బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ఆధ్యాత్మిక బాటపట్టింది. ఇటీవల ముంబయిలో దివాళీ బాష్‌లో మెరిసిన ముద్దుగుమ్మ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. కొండల మధ్య ధ్యానం చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. గతంలోనూ సారా అలీఖాన్ తన ఫ్రెండ్ జాన్వీ కపూర్‌తో కలిసి కేదార్‌నాథ్ సందర్శించింది.
కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం రొమాంటిక్ చిత్రం మెట్రో ఇన్‌డినోలో కనిపించనుంది. ఈ మూవీలో ఆదిత్యరాయ్ కపూర్, ఫాతిమాసనా షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఇది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ చిత్రం స్కై ఫోర్స్‌లో నటించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment