డేటింగ్‌లో ఆదిపురుష్ భామ.. బాయ్‌ఫ్రెండ్‌కు స్పెషల్ విషెస్ | Kriti Sanon just confirm her relationship with Kabir Bahia with this post | Sakshi
Sakshi News home page

Kriti Sanon: బిజినెస్‌మెన్‌తో ఆదిపురుష్ భామ డేటింగ్.. బాయ్‌ఫ్రెండ్‌కు స్పెషల్ విషెస్

Published Wed, Nov 20 2024 1:06 PM | Last Updated on Wed, Nov 20 2024 1:21 PM

Kriti Sanon just confirm her relationship with Kabir Bahia with this post

ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ ఏడాది క్రూ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల దో పట్టి మూవీలోనూ కనిపించింది. అయితే ఇటీవల విదేశాల్లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్‌ డే వేడుకలు సైతం విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్‌ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.

తాజాగా ఇవాళ  కబీర్ బహియా బర్త్‌ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. హ్యాపియస్ట్ బర్త్‌ డే అంటూ లవ్ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్‌ చూస్తే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ జంట డేటింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కబీర్ బహియా యూకేలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం.

అంతేకాకుండా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ సైతం కబీర్‌ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా కబీర్‌, కృతి కుటుంబ సభ్యులతో  దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కృతి చివరిసారిగా నటించిన దో పట్టి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కాజోల్, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement