12 మందితో ఎఫైర్స్‌.. ఆ ఒక్క తప్పుతో కెరీర్‌ క్లోజ్‌.. ఆ స్టార్ హీరోయిన్‌ ఎవరంటే? Bollywood actress Manisha Koirala, who starred in 50 flop films and has 12 affaire, which ruined her career. Sakshi
Sakshi News home page

Star actress: 50 సినిమాలు ఫ్లాఫ్.. ఆ ఒక్క తప్పుతో కెరీర్ నాశనం చేసుకున్న స్టార్‌ హీరోయిన్!

Published Fri, Jun 7 2024 5:12 PM | Last Updated on Fri, Jun 7 2024 5:59 PM

Star actress who had 12 affairs and one mistake Ends Her Career

1991లో సుభాష్‌ ఘాయ్‌ 'సౌదాగర్‌' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ. స్టార్‌ హీరోలతో బ్లాక్ బస్టర్‌ చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్, గోవిందతో లాంటి సూపర్ స్టార్‌లతో కలిసి పనిచేసింది. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎంత త్వరగా అయితే ఫేమ్ తెచ్చుకుందో.. అంతే వేగంగా కెరీర్ నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్‌ హీరోయిన్‌ తెలుసుకోవాలనుందా? అయితే ఓ లుక్కేయండి.

కెరీర్ నాశనం.. 

1990వ దశకంలో సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ మనీషా కొయిరాలా.'గుప్త్', 'దిల్ సే', 'కచ్చే ధాగే' 'మన్'లాంటి కమర్షియల్ హిట్స్ సాధించింది. తక్కువ కాలంలోనే భారీ హిట్‌ సినిమాలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత తన చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. మద్యానికి బానిసై తన అవకాశాలను దెబ్బతీసుకుంది. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో కెరీర్ ‍ముగింపు దశకు చేరుకుంది. కొద్ది కాలంలోనే ఆమె 50 చిత్రాలు ఫ్లాఫ్‌గా నిలిచాయి. అంతే కాకుండా 2012లో మనీషాకు క్యాన్సర్‌ రావడం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు పదేళ్ల పాటు ఆ మహమ్మారితో పోరాడింది.

పలువురితో ఎఫైర్స్‌

మనీషా తన నటనా జీవితంలో రిలేషన్ పరంగా కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట ఆమె 'సౌదాగర్‌'లో హీరో వివేక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత నానా పటేకర్, డీజే హుస్సేన్‌ లాంటి వారితో ఎఫైర్‌తో వార్తల్లో నిలిచింది. అంతే కాకుంజా సెసిల్ ఆంథోనీ, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్, అజీజ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, రాజీవ్ ముల్చందానీ, సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డెరిస్ ఇలా దాదాపు 12 మంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు రూమర్స్‌ వచ్చాయి. కానీ చివరికీ మనీషా కొయిరాలా కూడా నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను 2010లో వివాహం చేసుకుంది. వీరికి పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారు. సినీ జీవితంతో పాటు నిజ జీవితంలో ఇబ్బందులు పడిన మనీషా ఇటీవల ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది.

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌ విశేష అదరణ దక్కించుకుంది.

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement