Kriti Sanon Mother Geeta On Not Letting Her Daughter Act In Lust Stories Movie - Sakshi
Sakshi News home page

Kriti Sanon: అందువల్లే కరణ్ జోహార్ ఆఫర్ తిరస్కరించా: కృతి సనన్

Published Mon, Oct 31 2022 9:07 PM | Last Updated on Tue, Nov 1 2022 9:03 AM

Kriti Sanon Mother Geeta Suggestion To Her daughter act in Lust Stories - Sakshi

మహేశ్‌ బాబు  'నేనొక్కడే’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్‌. ఆ తర్వాత బాలీవుడ్‌లో నటిస్తూ బిజీ అయిపోయింది. కొద్ది కాలంలోనే  స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సాధించింది ఈ భామ. తాజాగా ఆ బ్యూటీకి సంబంధించి ఓ విషయాన్ని షేర్ చేసుకుంది. 2018లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' మూవీలోని నటించేందుకు అవకాశం వచ్చినా తిరస్కరించినట్లు తెలిపింది. కారణం అలాంటి బోల్డ్‌ సీన్లలో నటించేందుకు ఆమె తల్లి ఒప్పుకోలేదని తెలిపింది. దీంతో ఆ పాత్రలో కియారా అద్వానీ నటించింది. కరణ్ జోహార్  కృతి సనన్‌ను సంప్రదించగా ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఇటీవల జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి తల్లి గీతా సనన్ ఈ విషయాన్ని తెలిపింది. ఆమె మాట్లాడుతూ..'కృతి కెరీర్ ప్రారంభంలోనే అలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చలేదు. అలాంటి బోల్డ్ సీన్లలో నటించేందుకు నా కుమార్తెను అందుకే అనుమతించలేదు' అని అన్నారు. 

(చదవండి: ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం)

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృతి మాట్లాడుతూ.. 'మా అమ్మకు స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ పాత్రకు నో చెప్పింది. అందువల్ల నేను ఆ సినిమాలో నటించకపోవడమే మంచిదనిపించింది. నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చా. అందుకే ఇలాంటి సన్నివేశాల్లో నటించాలని నేను ఎప్పుడు అమ్మను అడగలేదు.'  అని అన్నారు.

బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ నటించారు. ప్రస్తుతం కృతి సనన్ వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన 'భేడియా' ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఆమెకు టాలీవుడ్ హీరో ప్రభాస్ 'ఆదిపురుష్', 'గణపత్', 'షెహజాదా', అనురాగ్ కశ్యప్ చిత్రాల్లోనూ నటించనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement