ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..! | Gunshots Heard Outside Salman Khan's House In Mumbai | Sakshi
Sakshi News home page

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. వారి పనేనా?

Published Sun, Apr 14 2024 8:47 AM | Last Updated on Sun, Apr 14 2024 10:20 AM

Gun Firing Heard Outside Salman Khan House In Mumbai - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ టాప్‌ టెన్‌ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్‌ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement