కోట్ల రూపాయల కారు గిఫ్ట్‌.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో! | Kartik Aaryan Says Rats Chewed Up Mat Of His Expensive McLaren GT Car, Deets Inside | Sakshi
Sakshi News home page

Kartik Aaryan: కోట్ల విలువైన కారు.. ఎలుకలతో లక్షలు నష్టపోయా!

Published Sun, Jun 9 2024 2:59 PM | Last Updated on Sun, Jun 9 2024 5:08 PM

Kartik Aaryan Says Rats Chewed Up Mat Of His McLaren Car

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ 2022లో భూల్ భూలయ్యా- 2తో సక్సెస్‌ అందుకున్నారు. అంతేకాకుండా గతేడాది షెహజాదా, సత్యప్రేమ్‌ కీ కథ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం చందు ఛాంపియన్‌. ఈ సినిమాను కబీర్‌ ఖాన్‌ తెరకెక్కించారు. భారత తొలి పారాలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.

అయితే భూల్ భూలయ్యా- 2 ​‍ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్‌లారెన్ కారును బహుమతిగా అందుకున్నారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ కారును కార్తీక్‌కు బహుమతిగా ఇచ్చారు.

అయితే ఆ కారే ఇప్పుడు హీరోకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆ కారులోని మ్యాట్‌ను ఎలుకలు పాడుచేశాయని ఆయన తెలిపారు. కేవలం మ్యాట్స్‌ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ కారును గ్యారేజీలో పార్క్ చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక్ నటించిన తాజా చిత్రం చందు ఛాంపియన్ జూన్ 14న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement