
ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్‌ఈని తన సొంతం చేసుకున్నారు. ఈ ప్రత్యేక మోడల్‌ను కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. తన భార్య గౌతమి కపూర్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్‌ఈ మోడల్ కారును 2024లో అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నటుడు ఈ కారును కొనలేదు. దీంతో మొదట ఈ లగ్జరీ కారు కొన్న నటుడిగా రామ్ కపూర్ నిలిచారు. రామ్ తన బ్రాండ్ న్యూ లంబోర్గిని కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అతని వద్ద రామ్ పోర్స్చే , పోర్సే, ఫెరారీ , రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ మిస్త్రీలో కనిపిస్తాడు. ఇది అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరెకెక్కించారు. ఇందులో అతను డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా గతేడాది యుధ్రా మూవీలోనూ మెరిశారు.