సైఫ్ ఇంటికి ప్రముఖ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా? | Bollywood Hero Saif Ali Khan Home Visits Police Daya Nayak | Sakshi
Sakshi News home page

Saif Ali Khan: సైఫ్ ఇంటికి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

Published Thu, Jan 16 2025 4:43 PM | Last Updated on Thu, Jan 16 2025 5:02 PM

Bollywood Hero Saif Ali Khan Home Visits Police Daya Nayak

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అయితే దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ దయానాయక్‌ సైఫ్‌ ఇంటిని పరిశీలించారు. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఇప్పటికే ఈ దాడిలో ఇ‍ద్దదు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సైఫ్‌ ఇంటిని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌ (Daya Nayak) కూడా ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కాగా.. ముంబయి అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా దయా నాయక్‌కు పేరుంది.

అసలు ఎవరీ దయా నాయక్‌..

కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం.  1979లో ఆయన ఫ్యామిలీ  ముంబయి షిఫ్ట్ అయింది. అక్కడే అంధేరిలోని కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో  పోలీస్‌ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధుల్లో చేరారు.

దయా నాయక్‌ ఉద్యోగంలో చేరేసరికి అండర్‌వరల్డ్‌ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్‌, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే చోటా రాజన్‌ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్‌ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. డిపార్ట్‌మెంట్‌లోనూ ఆయన పేరు ఓ రేంజ్‌లో వినిపించింది. అండర్‌ వరల్డ్‌ నెట్‌వర్క్‌కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం.

 

daya

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement