Veer Pahariya
-
మాజీ ముఖ్యమంత్రి మనవడితో టాలీవుడ్ హీరోయిన్ డేటింగ్ (ఫోటోలు)
-
Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో వరుణ్ తేజ్ హీరోయిన్ డేటింగ్?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది మానుషి చిల్లర్. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించి..తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో టాలీవుడ్లో ఈ మాజీ విశ్వసుందరి ఆఫర్లు లభించలేదు. దీంతో మళ్లీ తన మకాంను బాలీవుడ్‌కి మార్చింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇలా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది మానుషి. ప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. అయితే ఇన్నాళ్లు ఆమె ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు మానుషి పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఓ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మాజీ విశ్వసుందరీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు, నటుడు వీర్ పహారియాతో మానుషి డేటింగ్ ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానికి ఓ కారణం ఉంది. ఇటీవల జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా, స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మానుషి, శిఖర్ సోదరుడు వీర్ పహారియా భుజంపై సేదతీరుతూ కనిపించింది. దీంతో మానుషి, వీర్లు ప్రేమలో ఉన్నారని, అందుకే కలిసి టూర్‌కి వెళ్లారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే దీనిపై అటు మానుషి కానీ, ఇటు వీర్ కానీ స్పందించలేదు.(చదవండి: ఈ వారం థియేటర్స్‌లో 11 సినిమాలు..కానీ ఒక్కటి కూడా!)ఇక మానుషీ విషయానికొస్తే.. హరియాణాకు చెందిన ఈ బ్యూటీ 2017లో విశ్వ సుందరిగా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. బాలీవుడ్ మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్లో అక్షయ్‌కు జోడీగా నటించింది మానుషీ. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండో మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా ఫ్లాప్ అయింది. బాలీవుడ్ అచ్చిరాకపోవడంతో టాలీవుడ్ మూవీతోనైనా హిట్ కొడదామని ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా ప్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
బాయ్‌ఫ్రెండ్‌తో హీరో కూతురు మళ్లీ!
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్‌కు తెరంగేట్రం చేయకముందే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. సారాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో ఇటీవల చక్కర్లు కొడుతోంది. సారా తన బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియాతో రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. ముంబైలోని ఓ నైట్ క్లబ్ కు బాయ్ ఫ్రెండ్ వీర్‌తో కలిసి సారా వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కొన్ని నెలలుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని భిన్న కథనాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట తన కూతురు సినిమాల్లోకి రాదని చెప్పిన సైఫ్.. కూతురు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వెల్లడించారు. పాప్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించాలని భావిస్తోన్న వీర్ తో కలిసి ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఈ అమ్మడు సన్నిహితంగా ఉంటోంది. అయితే వీరిద్దరూ ఒకే స్కూలులో చదువుకున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'కు సీక్వెల్ మూవీ త్వరలో తీయనున్నారని, ఆ మూవీతోనే సారా ఎంట్రీ ఖాయమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సైఫ్, మొదటి భార్య అమృతా సింగ్‌కు కుమార్తె సారాతో పాటు కొడుకు ఇబ్రహీమ్ అలీఖాన్ సంతానం. అయితే అమృతతో విడిపోయిన సైఫ్, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. -
షిండే మనవడితో హీరో కుమార్తె డేటింగ్?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్‌కు తెరంగేట్రం చేయకముందే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా తన తండ్రి సైఫ్ బాటలో సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. సారాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో ఇటీవల చక్కర్లు కొడుతోంది. ఓ రాజకీయ నేత మనవడితో సారా డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఈ బ్యూటీకి రిలేషన్ ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. వీర్ దుబాయ్‌లో చదువుకున్నాడు. పాప్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించాలని అతను భావిస్తున్నట్టు సమాచారం. సైఫ్, అతడి మొదటి భార్య అమృతా సింగ్‌కు కుమార్తె సారాతో పాటు కొడుకు ఇబ్రహీమ్ అలీఖాన్ సంతానం. అమృతతో విడిపోయిన సైఫ్.. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.