![Bollywood actress Kriti Sanon Vacation With Rumoured Boyfriend](/styles/webp/s3/article_images/2024/07/30/k_3.jpg.webp?itok=2p2wGGzo)
ఆదిపురుష్ భామ, బాలీవుడ్ నటి కృతి సనన్ తెలుగువారికి సుపరిచితమే. ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీతగా మెప్పించింది. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అభిమానులను అలరించలేకపోయింది. ఓం రౌత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇటీవల క్రూ మూవీతో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్రీస్‌లో విహరిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న కబీర్ బహియాతో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
గతంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లోనూ ఈ జంట పార్టీలో సందడి చేశారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్‌లో ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే కబీర్‌తో రిలేషన్‌పై ఇప్పటివరకు కృతి సనన్ స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరు జంటగా గ్రీస్‌లో కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా కృతి సనన్ ఇటీవల తన పుట్టినరోజును కబీర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
![lk](/sites/default/files/inline-images/kriti.jpg)
పదేళ్ల ఏజ్ గ్యాప్..
అయితే ఈ జంట మధ్య వయసు అంతరం ఎక్కువగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ వయస్సు 34 ఏళ్లు కాగా.. కబీర్ బహియాకు వయస్సు 24 ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇది చూస్తుంటే తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్‌తో ఆదిపురుష్ భామ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి సనన్ దో పట్టి మూవీలో కనిపించనుంది. ఇందులో కాజోల్, షహీర్ షేక్ కూడా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment