సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment