షిండే మనవడితో హీరో కుమార్తె డేటింగ్?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్కు తెరంగేట్రం చేయకముందే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా తన తండ్రి సైఫ్ బాటలో సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
సారాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో ఇటీవల చక్కర్లు కొడుతోంది. ఓ రాజకీయ నేత మనవడితో సారా డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఈ బ్యూటీకి రిలేషన్ ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. వీర్ దుబాయ్లో చదువుకున్నాడు. పాప్ సింగర్గా కెరీర్ ప్రారంభించాలని అతను భావిస్తున్నట్టు సమాచారం.
సైఫ్, అతడి మొదటి భార్య అమృతా సింగ్కు కుమార్తె సారాతో పాటు కొడుకు ఇబ్రహీమ్ అలీఖాన్ సంతానం. అమృతతో విడిపోయిన సైఫ్.. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.