్కడా బయటికి చెప్పలేదు. కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా కృతి సనన్ అతనితో ఉన్న రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేసింది.
కబీర్ బహియా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త. అతని తండ్రి కుల్జిందర్ బహియా యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. అతను స్టార్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సన్నిహితుడు కూడా. మరోవైపు కృతి సనన్ ఈ ఏడాది తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పట్టి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment