బాయ్ఫ్రెండ్తో హీరో కూతురు మళ్లీ!
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్కు తెరంగేట్రం చేయకముందే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. సారాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో ఇటీవల చక్కర్లు కొడుతోంది. సారా తన బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియాతో రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. ముంబైలోని ఓ నైట్ క్లబ్ కు బాయ్ ఫ్రెండ్ వీర్తో కలిసి సారా వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కొన్ని నెలలుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని భిన్న కథనాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట తన కూతురు సినిమాల్లోకి రాదని చెప్పిన సైఫ్.. కూతురు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వెల్లడించారు.
పాప్ సింగర్గా కెరీర్ ప్రారంభించాలని భావిస్తోన్న వీర్ తో కలిసి ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఈ అమ్మడు సన్నిహితంగా ఉంటోంది. అయితే వీరిద్దరూ ఒకే స్కూలులో చదువుకున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'కు సీక్వెల్ మూవీ త్వరలో తీయనున్నారని, ఆ మూవీతోనే సారా ఎంట్రీ ఖాయమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సైఫ్, మొదటి భార్య అమృతా సింగ్కు కుమార్తె సారాతో పాటు కొడుకు ఇబ్రహీమ్ అలీఖాన్ సంతానం. అయితే అమృతతో విడిపోయిన సైఫ్, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.