రూ.12 కోట్ల విలువైన కారు కొన్న 'వినయ విధేయ రామ' నటుడు | Vivek Oberoi buys swanky Rolls Royce Cullinan Luxury Car Video Goes Viral | Sakshi
Sakshi News home page

Vivek Oberoi: రూ.12 కోట్ల లగ్జరీ కారు కొనుగోలు చేసిన వివేక్ ఒబెరాయ్

Published Tue, Nov 26 2024 7:26 PM | Last Updated on Tue, Nov 26 2024 7:48 PM

Vivek Oberoi buys swanky Rolls Royce Cullinan Luxury Car Video Goes Viral

బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్రాండ్‌ కారును సొంతం చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి లగ్జరీ కారు డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

వివేక్ తన తల్లిదండ్రులు సురేశ్, యశోధర, భార్య ప్రియాంకతో కలిసి కొత్త కారులో ప్రయాణించారు. సిల్వర్ గ్రే కలర్‌ ఉన్న రోల్స్ రాయిస్ కుల్లినన్‌ కారు ధర మనదేశంలో దాదాపు రూ.12.25 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ ఒబెరాయ్ చివరిసారిగా 2019లో పీఎం నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్స్ బయోపిక్‌లో నటించారు.

అంతేకాకుండా మలయాళం, కన్నడతో పాటు తెలుగు చిత్రాల్లోనూ కనిపించారు. తెలుగులో రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. రామ్ చరణ్ చిత్రం వినయ విధేయ రామలోనూ కీలక పాత్ర పోషించారు. సినిమాలతో పాటు ఇన్‌సైడ్ ఎడ్జ్, ధారవి బ్యాంక్, ఇండియన్ పోలీస్ ఫోర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించాడు. విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్‌. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement