మరో 'గంగుభాయి కతియావాడి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Sanjay Leela Bhansali Heeramandi Trailer Released Today | Sakshi
Sakshi News home page

Heeramandi Trailer: అరడజను హీరోయిన్లతో హీరామండి.. ఆసక్తిగా ట్రైలర్‌ !

Published Tue, Apr 9 2024 6:54 PM | Last Updated on Tue, Apr 9 2024 9:47 PM

Sanjay Leela Bhansali Heeramandi Trailer Released Today - Sakshi

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ వెబ్ సిరీస్‌ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటీష్‌రాజ్‌కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

ట్రైలర్‌ చూస్తే స్వాతంత్ర్యానికి ముందు పాకిస్తాన్‌లో లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో పరిచయం చేశారు. గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ ఆలియా భట్‌తో ఇదే కాన్సెప్ట్‌తో గంగుభాయి కతియావాడి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్‌ కావడంతో అదే తరహాలో హీరామండితో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్‌ మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement