బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో కేదార్‌నాథ్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది ఏ వతన్ మేరే వతన్ మూవీతో మెప్పించిన సారా.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న స్కై ఫోర్స్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ముంబయిలో జరిగిన ఈవెంట్‌లో స్కై ఫోర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీలో సారా మాజీ ప్రియుడు వీర్ పహరియా కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన వీర్ పహారియా.. మాజీ ప్రియురాలు సారా అలీఖాన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సారా అలీ ఖాన్‌తో పని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. షూటింగ్‌లో తనకు మద్దతు అందించినందుకు సారాకు కృతజ్ఞతలు తెలిపాడు.
వీర్ పహారియా మాట్లాడుతూ.. "ఆమె చాలా మంచి వ్యక్తి. సారాకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువ. తనకు ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా అనుభవం ఉంది. అందువల్లే నాకు చాలా సహాయం చేసింది. ఈ విషయంలో సారాకు రుణపడి ఉన్నా. తన మొదటి సినిమాలో మద్దతుగా నిలిచినందుకు సారాకు ధన్యవాదాలు" అని అన్నారు.
కాగా.. 2018లో కేదార్‌నాథ్ మూవీ ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ చిత్ర పరిశ్రమలోకి రాకముందు వీర్ పహారియాతో డేటింగ్ చేసింది. గతేడాది కాఫీ విత్ కరణ్ సీజన్- 7 లో పాల్గొన్న సారా ఈ విషయం బయటకొచ్చింది. ఈ షోలో జాన్వీ కపూర్ వీర్ సోదరుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న సమయంలోనే వీర్‌తో సారా డేటింగ్ చేస్తున్నారని హోస్ట్ కరణ్ జోహార్ ఆమెను ఆటపట్టించాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరు ఎలాంటి రిలేషన్‌లో లేరు. వీర్ పహారియా, సారా అలీ ఖాన్ స్కై ఫోర్స్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24, 2025న విడుదల కానుంది.
పొలిటీషియన్ కుమారుడితో డేటింగ్ రూమర్స్..
మరోవైపు సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌పై గతంలో మరోసారి డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
కేదార్‌నాథ్ పర్యటన వల్లే..
ఇటీవల సారా కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment