Kartik Aaryan
-
ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తల్లిదండ్రులిద్దరూ డాక్టర్స్.. వారి కోరిక మేరకు సైన్స్ చదివాడు కార్తీక్ ఆర్యన్. కానీ మనసు యాక్టింగ్ వైపు పరుగులు తీస్తుండటంతో క్లాసులు ఎగ్గొట్టి మరీ ఆడిషన్స్‌కు వెళ్లేవాడు. అలా మోడలింగ్‌లోనూ అడుగుపెట్టాడు. తొలి సినిమాకు సంతకం చేశాక ఇంట్లో చెప్పి ఒప్పించాడు. అలా ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. ఓటీటీలోకి వచ్చేసిన బయోపిక్ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయన ఈ ఏడాది చందు ఛాంపియన్ సినిమాతో అలరించాడు. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. రెంట్ పద్ధతిలో..అమెజాన్ ప్రైమ్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడప్పుడే ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. రూ.199 చెల్లించి రెంట్ పద్ధతిలో చూసేయొచ్చు. ఈ మూవీలో మనసును మెలిపెట్టే సీన్స్ చాలానే ఉన్నాయట! ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను ఉచితంగానే చూడాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే! #ChanduChampion now available on Amazon Prime ❤️ #KartikAaryan https://t.co/qLfCy75KVm pic.twitter.com/DqtfsuxtVB— Chiji 🐣 (@StanningKartik) July 25, 2024 చదవండి: ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్ -
థర్డ్ హ్యాండ్ కారు.. వర్షం వస్తే కారులో వాటర్ లీకేజీ..
మార్కెట్లోకి కొత్తగా ఫోన్లు, కార్లు వస్తున్నాయంటే చాలు వాటిని కొనేందుకు సిద్ధమయ్యేవారు చాలామందే ఉన్నారు. అలా సినిమా హీరోల గ్యారేజీలో ఎప్పటికప్పుడు కొత్త కార్లు చేరుతూనే ఉంటాయి. అయితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ మాత్రం ఒకప్పుడు కొత్త కారు కొనే స్థోమత లేక థర్డ్ హ్యాండ్ కారు వాడాడు.థర్డ్ హ్యాండ్ కారుద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైన కార్తీక్ ఆర్యన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'నేను ఓ వ్యక్తి వాడిన కారు కొన్నాను. కానీ అది అతడికే సెకండ్ హ్యాండ్ కారు. అలా నేను థర్డ్ హ్యాండ్ కారు వాడాను. అవార్డుల కార్యక్రమానికి, ప్రత్యేక ఈవెంట్లకు వెళ్లేందుకు ఆ కారు ఉపయోగించేవాడిని. ఆ కారు నన్ను చాలా సతాయించేది. డ్రైవర్ సీటు దగ్గర ఉండే డోర్ ఓపెన్ అయ్యేది కాదు. అవతలి డోర్ తెరుచుకుని బయటకు వచ్చేవాడిని. వర్షాలు పడ్డప్పుడయితే పరిస్థితి దారుణంగా ఉండేది. నీళ్లు లోపలకు వచ్చేవి. డ్రైవింగ్ చేస్తుండగా ఆ నీళ్లు నెమ్మదిగా లీకై నా నెత్తిన పడేవి అని చెప్పుకొచ్చాడు.కార్లుకాగా కార్తీక్ ఆర్యన్.. ఇద్దరు వాడిన కారును యూజ్ చేసే స్థాయి నుంచి లగ్జరీ కారు కొనే రేంజ్‌కు ఎదిగాడు. ప్రస్తుతం ఇతడి దగ్గర మూడున్నర కోట్లు విలువ చేసే మెక్లారెన్ జీటీ, రూ.4.17 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ అలాగే ఓ లంబోర్గిని ఉన్నాయి. 2011లో ప్యార్ కా పంచనామా సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఇతడు ప్రస్తుతం టాప్ హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవలే భూల్ భులయా 2, సోను కీ టిటు కి స్వీటి, చందు ఛాంపియన్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.చదవండి: అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఎందుకు మరి బిల్డప్? నటి కౌంటర్ -
కోట్ల రూపాయల కారు గిఫ్ట్.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2022లో భూల్ భూలయ్యా- 2తో సక్సెస్ అందుకున్నారు. అంతేకాకుండా గతేడాది షెహజాదా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం చందు ఛాంపియన్. ఈ సినిమాను కబీర్ ఖాన్ తెరకెక్కించారు. భారత తొలి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.అయితే భూల్ భూలయ్యా- 2 ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్లారెన్ కారును బహుమతిగా అందుకున్నారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ కారును కార్తీక్‌కు బహుమతిగా ఇచ్చారు.అయితే ఆ కారే ఇప్పుడు హీరోకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆ కారులోని మ్యాట్‌ను ఎలుకలు పాడుచేశాయని ఆయన తెలిపారు. కేవలం మ్యాట్స్ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ కారును గ్యారేజీలో పార్క్ చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక్ నటించిన తాజా చిత్రం చందు ఛాంపియన్ జూన్ 14న విడుదల కానుంది. -
డబ్బు తీసుకోలేదు.. చాలామంది ఇలాగే.. దీనిగురించి ఎవరూ మాట్లాడరు!
కొందరు హీరోలు పైసా తక్కువైతే చాలు ప్రాణం పోయినట్లు ఫీలవుతారు. మరికొందరు నిర్మాతల పరిస్థితిని, సినిమా రిజల్ట్‌ను బట్టి రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు లేదంటే ఒక్క రూపాయి కూడా తీసుకోరు. హీరో కార్తీక్ ఆర్యన్ రెండో రకానికి చెందినవాడు. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల సదరు సినిమాకు పని చేసే టెక్నీషియన్స్‌కు ఇతర నటీనటులకు సరైన డబ్బు అందడం లేదని ఈ మధ్య బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. తడిసి మోపెడవుతున్న బడ్జెట్హీరోల పారితోషికానికి తోడు.. వారి మేకప్‌మెన్‌కు, హెయిర్ డ్రెస్సర్‌కు, స్టైలిస్ట్‌కు.. ఇలా తన దగ్గర పనిచేసే అందరికీ జీతాలివ్వాలని సరికొత్త డిమాండ్లు పెడుతుండటంతో బడ్జెట్ మితిమీరిపోతోందన్నది ప్రధాన అంశం. తాజాగా దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. ఈ చర్చ జరగకముందు నేను షెహజాదా సినిమా చేశాను. చిత్ర నిర్మాతల దగ్గర సరిపడా బడ్జెట్ లేకపోవడంతో నా ఫీజు వదిలేసుకున్నాను. రెమ్యునరేషన్ తీసుకోలేదని సినిమా నిర్మాతల్లో నేనూ ఒకడినని క్రెడిట్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరూ రాయరు.హీరోల త్యాగం చూడరే!నేనే కాదు, చాలామంది స్టార్స్ నిర్మాతల కోసం ఆలోచించి చాలా సాయం చేస్తుంటారు. వారికి తోడుగా ఉంటారు. దర్శకుడు, యాక్టర్స్, నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే ఆలోచిస్తారు. ఎవరూ దాన్ని సాగదీయాలని చూడరు. సినిమా ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకైతే నా డబ్బులు నాకు ముట్టాల్సిందే అని ఎవరూ మాట్లాడరు అని చెప్పుకొచ్చాడు.అల వైకుంఠపురములో రీమేక్‌కాగా అల వైకుంఠపురములో సినిమాకు రీమేక్‌గా షెహజాదా తెరకెక్కింది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ -
ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు
బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. రీసెంట్గా ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లలో హీరో బంధువులు కూడా ఉన్నారు. తాజాగా వాళ్ల అంత్యక్రియలకు సదరు హీరో హాజరు కావడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)సోమవారం సాయంత్రం మంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఘాట్కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. దాంతో దాని కింద 100 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. వీళ్లలో హీరో కార్తిక్ ఆర్యన్ అంకుల్ మనోజ్ చన్సోరియా(60), ఆంటీ అనిత (59) కూడా ఉన్నారు.తాజాగా వీళ్లిద్దరికీ అంత్యక్రియలు జరగ్గా.. కార్తిక్ ఆర్యన్ హాజరయ్యాడు. తన బంధువులకు తుది నివాళులు అర్పించాడు. ఇకపోతే హోర్డింగ్ కుప్పకూలిన కేసులో నిందితుడు భవేశ్ పాండేని పోలీసులు అరెస్ట్ చేశారు. భవేశ్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు..: నటి లయ)14 killed, 74 injured in this giant hoarding collapse in Mumbai’s dust storm yesterday. The 17,000 sqft hoarding was listed in the Limca Book of Records last year. The BMC says it was illegal, unauthorised.FOURTEEN lives gone & counting.Banana republic. pic.twitter.com/uHqx0tW1in— Shiv Aroor (@ShivAroor) May 14, 2024 -
వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్.. డేటింగ్ చేసి తప్పు చేశా: హీరో
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. తెలియకుండానే కొందరు ప్రేమలో పడిపోతారు. కానీ కొందరే చివరివరకు ఆ ప్రేమను నిలుపుకుంటారు. చాలామటుకు ప్రేమలు మధ్యలోనే పుటుక్కుమంటాయి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేనికీ శుభం కార్డు పడలేదు. లవ్ ఆజ్ కల్ 2 సినిమా షూటింగ్ సమయంలో సారా అలీ ఖాన్‌తో, దోస్తానా 2 మూవీ చిత్రీకరణ టైంలో జాన్వీ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఇద్దరమ్మాయిలతో డేటింగ్ దోస్తానా 2 షూటింగ్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. అప్పుడే వీరి ప్రేమ కూడా ముగిసిపోయింది. తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్.. తన పాత లవ్ కహానీల గురించి ప్రస్తావించాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు అవునని బదులిస్తూనే.. ఒకవేళ నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు. కనిపిస్తే అదే అడుగుతా మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతావు? అని హోస్ట్ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్.. ఇద్దరూ క్లోజ్‌ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్ సినిమా చేస్తున్నాడు. అలాగే భూల్ భులయ్యా 3, ఆషిఖి 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి. చదవండి: నటి భర్తకు గుండెపోటు.. క్షమాపణలు చెప్తూ పోస్ట్! -
మొన్నే రూ.6 కోట్ల కారు కొన్న హీరో.. ఇప్పుడేమో సైకిల్‌పై..
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ మధ్యే ఓ కారు కొన్నాడు. రూ.6 కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కారు సొంతం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే డిక్కీలో పడుకున్న ఓ ఫోటో కూడా పోస్ట్ చేశాడు. కానీ నిన్న మాత్రం ఎంచక్కా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన జనాలు.. ఏంటన్నా.. అంత పెద్ద కారు కొని ఇలా చిన్న సైకిల్ మీద తిరుగుతున్నావ్ అని కామెంట్లు చేస్తున్నారు. రూ.6 కోట్ల కారు కొని సైకిల్‌పై.. అయితే కార్తీక్ మాత్రం.. ఇలా సైకిల్ మీదే సెట్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నానంటున్నాడు. అలాగైతే ఆ ఆరు కోట్ల కారు మాకు ఇచ్చేసేయ్ అని ఓ అభిమాని అడగ్గా.. నా ఫ్రెండ్ ఒకరు కారు కావాలని తీసుకెళ్లాడు. తిరిగిచ్చేయగానే చెబుతానంటూ రిప్లై ఇచ్చాడు. కారు కొన్నాక కూడా ఎందుకని సైకిల్ తొక్కుతున్నావన్న ప్రశ్నకు.. పాత అలవాట్లను మానుకోవడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పుకొచ్చాడు. చేతిలో రెండు సినిమాలు మొత్తానికి కార్తీక్ సైకిల్ మీద వెళ్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్లో చందు చాంపియన్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే సూపర్ హిట్ హారర్ మూవీ భూల్ భులాయా 2 సినిమా సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇందులో నేషనల్ క్రష్ లిస్టులో కొత్తగా చేరిన హీరోయిన్ తృప్తి డిమ్రితో పాటు విద్యాబాలన్ ఉన్నారు. ఈ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన జావేద్ అక్తర్ -
రూ.5 కోట్లు విలువ చేసే కారు కొన్న యంగ్ హీరో
తెలుగు హీరోల్లో చాలామంది దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. కాకపోతే వాటి గురించిన సమాచారం పెద్దగా బయటకు రాదు. కొత్త కారు కొన్నా సరే వాళ్లకు తప్పితే బయటకు వ్యక్తులకు తెలిసే అవకాశాలు చాలా తక్కువ. కానీ బాలీవుడ్లో మాత్రం కార్ల హడావుడి మామూలుగా ఉండదు. తాజాగా అలానే యంగ్ హీరో.. ఏకంగా రూ.5 కోట్లు విలువ చేసే కారు కొన్నాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. (ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం) బాలీవుడ్లో ప్రస్తుత జనరేషన్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ కాస్త డిఫరెంట్. ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. 'భూల్ భులయ్యా 2', 'సత్య ప్రేమ్ కి కథ' చిత్రాలతో గతేడాది హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లని కొనుగోలు చేసిన కార్తిక్ ఆర్యన్.. ఇప్పుడు తన గ్యారేజీలోకి ఏకంగా ఆరో కారుని తీసుకొచ్చాడు. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ దగ్గర ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, మెక్ లారెన్ జీటీ, మినీ కూపర్ ఎస్, లాంబోర్గిని ఊరుస్ క్యాప్సల్, పోర్స్ 718 బాక్స్టర్ లాంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు లిస్టులోకి రేంజే రోవర్ 4.4p lwb sv కారుని కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు రూ.5 కోట్ల వరకు ఉందట. కారు కొన్న విషయాన్ని ఈ హీరో పోస్ట్ చేయగా, రేటు గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
కాస్కోండి మూడోసారి కూడా ఈ సినిమాతో భయపెట్టడం గ్యారెంటీ
హారర్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘భూల్ భులయ్యా’. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో భాగంగా రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌తో ఆ సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు మేకర్స్. సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న 'చంద్రముఖి' సినిమాకు రీమేక్ వెర్షన్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సినిమా 'భూల్ భులయ్యా'. 2007లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు పోషించారు. 'చంద్రముఖి' డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. దీంతో సుమారు 15 ఏళ్ల తర్వాత అనీస్ బజ్మీ దర్శకత్వంలో 'భూల్ భులయ్యా 2' విడుదలైంది. 2022లో వచ్చిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ, టబు నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ ప్రాంచైజీకి బాలీవుడ్లో మంచి గుర్తింపు రావడంతో మూడో ప్రయత్నానికి ముహూర్తం కుదిరింది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సెట్స్‌కు చేరకముందే దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 'భూల్ భులయ్యా 3' నవంబర్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!
బాలీవుడ్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్ భూలయ్యా’, 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్ భూలయ్యా’ ఫ్యామిలీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్. -
హీరోను ఒక్కసారి చూసేందుకు.. 1000 కి.మీ. సైకిల్ తొక్కుతూ..
సెలబ్రిటీలంటే పడి చచ్చేవాళ్లు బోలెడంత మంది! వారి సినిమాలు రిలీజవుతున్నా, రీరిలీజ్ అవుతున్నా థియేటర్ల వద్ద తెగ హంగామా చేస్తుంటారు. ఆన్లైన్లో చేసి హడావుడి అంతాఇంతా కాదు. ఇక ఆ తారలను ఒక్కసారైనా చూడాలని, సెల్ఫీ దిగాలని తహతహలాడిపోయే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందో తాజా ఘటన. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే! చాలాచోట్ల ఇతడికి అభిమానులున్నారు. తొమ్మిది రోజులుగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ హీరోను చూడటం కోసం తన స్వస్థలం నుంచి సైకిల్ తొక్కుకుంటూ ముంబైకి వచ్చాడు. ఇందుకోసం అతడికి దాదాపు తొమ్మిది రోజులు పట్టినట్లు తెలుస్తోంది. తన ఇంటి బయట ఉన్న ఈ అభిమానిని చూసిన కార్తీక్ అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ ఆ ఫ్యాన్ మాత్రం హీరో పాదాలకు నమస్కరించాడు. దీంతో అతడిని అలా చేయొద్దని వారించి తనతో కలిసి ఫోటో దిగాడు. వీడియో వైరల్ అంత దూరం నుంచి సైకిల్‌పై ఎలా వచ్చావని అడిగాడు. అందుకా అభిమాని.. కేవలం మిమ్మల్ని కలుసుకోవడానికే ఊరి నుంచి వెయ్యికి పైగా కిలోమీటర్లు ఈ సైకిల్ తొక్కుకుంటూ వచ్చేశాను అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కార్తీక్ ప్రస్తుతం చందు చాంపియన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!
-
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేయడం మంచిదేనా?
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ భారీ బడ్జెట్ మూవీ 'షెహజాదా'తో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత 'సత్యప్రేమ్‌కి కథ'తో ప్రేక్షకుల మన్ననలను పొంది నెమ్మది నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకునే యత్నం చేశాడు. మళ్లీ అలానే మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రఖ్యాత దర్శకుడు కబీర్ ఖాన్ నిర్మిస్తున్న 'చందు ఛాంపియన్' మూవీతో మన ముందుకొస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈ మూవీ షూటింగ్ ఒక ఏడాదికి పైగా పట్టింది. పగలు, రాత్రి అనక జరిగిన నిర్విరామ షూటింగ్లో హీరో ఆర్యన్ చక్కెర జోలికే పోలేదట. ఈ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి అవ్వడంతో దర్శకుడు కబీర్ సింగ్ ఇప్పుడైన నోరీ తీపి చేసుకోమంటూ రసమమలై తీసుకొచ్చి హీరో ఆర్యన్‌కి తినిపించాడు. ఈ మూవీ షూటింగ్ ఎంతలా విజయవంతంగా పూర్తి అయ్యిందో, అలానే ఈ మూవీ నీకు మంచి పేరు తెచ్చిపెడుతుందంటూ ఆర్యన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్యన్ తన కొత్త సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే..దాదాపు ఏడాదికి పైగా చక్కెర లేని ఆహారమే తీసుకున్నాడు. పైగా చక్కెరకు బదులు తాను సహజ ఉత్పత్తుల తీసుకున్నట్లు కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఆ హీరోలా చేస్తే శరీరంలో సంభవించే మార్పేలేంటి తదితరాల గురించి తెలుసుకుందామా!. ఒక ఏడాది పాటు ఆ హీరోలా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎవ్వరైన దీన్ని ప్రయ్నతించవచ్చా?. ఈ డైట్ కారణంగా శరీరంలో ఎలా ప్రభావితమవ్వుతుంది, ఇది మంచిదేనా? అంటే..పూర్తిగా చక్కెరకు దూరంగా ఉండటం లేదా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరం అనేక సానుకూల మార్పులకు దారితీస్తుంది. మొదట్లో ఈ డైట్ పాటించటం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. క్రమేణ మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ సమ స్థాయిల్లో ఉండటం జరగుతుంది. తద్వారా మానసికోల్లాసం ఏర్పడి జీవక్రియ మెరుగుపడుతుంది. ఒబెసిటీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గి నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ డైట్ వల్లే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో సవివిరంగా చూద్దాం!. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది: ఒక టీస్పూన్ చక్కెరలో 20 కిలో కేలరీలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కెరను పూర్తిగా దూరంగ పెట్టగలిగితే ఇన్సులిన్ సెన్సిటివిటీకీ సహాయపడుతుంది. టైప్ 2 డయబెటిస్ రాకుండా చేస్తుంది. ఒక రకంగా దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దరిచేరవు. ఎప్పుడైతే పరిమిత కేలరీలు తీసుకుంటామో అప్పుడూ ఆటోమెటిక్‌గా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది: చక్కెర వినియోగం ఎప్పుడైతే తగ్గిస్తామో.. ముందుగా మానసిక స్థితిలో మంచి మార్పులు వస్తాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది తద్వారా మతిమరుపు వంటి బ్రెయిన్ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం ఏర్పడి తెలియని మానసికోల్లాసం వస్తుంది. నిజం చెప్పాలంటే చక్కెర వినియోచటం మానేయడం వల్ల చాలావరకు పాజిటివ్ మార్పులే చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో పంచదార తీసుకోకపోతే నీరసంగా అనిపిస్తుంది. ఎలాగైతే ఆల్కహాల్ అకస్మాత్తుగా వదిలేస్తే సమస్యలు ఎదురవ్వుతాయో అలాంటి లక్షణాలే పంచాదర మానేసిన వారిలోనూ కనిపిస్తాయట. అంతేగాదు నీరసం తోపాటు మానసికంగా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందట. అయితే శరీరంలో మెటబాలిజం మాత్రం పెరుగుతందట. ఫలితంగా ఎలాంటి దీర్ఘాకాలిక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇక్కడ చక్కెరను తగ్గించడం అంటే దానికి బదులుగా బెల్లం లేదా కృత్రిమ స్వీటెనర్లతో భర్తీ చేయడం కాదు. చక్కెర, బెల్లం రెండూ సమాన కేలరీలను కలిగి ఉంటాయనే విషయం గుర్తించుకోవాలి. అందువల్ల మనం తీసుకునే స్వీట్లు, పానీయాలు, శక్తి పానీయాలు వంటి వాటిల్లోని షుగర్ కంటెంట్ దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటేనే మంచింది. అలాగే ఈ నో షుగర్ డైట్‌ని ఫాలో అయ్యే మందు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుడిని సంప్రదించి వారి మార్గదర్శకంలో సరైన విధంగా ఈ డైట్‌ని ఫాలో అయ్యి సత్ఫలితాలను పొందడం మంచిది. ఏదీఏమైన చక్కెరను పరిమిత చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చనేది వాస్తవం. (చదవండి: ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'! ఇప్పటికీ రాత్రిళ్లు అక్కడకు వెళ్తే హడలిపోవాల్సిందే!) -
బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
బాలీవుడ్ నటి తారా సుతారియా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అపూర్వ అనే చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, ధైర్య కర్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. తన ప్రియుడు, నటుడు ఆదార్ జైన్‌తో విడిపోయిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని తారా ధృవీకరించింది. తాను అతనితో రిలేషన్లో లేనని పేర్కొంది. కాగా.. మరోవైపు కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ అయినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. తారా మాట్లాడుతూ.. "ఇలాంటివి వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంది. నా గురించి ఇలా రాయడం చాలా బాగుంది. నిజ జీవితంలో నేను కూల్‌గా ఉండాలనుకుంటున్నా. అయితే ఈ వ్యక్తులందరితో నేను పనిచేశా. కానీ నాపై వస్తున్న అన్నీ రూమర్సే. ఎలాంటి నిజం లేదు. ఈ పుకార్లలో ఏదీ నిజం కాదు. ఒక్క వారంలోనే నేను ముగ్గురు వేర్వేరు వ్యక్తులను కలిశా. ఈ ప్రపంచంలోనే నాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి విషయాల్లో నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఇలాంటివి చదివితే వాళ్లే నా దగ్గరకు వస్తారు. తీరిగ్గా టీ తాగుతూ మాట్లాడుకుంటామని' తెలిపింది. కాగా.. తారా సుతారియా నటించిన అపూర్వ నవంబర్ 15న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?
ఇటీవలే వరుస సినిమాలతో దూసుకెళ్లన్న బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. తాజాగా 'సత్య ప్రేమ్ కీ కథ' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ యంగ్ హీరోకు సంబంధించి బీ టౌన్లో ఓ వార్త తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్) కార్తీక్ ఆర్యన్ తాజాగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతం జుహులో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన ఫ్లాట్ విలువ దాదాపు రూ. 17.50 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తిని జూన్ 30వ తేదీన కొ నుగోలు చేసినట్లు సమాచారం. కార్తీక్ ఆర్యన్ తన తల్లి మాలా తివారీ ఈ ఫ్లాట్ కొనుగోలుకు డీల్ కుదిర్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి కార్తీక్ ఆర్యన్ నెలకు రూ.7.5 లక్షలు చెల్లిస్తూ షాహిద్ కపూర్ ఇంటిలో నివసిస్తున్నారు. కాగా.. ప్యార్ కా పంచ్‌నామా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సత్యజీత్ కీ ప్రేమ్ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్యన్.. తదుపరి చిత్రం కెప్టెన్ ఇండియాలో నటించనున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!
ఒకప్పుడు బాలీవుడ్ అంటే మెలోడీ సాంగ్స్, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఆ పరిస్థితి తలకిందులైంది. ఇటీవల పఠాన్ సినిమా మినహాయిస్తే వరుస ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ రీమేక్‌లపై ఆధారపడిందంటూ పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో రోజు రోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి మరింత దిగజారిపోతోంది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా రీమేక్‌లపైనే ఆధారపడుతోంది. అయితే ఈ సారి ఏకంగా ఓ పాకిస్థానీ పాటను రీమేక్ చేయడంతో బాలీవుడ్ రేంజ్ మరింత దిగజారింది. యంగ్ హీరో ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన సత్యప్రేమ్ కీ కథ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన పాకిస్థానీ పాట 'పసూరి'ని రీమేక్ చేశారు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో ఈ సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' చిత్రంలో వాడేశారు. ఇప్పటికే చిత్రబృందం ఈ సాంగ్ రిలీజ్ చేయగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. అసలేంటీ ఈ డిజాస్టర్ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కూడా అదేస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) కాగా.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిస్తోన్న సత్య ప్రేమ్ కి కథ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. భూల్ భూలయ్యా- 2 తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. Aye ki pasoori paayi ay. — Shoaib Akhtar (@shoaib100mph) June 27, 2023 -
పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!
ఒకప్పుడు బాలీవుడ్ పేరు చెప్పగానే మెలోడీ పాటలు, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. ఇప్పుడేమో ఘోరమైన ఫ్లాప్ సినిమాలే కనిపిస్తున్నాయి. రోజురోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎంతలా అంటే అక్కడి ప్రేక్షకులు.. దక్షిణాది చిత్రాల కోసం ఎదురుచూసేంతలా. ఇప్పుడు అదంతా కాదన్నట్లు ఓ పాట వల్ల కొత్త విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ లోని ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ఇతడు చేసిన సినిమాల్లో కొన్ని రీమేక్స్ ఉన్నాయి. అయినా వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇతడి సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ పలు చిత్రాల్లో నుంచి కాపీ కొట్టి తీసినట్లు అనిపిస్తాయి. ఈ ఏడాది 'షెహజాదా'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఇది 'అల వైకుంఠపురములో' చిత్రానికి రీమేక్. (ఇదీ చదవండి: 'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్‌బాబు!) ఇలా పలు మూవీల్ని రీమేక్ చేయడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న పాటని కూడా రీమేక్ చేసి పడేశాడు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో పాకిస్థానీ పాట 'పసూరి' అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తిక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' కోసం వాడేశారు. తాజాగా ఈ గీతాన్ని రిలీజ్ చేయగా నెటిజన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం దక్షిణాది సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. మన దర్శకులు, హీరోలు కొత్త సినిమాలతో నార్త్ ఆడియెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు హిందీ హీరోలేమో పరాయి దేశాల పాటల్ని కూడా వదలట్లేదు. నిర్ధాక్షణ్యంగా రీమేక్ చేసి పడేస్తున్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్స్ కి బాలీవుడ్ పై రోజురోజుకీ విరక్తి కలుగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు! (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) -
రీమేక్ మూవీలో నాగ చైతన్య.. క్లారిటీ ఇదే!
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తమిళ, తెలుగులో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. అయితే తాజాగా నెట్టింట్లో ఓవార్త చక్కర్లు కొడుతోంది. (ఇది చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!) ఇటీవల హిందీలో విడుదలైన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన చిత్రం భూల్ భూలయ్యా-2. హిందీలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో టబు పాత్రలో జ్యోతిక కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలైంది. (ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య టీం స్పందించింది. నాగ చైతన్య ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించడం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. భూల్ భూలయ్య-2 రీమేక్‌పై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. గతంలో అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. -
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్
-
బాడీగార్డ్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లిలో సందడి చేశారు. తన బాడీగార్డ్ సచిన్ వివాహానికి హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'కంగ్రాట్స్.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సచిన్ అండ్ సురేఖ' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ పోస్ట్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్ వైరల్) కాగా.. కార్తీక్ చివరిసారిగా రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ చిత్రం తూ ఝూతి మైన్ మక్కర్లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించాడు. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ అయిన షెహజాదా చిత్రంలో కార్తీక్, కృతి సనన్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కార్తీక్ సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత ఆషికీ -3లో నటించనున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) (ఇది చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ) -
ఓటీటీకి వచ్చేసిన 'అల వైకుంఠపురములో'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్డే హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. టాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాను హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్లో 'షెహజాదా' పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టులేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
బాలీవుడ్ హీరో పెళ్లి, నెట్టింట వైరలవుతున్న వీడియో!
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లి చేసుకున్నాడు. కియారా అద్వానీతో ఏడడుగులు నడిచాడు. అదేంటి, కియారాకు ఆల్రెడీ పెళ్లైపోయింది కదా అనుకునేరు.. అయినా సరే వీరి పెళ్లి జరిగింది. కాకపోతే రీల్ లైఫ్‌లో! కార్తీక్, కియారా జంటగా నటిస్తున్న చిత్రం సత్యప్రేమ్ కీ కథ. ప్రస్తుతం వీరు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సన్నివేశాన్ని మేకర్స్ షూట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో లీకవగా వైరల్‌గా మారింది. ఇందులో షేర్వాణీ ధరించిన కార్తీక్ ఎమోషనలవుతుండగా.. కియారా కూడా హీరోకు మ్యాచ్ అయ్యే లెహంగా వేసుకుని, దానికి ఎర్ర దుపట్టా జోడించి రాయల్‌గా కనిపించింది. ఈ సినిమాకు సమీర్ విద్వాంస్ దర్శకత్వం వహించాడు. మొదట ఈ చిత్రానికి సత్యనారాయణ్ కీ కథ అని టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమవడంతో సత్యప్రేమ్ కీ కథగా మార్చారు. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. ఆనంది గోపాల్ అనే మరాఠీ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న సమీర్ ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ఇటీవల అతడు షెహజాదా(అల వైకుంఠపురములో)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఇది జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో నిర్మాతగా మారిన కార్తీక్‌కు షెహజాదా బోలెడంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. మరోవైపు కియారా అద్వాణీ ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె చివరగా గోవిందా నామ్ మేరా సినిమాతో మెప్పించింది. Leaked video of @TheAaryanKartik & @advani_kiara from their upcoming movie Satyaprem Ki Katha is going viral !!#kartikaaryan #kartik #kiaraadvani #kiara #kiaraaliaadvani pic.twitter.com/j9eFi1VNJi — Glamour Flash Entertainment (@GlamourFlashEnt) March 29, 2023 -
యంగ్ హీరో కారుకు ఫైన్.. ఎందుకంటే?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ముంబయి పోలీసులు ఫైన్ వేశారు. ఆయన కారును రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్ చేశారంటూ ముంబయి పోలీసులు చలానా విధించారు. ఈ విషయాన్ని ముంబయి ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే కారు పార్కింగ్ చేసేటప్పడు కార్తీక్ కారు నడపలేదని తెలుస్తోంది. ఇవాళ ముంబయిలోని సిద్ధి వినాయకస్వామి దేవాలయాన్ని సందర్శించగా ఈ సంఘటన జరిగింది. ఈ క్రమంలోనే సిద్ధివినాయక ఆలయం వెలుపల పార్క్ చేసిన కార్తీక్ ఆర్యన్ కారుకు పోలీసులు జరిమానా విధించారు. ముంబయి పోలీసు సిబ్బంది చలాన్ జారీ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ట్రాఫిక్ పోలీసులు కార్తీక్ కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేసిన చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అతని సినిా డైలాగ్స్లోని రెండు సినిమాలను ప్రస్తావించారు. ట్విటర్లో రాస్తూ..'కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేయబడి ఉంది. షెహజాదా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించగలడని భావించొద్దు.' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాగా.. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో షెహజాదా పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి సనన్, రోనిత్ రాయ్, మనీషా కొయిరాలా, సన్నీ హిందూజా నటించారు. ఆ తర్వాత సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. అనురాగ్ బసుతో ఆషికీ 3, కెప్టెన్ ఇండియా, కబీర్ ఖాన్ చిత్రాల్లో కనిపించనున్నారు. Problem? Problem yeh thi ki the car was parked on the wrong side! Don't do the 'Bhool' of thinking that 'Shehzadaas' can flout traffic rules. #RulesAajKalAndForever pic.twitter.com/zrokch9rHl — Mumbai Traffic Police (@MTPHereToHelp) February 18, 2023 -
గ్రాండ్‌గా రిలీజైన షెహజాదా.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురములో. 2020 జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. త్రివిక్రమ్ డైరెక్షన్, తమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ బాక్సాఫీస్ హిట్ మీద కన్నుపడ్డ బాలీవుడ్ షెహజాదా పేరుతో రీమేక్ చేసింది. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 17) రిలీజైంది. అయితే విచిత్రంగా మొదటి రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు నిర్మాతలు. బుక్‌మై షోలో ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితమని వెల్లడించారు. ఇలా ఆఫర్ ప్రకటించేందుకు కారణం లేకపోలేదు. షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకు దేశవ్యాప్తంగా టికెట్ రేట్లు తగ్గించారు. రూ.110 కే టికెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పఠాన్ పోటీని తట్టుకోవడానికి వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరీ సినిమా రిలీజైన మొదటి రోజే ఇలాంటి ఆఫర్ పెట్టడం బాగోలేదంటున్నారు నెటిజన్లు. మరోపక్క సినిమాకు మిశ్రమ స్పందన వస్తుండగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు. మరి షెషజాదా ఈ అడ్డంకులను దాటి ఏమేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి! SHEHZADA - BUY ONE GET ONE FREE OFFER on BOOK MY SHOW#Shehzada team teams up with Book My Show for a special Buy One Get One Free offer for the opening day. Features #KartikAaryan and #KritiSanon pic.twitter.com/rCN98aFLTh — Himesh (@HimeshMankad) February 16, 2023 చదవండి: సింపుల్‌గా ఉపాసన సీమంతం, ఫోటోలు వైరల్ -
కార్తీక్ ఆర్యన్ ఫన్నీ వీడియో
-
మా మధ్య ఏదో ఉందనుకుంటారు.. కానీ: డేటింగ్‌పై యంగ్ హీరో
ఇటీవల 'భూల్ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారాడు చాక్లెట్ బాయ్ కార్తిక్ ఆర్యన్. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందించింది. బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా పేరున్న ఆర్యన్‌పై డేటింగ్ రూమర్లు పెద్ద ఎత్తున వైరలయ్యాయి. ఈ జాబితాలో సారా అలీ ఖాన్, అనన్య పాండే కూడా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ వార్తలపై ఎక్కడా నోరు విప్పలేదు కార్తీక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు తొలిసారి డేటింగ్ వార్తలపై స్పందించారు. కార్తీక్ మాట్లాడుతూ.. ' నాకు కాఫీ తాగడం అంటే ఇష్టం. ఎవరైనా నాతో కాఫీ తాగడానికి పిలిస్తే వారితో వెళ్లిపోతా. ఈ విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటా. నాపై డేటింగ్ వార్తలు చాలా వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రజలు బయటి ప్రపంచంలో కనిపించే వాటినే ఎక్కువగా నమ్ముతారు. వార్తల్లో వచ్చిన వాటిని చూసి వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటూ ఉంటారు. ' అని అన్నారు. కాగా.. కార్తీక్ 2020లో లవ్ ఆజ్ కల్లో సారా అలీ ఖాన్‌తో కలిసి పనిచేశాడు. పతి పత్నీ ఔర్ వో సినిమా సమయంలో కార్తీక్, అనన్య డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. కార్తీక్ ప్రస్తుతం కృతి సనన్‌తో నటించిన షెహజాదా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న విడుదల కానుంది. కార్తీక్ చేతిలో కెప్టెన్ ఇండియా, సత్యప్రేమ్ కీ కథ, ఆషికి 3 కూడా ఉన్నాయి. అతను హేరా ఫేరి 3లో కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. -
ఒక్క రోజుకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్.. యంగ్ హీరోకి భారీ డిమాండ్
'భూల్ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారాడు చాక్లెట్ బాయ్ కార్తిక్ ఆర్యన్. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందించింది. తాజాగా ఈ యంగ్ హీరో రెమ్యునరేషన్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తన తొలి చిత్రం ‘ప్యార్ కా పంచనామా(2011)’ కి కేవలం రూ.1.25 లక్షలు తీసుకున్న కార్తీక్... పాండమిక్ టైమ్‌లో చిత్రీకరించిన ఓ సినిమా కోసం ఏకంగా రూ. 20 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పాండమిక్ సమయంలో నటించిన సినిమా కోసం రూ.20 కోట్ల పారితోషికం తీసుకున్న మాట వాస్తవమే. ఆ సినిమాను 10 రోజుల్లో పూర్తి చేశాను. దాని వల్ల నిర్మాతలకు చాలా లాభాలు వచ్చాయి. కాబట్టి నేను ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పులేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి ఎంతో కష్టపడుతున్నాను. అందుకే ప్రేక్షకులు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు’ అని కార్తి చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. కార్తిక్ ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ‘ఆషికి 3’తో పాటు కృతి సనన్‌తో ‘షెహజాదా’ చిత్రంలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి హిందీ రీమేక్‌గా షెహజాదా తెరకెక్కుతుంది. -
స్టార్ హీరో ఇంట్లో అద్దెకు దిగిన యంగ్ హీరో, రెంట్ ఎంతో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం 'షెహజాదా' సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే! షెహజాదా ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కార్తీక్.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో అద్దెకు దిగుతున్నాడట! ముంబైలోని జుహులో షాహిద్ కపూర్‌కు లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. గతేడాది వరకు షాహిద్ తన భార్య మీరా రాజ్‌పుత్.. పిల్లలు జైన్, మిషాతో కలిసి అక్కడే ఉండేవాడు. ఇటీవలే వీరు వర్లిలోని డూప్లెక్స్ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. దీంతో ప్రానెటా బిల్డింగ్‌లోని తన అపార్ట్మెంట్ ఖాళీ అయింది. తాజాగా ఈ అపార్ట్మెంట్లోకి కార్తీక్ ఆర్యన్ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ ఇంటి అద్దె రూ.7.5 లక్షలు కాగా ఏడాది తర్వాత రెంట్ పెరుగుతుందట. రెండో ఏడాది నెలనెలా రూ.8.02 లక్షలు కట్టాల్సి ఉంటుందట. ఇక మూడో సంవత్సరంలో ఏకంగా రూ.8.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.45 లక్షలు ముందుగానే అప్పజెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సంక్రాంతికి ముందే పూర్తైనట్లు బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. కాగా కార్తీక్ ఆర్యన్ గతంలో వెర్సోవాలోని ఓ అపార్ట్మెంట్లో నివసించేవాడు. దీన్ని 2019లో రూ.1.60 కోట్లకు కొనుగోలు చేశాడు. చదవండి: రోజూ రాత్రి ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని: రష్మిక డైరెక్టర్‌కు మెగాస్టార్ ఖరీదైన బహుమతి -
మాజీ లవర్‌తో న్యూ ఇయర్ వేడుకల్లో స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భూలయ్యా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్యార్ కా పంచ్‌నామా చిత్రంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా పారిస్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మాజీ ప్రియురాలు సారా అలీ ఖాన్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023కి స్వాగతం పలుకుతూ ఆదివారం ఓకే ప్రదేశంలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. గతంలో సారా అలీ ఖాన్ సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో ఉన్న చిత్రాలను పోస్ట్ చేశారు కార్తీక్ ఆర్యన్. అయితే ఈ జంట బ్రేకప్ విషయాన్ని గురించి ఇంతవరకు పెదవి విప్పలేదు. ఒకసారి కరణ్ జోహార్ మాత్రమే తన చాట్ షోలో వీరిద్దరి రిలేషన్‌ను ప్రస్తావించారు. గతంలో ఈ జంట 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో నటిస్తున్నప్పుడు ఏడాది పాటు డేటింగ్లో ఉన్నారు. సినిమాల విషయాకొనిస్తే కార్తిక్ ఆర్యన్ చేతిలో 'షెహజాదా', 'సత్యప్రేమ్ కీ కథ', 'ఆషికి 3' 'కెప్టెన్ ఇండియా' ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో అనౌన్స్', 'గ్యాస్‌లైట్', 'నఖ్రేవాలి', విక్కీ కౌశల్‌తో లక్ష్మణ్ ఉటేకర్ అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
ఆ ముగ్గురిలో ప్రభాస్‌నే పెళ్లాడతా.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మొదటిసారి ప్రభాస్‌తో నటిస్తోంది భామ. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్‌తో నటించడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిది ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్ నటి కావడంతోనే కృతిసనన్ బాగా ఫేమస్ అయింది. (చదవండి: ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్) దీంతో ఆమె గతంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో ముద్దుగుమ్మ షాక్‌కు గురైంది. అవకాశం వస్తే ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్.. ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్ కూడా' అంటూ దిమ్మతిరిగే ప్రశ్న అడిగారు. దీనికి కృతి సమాధానమిస్తూ.. 'కార్తిక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్, టైగర్‌తో డేటింగ్. ఇక ప్రభాస్‌తో పెళ్లి' అని నవ్వుతూ సమాధానమిచ్చింది ఆదిపురుష్ భామ. ప్రస్తుతం ఆమె భేదియా(తోడేలు) ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్ గురించి కృతిసనన్ మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నారు. If ever get a chance I will marry #Prabhas. -@kritisanon ❤ Ok ika fix aipondi North Vadina ani 🥳🥳🥰 #Prakrithi pic.twitter.com/Q67ppL7WIy — Dps Nayak™ 💔 (@NayakTweetz) November 25, 2022 -
బాలీవుడ్ స్టార్ హీరో చెల్లితో డేటింగ్.. ఆ యంగ్ హీరో ఎవరంటే?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య బంధం ఎక్కువ కాలం నిలువలేదు. తాజాగా కార్తిక్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కజిన్ సిస్టర్ పష్మినా రోషన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. యంగ్ హీరో కార్తిక్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల భూల్ భూలయ్యా- 2 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్లో మరో రెండు ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. తాజాగా ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు యంగ్ హీరో కార్తిక్. హృతిక్ బాబాయి, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు రాజేశ్ రోషన్ కూతురైన పష్మినాతో కలిసి కార్తిక్ ఇటీవలే ముంబయి రోడ్లపై కనిపించి సందడి చేశారు. అంతే కాదు దీపావళి వేడుకల్లోనూ ఈ జంట ప్రత్యేక వాహనంలో ముంబైలోని జూహూలో డ్రైవ్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు రావడం, రాత్రిళ్లు పార్టీల్లో పాల్గొనడంతో డేటింగ్ రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంతవరకు వీటిపై ఈ జంట నోరు స్పందించకపోవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరీ పష్మినాతో బంధమైనా ఎక్కువ కాలం కొనసాగిస్తాడో లేదా వేచి చూడాల్సిందే. -
‘ఆషికీ 3’లో హీరోయిన్గా రష్మిక మందన్నా?
రష్మికా మందన్నా కెరీర్ మంచి జోరు మీద ఉంది. ఒకవైపు దక్షిణాది సినిమాలు సైన్ చేస్తూ మరోవైపు ఉత్తరాదిపై కూడా దృష్టి పెట్టారీ బ్యూటీ. ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజు్న’, ‘యానిమల్’ వంటి చిత్రాలు ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. తాజాగా ఓ హిట్ సీక్వెల్ (ఆషికీ) లో హీరోయిన్గా రషి్మకా దాదాపు ఖరారు అయ్యారని సమాచారం. రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా రూపొందిన ‘ఆషికీ’ (1990) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చదవండి: అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్‌లో అదరగొట్టిన ప్రభాస్ ఆ తర్వాత పదమూడేళ్లకు ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన ‘ఆషికీ 2’ (2013) కూడా హిట్టయింది. ఇప్పుడు ‘ఆషికీ 3’లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్గా రషి్మకను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రూ.9 కోట్ల భారీ ఆఫర్.. అయినా ఆ యాడ్‌కు నో చెప్పిన హీరో
పలు వ్యాపార కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం స్టార్ హీరోలను బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించుకుంటాయనే విషయం తెలిసిందే. ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లిస్తాయి. అందుకే స్టార్ హీరో ఒకవైపు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూనే..మరోవైపు యాడ్స్‌లో నటిస్తుంటారు. కొందరు హీరోలు పారితోషికాన్ని బట్టి బ్రాండ్స్ ప్రమోషన్‌కి ఓకే చెబితే.. మరికొందరు మాత్రం డబ్బుని పట్టించుకోకుండా.. ప్రజలకు ఇబ్బందిలేని ఉత్పత్తులకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉంటారు. ఆ లిస్ట్‌లో సాయి పల్లవి, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఉంటారు. (చదవండి: ఎంత పెద్ద సినిమా అయినా.. ఆ రోజు షూటింగ్ బంద్: అక్షయ్ కండీషన్) కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిన పొగాకు కంపెనీ ప్రకటనకి నో చెప్పాడు అల్లు అర్జున్. సాయి పల్లవి కూడా అంతే. ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రమోట్ చేయాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినా.. అభిమానులను మోసం చేయడం ఇష్టం లేక రిజక్ట్ చేసిందట. తాజాగా అదే బాటలో నడిచాడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. పాన్ మసాల యాడ్ కోసం తన వద్దకు వచ్చిన రూ.9 కోట్ల రెమ్యునరేషన్ డీల్ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించే ఉత్పత్తులను తాను ప్రమోషన్ చేయలేనని చెప్పేశాడట. గతంలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ లు పొగాకు సంస్థ ప్రకటనల్లో నటించి, నెటిజన్స ఆగ్రహానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో
Kartik Aaryan Says Aadhar Card Dikha Doon: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇందులో భాగంగానే కార్తీక్ తాజాగా యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా తిరుగుతూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కార్తీక్‌కు వింత సంఘటన ఎదురైంది. యూరప్ వీధుల్లో స్ట్రీట్‌ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను చూసి ఓ అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. కార్తీక్ దగ్గరకు వెళ్లి 'మీరు హీరో కార్తీక్ ఆర్యన్ కదా ? మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా ? ఎందుకంటే మీరు కార్తీక్ ఆర్యన్ అంటే మా ఫ్రెండ్స్ నమ్మట్లేదు' అందుకే అడుగుతున్నా అని చెప్పాడు. 'దీనికి అవును, నేను కార్తీక్ ఆర్యన్. నమ్మడం లేదా? నా ఆధార్ కార్డ్ చూపించనా ?' అంటూ చమత్కరించాడు. కార్తీక్ మాటలకు ఆనందంతో తన ఫ్రెండ్స్‌ని పిలిచి అతనితో ఫొటోలు దిగాడు ఆ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'కార్తీక్ మీరు చాలా సింపుల్, సరదాగా ఉన్నారు', 'కార్తీక్ మీ టైమింగ్ అదిరింది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బాలీవుడ్‌కు ఆక్సిజన్ అందించిన హీరోకు నిర్మాత కళ్లు చెదిరే గిఫ్ట్
హిట్లులేక అల్లాడిపోతున్న బాలీవుడ్‌కు 'భూల్ భులాయా 2' సినిమాతో ఆక్సిజన్ అందించాడు హీరో కార్తీక్ ఆర్యన్. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.184.32 కోట్లు రాబట్టింది. సినిమా రిలీజై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. 'భూల్ భులాయా 2' బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో దర్శకనిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. ఈ ఆనందంలో నిర్మాత భూషణ్ కుమార్ హీరోకు అత్యంత ఖరీదైన బహుమతినిచ్చాడు. మెక్లారెన్ జీటీ అనే స్పోర్ట్స్ కారును గిఫ్టిచ్చాడు. దీని ఖరీదు దాదాపు రూ.4.7 కోట్లు ఉంటుందని అంచనా! ఇండియాలో ఈ కారు సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా కార్తీక్ నిలిచాడు. 'కష్టానికి ప్రతిఫలం ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు. నేనిప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్లారెన్ జీటీ యజమానిని. నెక్స్ట్ టైం ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇవ్వండి సర్' అంటూ కారు ముందు దిగిన ఫొటోలను కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడికి ఇదివరకే మినీ కూపర్, లంబోర్గిని ఉరుస్ కార్లు ఉన్నాయి. కాగా కార్తీక్ ఆర్యన్, భూషణ్ కుమార్ల మధ్య ఆప్యాయత ఇప్పటిది కాదు. 2018లో సోనూకీ టీటుకీ స్వీటీ సినిమాతో వీరి కాంబినేషన్ మొదలైంది. ప్రస్తుతం భూల్ భులాయా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న వీరు అల వైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్ 'షెహజాదా'కు కలిసి పని చేస్తున్నారు. Chinese khaane ke liye nayi table gift mil gayi 🍜🚗 Mehnat ka phal meetha hota hai suna tha..Itna bada hoga nahi pata tha ❤️ India’s 1st McLaren Gt 🥹 Agla gift Private jet sir 😂 #Gratitude 🙏🏻 pic.twitter.com/OvmtFJguor — Kartik Aaryan (@TheAaryanKartik) June 24, 2022 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, స్పందించిన వర్మ -
రూ. 150 కోట్లలో మీ వాటా ఎంత? యంగ్ హీరోకు నెటిజన్ ప్రశ్న..
Kartik Aaryan Reveals His Share In Bhool Bhulaiyaa 2 Profits: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమచారం. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. తాజాగా 'ఆస్క్‌మీ కార్తీక్' అనే సెషన్‌ను సోషల్ మీడియా వేదికగా నిర్వహించాడు. ఈ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు కార్తీక్. 'మిస్టర్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ కార్తీక్.. పెళ్లిపై మీ ప్లాన్స్ ఏంటీ ?' అని అడిగిన ప్రశ్నకు 'ముందు నన్ను ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్లనివ్వండి. ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. నేను సింగిల్‌గానే ఉండిపోతానేమో అనిపిస్తుంది.' అని తెలిపాడు. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు Eligible se taken toh karao phir marriage ki baat karenge. Eligible eligible mein single hi reh jaoonga #AskKartik https://t.co/eHYs2dStj4 — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 అనంతరం మరోకొరు 'సర్.. భూల్ భులయ్యా 2 సినిమాకు రూ. 150 కోట్ల లాభం వచ్చింది కదా. అందులో మీ వాటా ఎంత?' అని అడగ్గా.. 'ఆ లాభాల్లో నేను ఎలాంటి వాటా తీసుకోలేదు. ఈ సినిమా వల్ల నాకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ దొరికింది. డబ్బు కంటే ఆ ప్రేమ గొప్పది.' అని సమాధానమిచ్చాడు. అలాగే 'మీకిష్టమైన మార్వెల్ క్యారెక్టర్ ఏంటీ?' అన్న ప్రశ్నకు 'స్పైడీ' అని పేర్కొన్నాడు. చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్ 150 cr mein profit nahi Fans ka pyaar mila hai !! Koi number usse bada nahin hota ❤️#AskKartik https://t.co/FDge180zsK — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 Spidey 🕷 #AskKartik https://t.co/wuyJoK21o1 — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 -
KK Singer Death: సింగర్ కేకే మృతిపై అక్షయ్, ఆర్ రెహమాన్ ఆవేదన
ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన హాఠాన్మరణం సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. సిద్ధూ మూసేవాలా హత్యోదంతం జరిగిన రెండు రోజులకే మరో ప్రముఖ గాయకుడి అకాల మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆయన మృతి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేకే మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కెరీర్లో కేకే కూడా ఒక భాగం. నేను చేసిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో పాటలకు స్వరాన్ని అందించారు. Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK — A.R.Rahman (@arrahman) June 1, 2022 ఆయన ఆలపించిన ‘తూ బోలా జైసే’ పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చింది. గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ సింగర్ విశాల్ దడ్లానీ తీవ్ర దిగ్భ్రాంతీ వ్యక్తం చేస్తున్నారు. కేకే మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రలకు, సన్నిహితలకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘స్నేహితులకు, మీడియా మిత్రలకు నా విన్నపం ఏంటంటే. కేకే గురించి మాట్లాడమని గాని, స్టేట్మెంట్ ఇవ్వమని గాని నన్ను అడగకండి ప్లీజ్. ఎందుకంటే ప్రస్తుతం ఆయన గురించి నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. నాకంత శక్తి కూడా లేదు’ అంటూ రాసుకొచ్చారు. A request to friends from the media. Please don't call me for statements about #KK. I can't speak about him in the past tense, I simply don't have the strength for that. 🙏🏽 — VISHAL DADLANI (@VishalDadlani) June 1, 2022 వీరితో పాటు పలువకు బాలీవుడ్ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా కేకే 1968లో ఢిల్లీలో జన్మించారు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా వంటి తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కలతాలోని నజ్రుల్ మంచ్ వద్ద మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చిన అనంతరం కేకే అస్వస్థతకు గురి కాగా, ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. కాని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. కేకే మృతిని అసహజ మరణం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. So sad to hear about KK’s death. He sang the first song of my first film. A great friend since then. Why so early, KK, why? But you have left behind a treasure of a playlist. Very difficult night. ॐ शांति। Artists like KK never die. pic.twitter.com/MuOdAkEOJv — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022 When beautiful voices are stopped in full flow, the universe loses a lifeline. In shock over the tragic deaths of two singing legends #sidhumoosewala & #KK. Numbed at the unfathomable loss 🙏 #RIPLegends. #RIPKK #RIPLegend #KKPassesAway #KrishnakumarKunnath #SidhuMooseWalaDeath pic.twitter.com/j7POeYmMBq — Suniel Shetty (@SunielVShetty) June 1, 2022 View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ నటించిన తాజా చిత్రం 'భూల్ భులయ్యా 2'. 2007లో వచ్చిన అక్షయ్ కుమార్ సూపర్ హిట్ సినిమా 'భూల్ భులయ్యా'కు సీక్వెల్‌గా తెరకెక్కింది ఈ మూవీ. అనీస్ బజ్మీ దర్శకత్వంలో వచ్చిన 'భూల్ భులయ్యా 2' మే 20న విడుదలైంది. హారర్ కామేడీగా వచ్చిన ఈ సినిమా మంచి విజయంతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ రావడంతో తనకే టికెట్లు దొరకట్లేదని ట్వీట్ చేశాడు హీరో కార్తీక్ ఆర్యన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'భూల్ భులయ్యా 2' సినిమా చూసేందుకు కార్తీక్ ఆర్యన్ ముంబైలోని గైటీ థియేటర్‌కు వెళ్లాడు. అక్కడ హీరోను చూసిన అభిమానులు అతడి వద్దకు గుంపులుగా చేరారు. తర్వాత అతను టికెట్లు కూడా పొందలేకపోయానని చెబుతూ హౌస్‌ఫుల్ బోర్డ్ ఫొటోను చూపించాడు. ''ఈ రోజు కోసం నటులుగా మేము ఎంతో కోరుకుంటాం. ఇది హౌస్‌ఫుల్ బోర్డ్. నేను కూడా టికెట్లు పొందలేకపోయాను. 'భూల్ భులయ్యా 2' ఆన్ ఫైర్. ప్రేక్షకులకు ధన్యవాదాలు.'' అని ట్వీట్ చేశాడు కార్తీక్. చదవండి: గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో కాగా ఈ మూవీ సంజయ్ లీలా భన్సాలీ 'గంగూబాయి కతియావాడి', రణ్వీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమాలను దాటి తొలి రోజు రూ. 14.11 కోట్లు రాబట్టి బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. రెండో రోజు రూ. 18.34 కోట్లు వసూళ్లు సాధించింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 32.45 కోట్లను కొల్లగొట్టింది. చదవండి: 20 కోట్ల రూపాయలిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా? -
‘అందులో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు'.. ఆసక్తిగా ట్రైలర్
కార్తీక్ఆర్యన్, కియారా అద్వానీ నటిస్తున్న సినిమా ‘భూల్ భులయ్యా-2’. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2007లో వచ్చిన సూపర్ హిట్ ‘భూల్ భులయ్యా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోందీ చిత్రం. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళం, తెలుగులోనూ చంద్రముఖి పేరుతో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భూల్ భూలైయా చిత్రం వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం సీక్వెల్ రాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.‘పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరో ఆ తలుపును తట్టారు. అందులో ఉన్నది సామాన్యమైన ఆత్మ కాదు. అందులో ఉంది మంజులిక’ అంటూ టబు చెప్తుండటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రాజ్‌పాల్ యాదవ్, పరేశ్ రావల్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో
Female Fans Run Behind Kartik Aaryan With Rose Flowers: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. లవర్ బాయ్‌గా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తీక్‌కు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఓ నెటిజన్ రూ. 20 కోట్లు ఇస్తా పెళ్లి చేసుకుంటావా అని కార్తీక్‌కు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలు కార్తీక్ ఇంటికెళ్లి అతను బయటకు రావాలంటూ గోల కూడా చేశారు. మళ్లీ తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల వేకేషన్ కోసం గోవా వెళ్లాడు కార్తీక్ ఆర్యన్. అక్కడి నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయం వద్ద మీడియాకు చిక్కాడు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎర్ర గులాబీలు చేత పట్టుకుని కార్తీక్ వెంటపడ్డారు. కొద్ది సేపటిదాకా అదేం పట్టించుకోకుండా నడిచాడు కార్తీక్. అందులో ఒక అమ్మాయి ఆరోజు తన బర్త్‌డే అని పూల బొకే ఇవ్వగా అందులో కొన్ని గులాబీలు తీసుకున్నాడు. తర్వాత వారితో కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. వాళ్ల అభిమానం చూసి సిగ్గు పడుతూ వెళ్లిపోయాడు కార్తీక్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్స్ సూపర్ ఫాలోయింగ్ అంటూ కామెంట్స్ చేయగా, మరికొందరు 'ఇది పబ్లిసిటీ స్టంట్' అంటూ విమర్శిస్తున్నారు. కాగా కార్తీక్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ 'షెహజాదా' 'భూల్ భూలయ్య 2' సినిమాల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
పెళ్లి చేసుకుంటే రూ. 20 కోట్లు
-
20 కోట్ల రూపాయలిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ 'షెహజాదా'లో నటిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ మీరోకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్ వీడియో షేర్ చేశాడు. ఇందులో అర్జున్ పాతక్ అనే అమ్మాయి ధమాకా సినిమాలోని డైలాగులను వల్లెవేసింది. డైలాగ్ చెప్పడం పూర్తవగానే ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు చేశారు. కానీ ఒక నెటిజన్ మాత్రం 'రూ.20 కోట్లిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని హీరోను అడిగింది. దీనికి కార్తీక్ ఆర్యన్ బదులిస్తూ 'సరే, ఎప్పుడు చేసుకుందాం?' అని అడగ్గా 'వచ్చేసేయ్, ఇప్పుడే చేసుకుందాం' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన కొందరు అమ్మాయిలు నేనూ ఇస్తా 20 కోట్ల రూపాయలు, నన్ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్లతో హీరో వెంటపడ్డారు. దీంతో కార్తీక్ ఆర్యన్ 'వేలంపాట వేద్దామా?' అని సరదాగా చమత్కరించాడు. కాగా కార్తీక్ ఆర్యన్ చివరిసారిగా 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గతేడాది రిలీజైంది. ప్రస్తుతం అతడు నటించిన 'షెహజాదా' నవంబర్ 4న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే 'భూల్ భులాయా 2', 'ఫ్రెడ్డీ' సినిమాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం !.. బన్నీ సినిమా హిందీ వెర్షన్ లేనట్లేనా ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. బన్నీ స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ మ్యాజికల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ మాస్ పెర్ఫామెన్స్ చిత్రం 'పుష్ప' హిట్‌తో 'అల వైకుంఠపురములో' మూవీని కూడా హిందీలో విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయడాన్ని ఆపేశారు. ఈ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంతో రీమేక్ నిర్మాతలకు, డబ్బింగ్ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ అని డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్‌మైన్స్ మనీష్ షా ఆరోపిస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేస్తే తాను నటిస్తున్న 'షెహజాదే' చిత్రాన్ని చేయకుండా మధ్యలోనే మానేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మాతలకు చెప్పాడట. అయితే 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఇప్పటివరకూ 'షెహజాదే' చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ రిలీజ్ ప్రయత్నాన్ని విరమించుకున్నాని మనీష్ షా పేర్కొన్నారు. అలాగే ఇది కార్తీక్ ఆర్యన్ కోసం కాదు, అల్లు అరవింద్ కోసం చేస్తున్నాని, షెహజాదే నిర్మాతలు రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కేవలం 'దించాక్' టీవీ ఛానెల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఈవెంట్లో ఆమె ప్రపోజ్ చేసింది, వెంటనే పెళ్లి..
సోషల్ మీడియా వచ్చాక ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చెప్పడం కామన్ అయిపోయింది. జరిగింది ఒకటైతే దాన్ని ఇంకోలా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలపై అనేక తప్పుడు కథనాలు వెలువడ్డాయి. అలా ఒకసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి ఓ వార్త వైరల్ అయింది.ఈ హీరో తన అభిమానిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించాడు కార్తీక్. 'ఒకసారి ఏం జరిగిందంటే నా సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో లేడీ ఫ్యాన్ ఒకరు నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. అంతే, ఆ మాత్రానికే ఏకంగా నేను ఆమెను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాశారు. అది చూసి నేను బిగ్గరగా నవ్వుకున్నాను. ఏంటి, మీకలా అనిపించిందా? అనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ యంగ్ హీరోను ఆరాధించే అభిమానులు చాలామందే ఉన్నారు. ఈ మధ్యే ఓ అభిమాని కార్తీక్ ఆర్యన్ ముఖాన్ని తన ఛాతీపై పచ్చబొట్టు వేయించుకున్న విషయం తెలిసిందే! -
యంగ్ హీరోకు నటి టబు వార్నింగ్!
Ala Vaikunthapurramuloo Bollywood Remake: బన్నీ నటించిన హిట్ చిత్రాల్లో అల వైకుంఠపురములో ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా సక్సెస్‌పై కన్నేసిన బాలీవుడ్ హిందీ రీమేక్ తీయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే! యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా 'షెహజాదా' అన్న టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రోహిత్ ధావన్ డీల్ చేస్తున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ 4న రిలీజ్ కానుంది. తాజాగా హీరో కార్తీక్ దర్శకుడు రోహిత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రోహిత్‌తో పనిచేయడం చాలా బాగుంది అని రాసుకొచ్చాడు. దీనికి టబు రిప్లై ఇస్తూ.. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీయాలి అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. మీ సినిమాను మేము ఎంతో ప్రేమతో తీస్తున్నాం అని బదులిచ్చాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
నాకు రెండు సార్లు బర్త్ డే విష్ చెప్పండి: కార్తీక్ ఆర్యన్
Kartik Aryan Wants To Wish Him Twice On His Birth Day: నవంబర్ 22న బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి డబుల్ సెలబ్రేషన్స్ దక్కాయి. హీరో తాజా చిత్రం 'ధమాకా' నవంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. అందుకే అతని బర్త్‌డే కేక్‌పై కూడా 'ధమాకా బాయ్' అని రాసి సెలబ్రేట్ చేశారు. కార్తీక్ తన బర్త్‌డే కేక్‌ను పోస్ట్ చేస్తూ 'మళ్లీ పుట్టిన రోజు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు రెండు సార్లు శుభాకాంక్షలు చెప్పండి'. అంటూ నవ్వుతూ క్యాప్షన్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి కార్తీక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్. మీకు ఎప్పుడూ ప్రేమ, సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నా' అని అనుష్క శర్మ విష్ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా కార్తీక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక్‌ను శిల్పా శెట్టి ధమాకా అని పిలుస్తూ 'నీలో ధమాక వంటి ప్రతిభ ఉంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని ఇన్‌స్టా గ్రామ్‌లో స్టోరీ పెట్టారు. ఈ హీరోకు అభిమానుల ఫాలోయింగ్ భారీగానే ఉంది. బాలీవుడ్లో తనదైన సముచితమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ తనను తాను ఫ్యాన్ మేడ్ హీరోగా అభివర్ణించాడు. 'నేను అదృష్టవంతున్ని. నేను పూర్తిగా ఫ్యాన్ మేడ్ హీరోని. నా అభిమానులు, ప్రేక్షకుల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నా అభిమానులు నాలో కొంత భాగంగా భావిస్తున్నాను. నా ప్రయాణంలో వారు కూడా భాగమే. వారు నాకు చాలా ప్రేమ ఇచ్చారు. అది వారికి ఎలా తిరిగి ఇవ్వాలో తెలియదు. నేను వారిని నిరాశపర్చకుండా సాధ్యమైనంత వరకూ పనిచేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను.' అని తెలిపాడు. 'ధమాకా' చిత్రాన్ని కరోనా కారణంగా ముంబైలో రికార్డు స్థాయిలో కేవలం 10 రోజుల్లోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో పాటు మృణాల్ ఠాకూర్, అమృతా సుభాష్, వికాస్ కుమార్, విశ్వజీత్ ప్రధాన్ నటించారు. -
బాహుబలికి అబద్ధం ఎందుకు చెప్పావు?: యంగ్ హీరో
సోషల్ మీడియా పుణ్యాన ప్రపంచాన ఏ మూలన ఉన్నవారికైనా ఇట్టే విషెస్ చెప్పుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా సినీతారలు వారికి సంబంధించిన ఏ విషయాన్నైనా నెట్టింట్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. అలాగే ఇతర సెలబ్రిటీలతోనూ కనెక్షన్ మెయింటెన్ చేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్.. తన సహనటుడు సన్నీ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నిజానికి సన్నీ సింగ్ బర్త్‌డే అక్టోబర్ 6. అయితే బాహుబలి ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 5నే అతడికి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో ఈ పోస్టుకు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సహా అనేక మంది కామెంట్లు చేశారు. 'సర్, అతడు మీకు అబద్ధం చెప్పాడు, అతడి పుట్టినరోజు రేపు' అని కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా ఈ పోస్టును ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. ఆ పోస్టును సన్నీకి ట్యాగ్ చేశాడు. 'రేపు నీ పుట్టిన రోజు అయితే బాహుబలికి ఎందుకు అబద్ధం చెప్పావు?' అని ప్రశ్నించాడు. అందుకు సన్నీ సమాధానమిస్తూ.. 'బాహుబలి ఈరోజే పుట్టినరోజు జరుపుకోమన్నాడు. అందుకే నేనీరోజే బర్త్‌డే జరుపుకుంటున్నాను. అయినా నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తున్నావు?' అని సరదాగా కౌంటరిచ్చాడు. కాగా ప్రభాస్ రాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రంలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ డైరెక్షన్ చేస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో ఒదిగిపోనున్నాడు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
‘అలవైకుంఠపురంలో' హిందీ రీమేక్ టైటిల్ ఇదే..
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అలవైకుంఠపురంలో'. గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతిసనన్లు హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “షెహజాదా అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు. చదవండి : తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ యంగ్ హీరో -
అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సాంగ్ ‘బుట్టబొమ్మ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షార్ట్ వీడియో యాప్‌ల ద్వారా దేశంలోని మిగతా భాషల్లోనూ పాపులర్ అయిన ఈ పాట సెలబ్రెటీల నుంచి పద్దా, చిన్నా వరకు ఎంతో క్రేజ్‌ను సంపాదించి దాదాపు అందరితోనూ స్టెప్పు లేయించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీలోని ఈ పాటకు తమన్ స్వరాలను సమకూర్చగా, బాలీవుడ్ సింగర్ ఆర్మాన్ మాలిక్ ఆలపించాడు. యూట్యూబ్‌లో 627 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని ఈ పాట కొత్త రికార్టను సృష్టించింది. ఇప్పటికే శిల్పాశెట్టి, సిమ్రాన్, దిశా పటానీతో పాటు అస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ మొదలుకొని ఎంతో మంది బుట్ట బొమ్మకు స్టెప్పులేశారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా చేరాడు. అయితే ఈ పాటలో సిగ్నేచర్ స్టెప్‌తో సహా అల్లు అర్జున్ వేసిన ఏ స్టెప్పులు కార్తీన్ వేయలేదు. స్ట్రీట్ స్టయిల్ హిప్ హాప్ తరహాలో తనదైన శైలిలో కార్తీక్ కార్తీక్ ఈ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకన్నాడు. అనంతరం ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి ‘డాన్స్ లైక్ కార్తీక్ ఆర్యన్’ అనే క్యాప్షన్‌తో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన అతడి ఫాలోవర్స్, అభిమానులు, సన్నిహితులు సైతం ఫిదా అయిపోయారు. కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా-2’ లో నటిస్తుండగా, ‘థమాకా’ అనే మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: బన్నీ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్ ప్రశంసలు అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు -
‘సుశాంత్ సింగ్‌కు పట్టిన గతే తనకు పట్టిస్తారు’
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ని దోస్తానా 2 సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యింది. అయినప్పటికి కార్తీక్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కావాలనే కార్తీక్‌ను సినిమా నుంచి తొలగించారని.. అతడికి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని పలువురు ప్రముఖులు బహిరంగంగానే ప్రకటించడమే కాక కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనుభవ్ సిన్హా, రైటర్ అపూర్వ అస్రానీ కార్తీక్ ఆర్యన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘నిర్మాతలు నటులను తప్పించినప్పుడు వారు దాని గురించి మాట్లాడరు. ఎప్పుడు ఇదే జరుగుతుంది. కార్తీక్ ఆర్యన్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని నాకు తెలిసింది. ఇది చాలా అన్యాయం. నేను తన మౌనాన్ని గౌరవిస్తున్నాను’’ అంటూ అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు. And by the way... when Producers drop Actors or vice versa they don't talk about it. It happens all the time. This campaign against Kartik Aryarn seems concerted to me and very bloody unfair. I respect his quiet. — Anubhav Sinha (@anubhavsinha) June 3, 2021 అపూర్వ అస్రానీ దీన్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘అనుభవ్ సిన్హాను నేను గౌరవిస్తున్నాను. కార్తీక్‌కు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు ఎదుర్కొంటున్న బెదిరింపులు గురించి నేను బ్లాగ్ చేశాను. దాంతో చాలా మంది జర్నలిస్ట్‌లు నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మంచి కోసం ఏదైనా మారుతుందని నేను భావిస్తున్నాను’’ అంటూ అపూర్వ అస్రానీ. I respect Anubhav Sinha for calling out the very obvious campaign against #KartikAaryan. A year ago I had blogged about the bullying Sushant Singh Rajput went through. And though I remain blacklisted for it by many journalists, I feel like something IS changing for the better.✊ https://t.co/8DbWRtLGa7 — Apurva (@Apurvasrani) June 4, 2021 కార్తీక్ ఆర్యన్ తొలగింపుపై ధర్మ ప్రొడక్షన్ స్పందించింది. కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతోనే తనను తొలగించామని తెలిపింది. కొల్లిన్ డీ కున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోస్తానా 2ని తిరిగి డైరెక్ట్ చేయనున్నాం. త్వరలోనే దీని గురించి అధికారకి ప్రకటన చేస్తాం అని తెలిపింది. చదవండి: సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు -
‘టైటానిక్’ మూవీ హీరోయిన్‌తో పోల్చుకున్న యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అంతేగాక సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ఇక తన సహా నటీనటులను ఎప్పుడు ఆటపట్టిస్తూ సరదగా ఉండే కార్తీక్ తాజాగా టైటానిక్ మూవీపై స్పందిస్తూ హీరోయిన్ కేట్ విన్స్లెట్తో తనని పోల్చుకున్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ కేట్, హీరోని తన స్కెచ్ వేయమని కోరుతూ నగ్నంగా సోఫాలో వాలి ఫోజు ఇస్తుంది. ఈ సనివేశం అందరికి గుర్తుంది కదా. అచ్చం కేట్ లాగే కార్తీక్ కూడా ఫోజు ఇచ్చి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు ‘కార్తీక్ 1- 0 కేట్ విన్స్లెట్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇక అతడి పోస్టుపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖుల కూడా స్పందించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ‘ఉఫ్’ అంటు కామెంట్ చేయగా.. సింగర్ జోనితా గాంధీ ‘ఇది ఏంటో అర్థం కానీ వ్యక్తిని నేను మాత్రమే అనుకుంటా’ అంటు కామెంట్ చేసింది. అది చూసిన కార్తీక్ ‘వెంటనే టైటానిక్ సినిమా చూడు’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే నెటిజన్లు కూడా ‘టైటానిక్ పార్ట్ 2’, ‘క్యాప్షన్ కింగ్’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
సినిమా నుంచి స్వయంగా తప్పుకున్న యంగ్ హీరో.. ఎందుకంటే
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ అభిమానులకు షాకిచ్చాడు. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ “రెడ్ చిల్లీస్” తెరకెక్కిస్తున్న ఓ మూవీ నుంచి ఆయన సడెన్‌గా తప్పుకున్నారు. అజయ్ బెహల్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన కత్రినా కైఫ్ నటించనుంది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల క్రితమే కార్తీక్ సైన్ చేశాడు. అయితే ఇటీవలి కాలంలో దర్శకుడు అజయ్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పేశాడు. దర్శకుడు ఇది వరకు చెప్పిన స్టోరీ లైన్‌కు, ఇప్పటి స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో కార్తీక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు గాను అడ్వాన్స్‌గా ఇచ్చిన 2 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లవ్ స్టోరీ ప్రధానంగా తెరెకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆలోపే కార్తీక్ ఆర్యన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. గతంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దోస్తానా 2' సినిమా నుంచి అతడిని తప్పిస్తున్నట్లు కరణ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైంది. అయితే కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతో కరణ్ జోహార్ ఆ హీరోను అర్ధాంతరంగా తొలగించినట్లు బీ టౌన్ టాక్. రెండు వారాలు షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ సడన్‌గా హీరోను సైడ్ చేయడం బాలీవుడ్లో చర్చకు తెరదీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాను చేస్తున్న చిత్రం నుంచి అనూహ్యంగా వైదొలిగాడు. చదవండి : సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు కొరియోగ్రాఫర్ బర్త్‌డే.. అక్షయ్‌కుమార్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? -
సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దోస్తానా 2' సినిమా నుంచి అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ వార్త అతడి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైంది. అయితే కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతో కరణ్ జోహార్ ఆ హీరోను అర్ధాంతరంగా తొలగించాడని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులోనూ అతడితో సినిమాలు తీయకూడదని కరణ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. అసలు కరోనా సమయంలో షూటింగే కష్టమంటే.. ఇప్పుడు సగం పూర్తైన సినిమాలో మరో కొత్త హీరోను తీసుకుని మళ్లీ మొదటి నుంచి షూటింగ్ మొదలు పెట్టడం తలకు మించిన భారంగా మారనుంది. అయినప్పటికీ హీరోను రీప్లేస్ చేయడానికే ధర్మ ప్రొడక్షన్స్ నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన సైతం జారీ చేసింది. కాగా 2008లో వచ్చిన సూపర్ హిట్ సినిమా దోస్తానాకు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. 2019 నవంబర్లోనే షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ గతేడాది లాక్డౌన్ వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. గత రెండు వారాలుగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ సడన్‌గా హీరో సైడ్ అయిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే బేధాభిప్రాయాల వల్ల కార్తీకే ఈ సినిమా నుంచి వైదొలగాడన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు కార్తీక్‌ను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పోల్చుతున్నారు. సినిమా అవకాశాలు ఇచ్చినట్లే ఇచ్చి చేజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ కిడ్స్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టరు కానీ ఇలా అవుట్‌సైడర్స్(సినీ రంగానికి చెందనివారు)ను మాత్రం ఆ లిస్టులో చేరుస్తారని నిప్పులు చెరుగుతున్నారు. pic.twitter.com/NaohVGnjvp — Dharma Productions (@DharmaMovies) April 16, 2021 చదవండి: లంబోర్గిని కారు కొన్న కుర్ర హీరో, ధర ఎంతంటే? -
లంబోర్గిని కారు కొన్న కుర్ర హీరో, ధర ఎంతంటే?
కరోనా సెకండ్ వేవ్ బాలీవుడ్‌ను చిగురుటాకులా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలు కరోనా బారిన పడిగా మరికొందరు ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుని బయటపడుతున్నారు. ఈ క్రమంలో మార్చి 22న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 14 రోజుల క్వారంటైన్ తర్వాత అతడికి మళ్లీ పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. దీంతో తిరిగి సెట్స్‌లో అడుగు పెట్టనున్నాడీ కుర్ర హీరో. అయితే తనకు కరోనా పీడ విరగడైందని తెలిసిన తర్వాత ఈ హీరో ఏం చేశాడనుకుంటున్నారు? అదే సాయంత్రం ఓ కొత్త కారును తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును కొనుగోలు చేసిన కార్తీక్ ముంబై వీధుల్లో సోమవారం దాన్ని నడుపుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దీని ధర ఇంచుమించు నాలుగున్నర కోట్ల రూపాయలుగా ఉందట. ఇక ఈ మధ్యే ప్రభాస్ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) ఇదిలా వుంటే కార్తీక్ ప్రస్తుతం 'భూల్ భులైయా 2' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కియారా అద్వాణీ, టబు, రాజ్‌పాల్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'ధమాకా', 'దోస్తానా 2' చిత్రాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్ లంబోర్గిని కారులో ప్రభాస్ షికారు -
హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ
ముంబై : బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్లస్ సింబల్‌ను షేర్ చేస్తూ..తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, త్వరగా కోలుకునేలా ప్రార్థించాలని కోరారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ..మీరు తప్పకుండా కోలుకుంటారు, భయపడకండి అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆదివారం జరిగిన ల్యాక్మీ ఫ్యాషన్ వీక్‌లో హీరోయిన్ కియారా అద్వానీ, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హీరో కార్తీక్ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇటీవలె కియారా, టబులతో కలిసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో ఇప్పడు వీరిందరికి కరోనా భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా తనను కంటాక్ట్ అయిన వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కార్తీక్ తెలిపారు. చివరగా ఆయన ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్ లో కనిపించారు. గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి : బిగ్‌బాస్ భామకు కరోనా పాజిటివ్ ప్రముఖ కమెడియన్ తేపట్టి గణేశన్ మృతి -
బాటా ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు
సాక్షి, ముంబై: పాదరక్షల తయారీ కంపెనీ బాటా ఇండియాకు కొత్త ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నియమితులయ్యారు. యువతలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడిని ప్రచారకర్తగా ఎన్నుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది. టెలివిజన్, డిజిటల్‌తో పాటు ఇతర మాధ్యమాల ప్రకటనల ద్వారా కార్తీక్ కంపెనీ నాణ్యమైన, సరికొత్త ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తారని వివరించింది. తమ పోర్ట్‌ఫోలియోను మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా బ్రాండ్‌ను మారుస్తున్నామని బాటా ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్-మార్కెటింగ్ ఆనంద్ నారంగ్ చెప్పారు. కార్తీక్ ఆర్యన్ లాంటి పాజిటివ్ ఎనర్జీ, ఈజీగోయింగ్ అప్రోజ్ యూత్‌ను ఆకట్టుకుంటుందని, కార్తీక్‌తో అనుబంధం ద్వారా యువతతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా బాటా రెడ్ లేబుల్, నార్త్ స్టార్, పవర్ హుష్ పప్పీస్ లాంటి యువబ్రాండ్లను తెరపైకి తీసుకు రావడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. -
కార్తిక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు అమ్మాయిలు ఫిదా
నటీనటులు ఎప్పుడూ ఒకేలా ఉంటే ఫ్యాన్స్‌కి కూడా బోర్ కొట్టేస్తుందిగా.. అందుకే అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించి కొత్త లుక్‌తో ఒక్క ఫోటో రిలీజ్ అవ్వగానే దానికి కామెంట్లు, షేర్లు వరదల్లా వచ్చి పడుతుంటాయి. అందుకే ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఎలా ఎంటర్టైన్ చేయాలా అనే ఆలోచిస్తుంటారు నటీనటులు. బాలీవుడ్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంటుంది. పైగా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే లాక్డౌన్ సమయంలో ఫ్యాన్స్‌కు బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయడమే కాదు లైవ్‌లు పెట్టి వారితో మాట్లాడేవాడు కూడా. చదవండి: (యశ్‌తో భారీ మల్టీస్టారర్‌కు శంకర్ ప్లాన్) ఇటీవల జుట్టు పెంచుకున్నకార్తీక్ ఆర్యన్ కొత్త మేక్ ఓవర్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘కళ్లే మాట్లాడతాయి’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ సన్ కిస్స్‌డ్ సెల్ఫీలో కార్తీక్ సింపుల్‌గా ఒక టీ షర్ట్‌తో ఉన్నా తన డాషింగ్ లుక్ మాత్రం నెటిజన్లను కట్టిపడేస్తోంది. పెరిగిన జుట్టుతో, గడ్డంతో కార్తీక్ మునుపటి కంటే ఎక్కువ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కార్తీక్ ఆర్యన్ చివరగా 2019 డిసెంబర్లో విడుదలైన ‘పతి పత్నీ ఔర్ వో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. చదవండి: (13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు) 1978లో సంజీవ్ కుమార్, విద్యా సిన్హా, రంజితా కౌర్ నటించిన సినిమాకు ఇది రీమేక్. ఇందులో కార్తీక్ భూమీ పెడ్నేకర్, అనన్య పాండేతో జతకట్టాడు. ఈ సినిమా మరీ హిట్ టాక్ సాధించకపోయినా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. కార్తీక్ తర్వాత చిత్రం ‘దోస్తానా2’లో మళ్లీ ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు. ఈ సినిమాలో తనకు జంటగా జాన్వీ కపూర్, లక్ష్య నటించనున్నారు. View this post on Instagram Let the eyes do the talking A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Nov 5, 2020 at 11:30pm PST -
అల.. హిందీలో
ఈ ఏడాది సంక్రాంతికి మంచి హిట్ అందుకొని, అల్లు అర్జున్‌కి కమ్‌బ్యాక్ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా హిందీలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ రీమేక్‌లో అల్లు అర్జున్ పాత్రను కార్తీక్ ఆర్యన్ చేయబోతున్నారు. ‘దేశీ బాయ్స్, డిష్యూం’ చిత్రాలను తెరకెక్కించిన రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఏక్తా కపూర్‌తో కలసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం’
కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా సినీ పరిశ్రమ పూర్తిగా షట్‌డౌన్ అయ్యింది. లాక్‌డౌన్‌తో షూటింగ్‌లకు బ్రేక్ దొరికింది. దాంతో నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు సినీ జనాలు. అలానే ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ట్విట్టర్ యూజర్ ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అని కార్తిక్‌ను అడిగాడు. అందుకు ఈ యువ హీరో ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం. పెద్దగా ఖర్చు కాదు’ అని సమాధానమిచ్చాడు కార్తిక్. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. (‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’) Actually abhi best time hai Kharcha nahi hoga #AskKartik https://t.co/np5KnXtpmA — Kartik Aaryan (@TheAaryanKartik) July 11, 2020 మరో వ్యక్తి ‘లాక్డౌన్ కాలంలో మీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంట వాస్తవమేనా’ అని ప్రశ్నించాడు. అందుకు కార్తిక్ ‘ఇది ఇలాగే కొనసాగితే.. లాక్డౌన్ కాలంలోనే నాకు ఓ బిడ్డ పుట్టిందనే వార్తలు కూడా వస్తాయి’ అంటూ వెటకారంగా స్పందించాడు. మరొకరు ‘సార్ ఒక్క రోజు కోసం మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్వర్డ్ చెప్పండి ప్లీజ్ అని అభ్యర్థించాడు. అందుకు కార్తిక్ ‘రీచార్జ్ చేయించాల్సి ఉంటుంది’ అని తెలిపాడు. Koi chota recharge hai inke liye @NetflixIndia #AskKartik https://t.co/TB8m92Hk6z — Kartik Aaryan (@TheAaryanKartik) July 11, 2020 -
పుట్టిన రోజు కేక్ వారమంతా తిన్న తర్వాత..
ముంబై : లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేయడంతోపాటు లైవ్ చాటింగ్‌లతో సందడి చేస్తున్నారు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానలు చెబుతూ వారికి కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె సోషల్ మీడియాలో శనివారం బూమరాంగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో దీపిక స్పూన్ పట్టుకొని ‘పుట్టిన రోజు కేక్ వారమంతా తిన్న తర్వాత నన్ను నేను పరిశీలించుకుంటున్నాను’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా ఈ నెల 6న దీపికా భర్త రణ్వీర్ సింగ్ 35 పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక దీపికా పోస్టుపై నెటిజన్లతోపాటు బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించారు. (రణ్వీర్ పుట్టినరోజు.. దీపికా కామెంట్) View this post on Instagram Checking myself out after eating birthday cake all week!🤪🥳🤤 🎂🍰🧁🍪🍨🍦🥧 #birthday #celebration A post shared by Deepika Padukone (@deepikapadukone) on Jul 11, 2020 at 2:09am PDT ‘ఎంత శుభ్రమైన స్పూన్‌ను ఉపయోగిస్తున్నారు’. అని కార్తీక్ ఫన్నీగా కామెంట్ చేశారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ స్నేహితుల పోస్టులపై కార్తీక్ సరదా కామెంట్లు చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇటీవల తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారని కార్తీక్‌ను ఒక అభిమాని అడిగినప్పుడు దీపికా లాంటి భార్య కావాలని ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో వెల్లడించారు. ఆమె తన భర్త రణ్వీర్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని అందుకే అలా సమాధానమిచ్చినట్లు కార్తీక్ వివరించారు. (అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా: కార్తీక్) -
చైనా మొబైల్ కంపెనీ డీల్‌కు హీరో గుడ్ బై
టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేదించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రముఖులు సహా పలువురు సెలబ్రిటీలు దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ మాత్రం మరో అడుగు ముందుకేసి చైనా మొబైల్ సంస్థలతో ఇదివరకే కుదుర్చుకున్న కొన్ని కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడట. కార్తీక్ ఇంతకుముందు చైనా మొబైల్ కంపెనీ ఒప్పోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేవాడు. అయితే భారత్ -చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీస్ కంపెనీలతో ఇదివరకే కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కార్తీక్ తాజా పోస్టులను బట్టి ఫ్యాన్స్ దీన్ని కన్పర్మ్ చేసేశారు. (ఆస్ట్రేలియాలో నటికి చేదు అనుభవం) తాజాగా నటుడు కార్తీక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాపిల్ మొబైల్ ఫోన్‌తో ఓ ఫోటోను షేర్ చేశాడు. తన ఇంట్లో కిటీకీ దగ్గర నిలబడి మేఘాలను తన మొబైల్లో ఫొటో తీస్తున్న చిత్రం అది. అయితే కార్తిక్ పట్టుకున్న ఫోన్ ..ఐ ఫోన్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ చైనా ఫోన్‌కి ప్రచారాన్ని వదిలేశాడని అతని ఫొటో ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. దీంతో మిగతా హీరోలు కూడా చైనా మొబైల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్యార్ కా పుంచనామాతో సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్..పంచనామా -2, కాంచి-ది అన్బ్రేకబుల్ , లుకా చుప్పి వంటి సినిమాల్లో నటించారు. లాక్డౌన్ కి ముందు లవ్ ఆజ్ కల్ సినిమాలో సారా అలీఖాన్‌తో సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకన్నాడు ఈ యంగ్ హీరో. (ప్రభాస్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్) View this post on Instagram Yes. I am that Bua who needs to click the sky every time there is a cloud ⛅️ A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Jul 8, 2020 at 1:09am PDT -
అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా: కార్తీక్
బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ దీపికా పదుకొనేకు అభిమానిగా చెప్పుకుంటాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిన ఓ లైవ్ షోలో కార్తిక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘మీ కాబోయే భార్య ఎలా ఉండాలి’ అని అతడిని ప్రశ్నించాడు. అందుకు కార్తిక్ .. దీపికా పదుకొనే లాంటి వ్యక్తి అయితే బాగుంటుందని సమాధానమిచ్చాడు. దానికి గల కారణాన్ని కూడా వివరించాడు. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ.. ‘దీపిక, తన భర్త రణ్వీర్ సింగ్‌ను తెగ ముద్దు చేస్తారు. ఈ ప్రపంచంలో దీపికకు బాగా ముద్దు వచ్చే ముఖం రణ్వీర్దే. తనలా భర్తను ముద్దు చేసే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటాను’ అన్నాడు. ఇక దీపిక, రణ్వీర్ విషయానికి వస్తే.. ఆరేళ్లు ప్రేమించుకుని 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వాళ్లిద్దరూ సోషల్ మీడియా పోస్టింగులు చూస్తే.. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. బాలీవుడ్లో జరిగే అవార్డు కార్యక్రమాలకు, పార్టీలకు జంటగా హాజరవుతుంటారు. ప్రస్తుతం వీర్దిదరూ జంటగా ‘83’ చిత్రంలో నటించారు. -
కార్తీక్‌కు దీపికా సలహా.. ఖండించిన డిజైనర్
ముంబై: బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్‌ను గడ్డం ట్రిమ్ చేసుకోవాలని బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె సూచించారు. కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం నిర్వహించిన లైవ్ చాట్ సందర్భంగా.. కార్తీక్‌ను గడ్డం తీసేయాలని ఆమె సలహా ఇచ్చారు. అయితే ఈ లైవ్ చాట్‌లో కార్తీక్ తన గడ్డం తీసేయలా లేదా ఇలాగే ఉంచాలా అని అభిమానులను అడగ్గా దీనిపై దీపికా పైవిధంగా స్పందించారు. అయితే కార్తీక్.. గడ్డం తీసేయాలని లేదంటే ఫుడ్ కట్ అంటూ తన తల్లి హెచ్చిరిస్తున్నట్లు చెప్పాడు. దీంతో తాను ఇప్పుడు గడ్డం తీసేయాలా వద్దా అని అభిమానులను సలహా అడిగాడు. (నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఆయన: దీపిక) దీనికి దీపికా పదుకొనె.. అమ్మాయి చేయి ఎత్తిన ఎమోజీని కామెంటు చేసి.. తాను కూడా కార్తీక్ తల్లికే మద్దతు ఇస్తున్నానని, వెంటనే గడ్డం ట్రీమ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడ్జానీయా ఖండిస్తూ.. నువ్వు గడ్డం తీసేయకు.. మీ అమ్మ అన్నం పెట్టకుంటే నువ్వు వంట చేయడం నేర్చుకో’ అంటూ కామెంటు చేశారు. కాగా లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన కార్తీక్ ఈ ఖాళీ సమాయాన్ని వృధా చేయకుండా ఇంట్లో స్వయం ఉపాధి కల్పించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లను ఇంటర్య్వూ చేస్తున్నాడు. -
‘అవుట్ డేటెడ్ దర్శకుడిననే ఒప్పకోలేదు!’
హంగామా-2 కోసం బాలీవుడ్ హీరోలు ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్లను మొదట సంప్రదించగా వారు నిరాకరించినట్లు దర్శకుడు ప్రియదర్శన్ వెల్లడించారు. 2003లో కామెడీ నేపథ్యంలో రూపొందించిన ‘హంగామా’కు సీక్వెల్‌గా ‘హంగామా-2’ను ఆయన తెరకెక్కిస్తున్నారు. కాగా దీనికోసం ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ మల్హోత్రాలు వంటి పెద్ద హీరోలను సంప్రదించానని చెప్పారు. అయితే వారిలో ఎవరూ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపలేదని కూడా పేర్కొన్నారు. తాను కాలం చెల్లిన దర్శకుడినని భావించే వారు తన ప్రాజెక్టును తిరస్కరించి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఆ వీడియో డిలీట్ చేసిన హీరో..) దీనిపై ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘నేను వారిని నేరుగా కలవలేదు కానీ అయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ మల్హోత్రా వంటి పెద్ద హీరోలను దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశాను. అయితే వారు ఈ ప్రాజెక్టును తిరస్కరించారు. బహుశా నేను అవుట్ డేటెడ్ డైరెక్టర్‌నని ఒప్పుకుని ఉండరు. ఎందుకంటే గత అయిదేళ్ల నుంచి నేను ఒక్క హిందీ సినిమాను కూడా తెరకెక్కించలేదు’ అని చెప్పుకొచ్చారు. అదే విధంగా ‘‘నా నమ్మకాన్ని విశ్వసించే నటులతోనే పని చేయడానికి నేను ఇష్టపడతాను. వారికి నాతో పని చేయడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పినప్పటికీ నటులను అభ్యర్థించడం నాకు ఇష్టం ఉండదు. నా మీద నమ్మకం ఉంచి నాతో నటించడానికి వచ్చిన వారితోనే నేను పనిచేస్తాను. ఎప్పుడైన మీరు నటులను నటించమని కోరితే వారికి మీ మీద నమ్మకం లేకపోతే అప్పుడు వారు గౌరవం ఇస్తూనే కాఫీ లేదా టీని అందించి మెల్లిగా మీ నుంచి తప్పించుకుంటారు’’ అని ఆయన చెప్పారు. కాగా హంగామా-2 సినిమా చిత్రీకరణపై ఆయన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ప్రణితా సుభాష్‌లు నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం వారిని సంప్రదించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పారు. -
ఆ వీడియో డిలీట్ చేసిన హీరో..
బాలీవుడ్ యువహీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో తన సోదరితో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలను షేర్ చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. లాక్డౌన్లో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న కార్తిక్ తన సోదరి కిృతికతో కలిసి ఫన్నీ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన చెల్లితో కలిసి చేసిన రోటీ టిక్‌టాక్ వీడియాను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం షేర్ చేశాడు. (కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టా: కార్తీక్ ఆర్యన్) ఈ వీడియోలో కార్తీక్ తన సోదరి కిృతిక చేసిన చపాతిని తింటాడు. ఆ చపాతి రుచిగా లేకపోవడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టేస్తాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు గృహహింసను ప్రోత్సహించేలా ఉందంటూ కార్తిక్‌పై మండిపడ్డారు. అంతేగాక కార్తీక్ గతంలో నటించిన ‘ప్యార్ కా పుంచ్నామా’, ‘సోను కే టిటుకి స్వీటీ’ వంటి సినిమాల్లో మహిళలపై చేయి చేసుకునే పాత్రలను ఈ సందర్భంగా ఎత్తి చూపుతూ.. కార్తీక్‌పై విమర్శలు గుప్పించారు.ఇక నెటిజన్ల కామెంట్స్ చూసిన కార్తిక్ వెంటనే ఈ వీడియోను ఇన్‌స్టా నుంచి డిలీట్ చేశాడు. కాగా ప్రస్తుతం కార్తీక్ ‘దొస్తానా -2 ’, ‘భూల్ భూలైయా 2’ లతో పాటు ‘తన్హాజీ’ దర్శకుడు ఒం రౌత్ రూపోందిస్తున్న 3డీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.చదవండి: కపిల్ దేవ్ గుండు.. ఆమే కారణం! -
ది గ్రేట్ ఖలీకి స్ఫూర్తినిస్తోన్న హీరో పాట
కరోనా వైరస్‌పై బాలీవుడ్ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ పాడిన ర్యాప్ సాంగ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ‘కరోనా! స్టాప్ కరోనా’ అంటూ సాగే ఈ ర్యాప్‌తో సామాజిక దూరం, వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు ఆర్యన్. అయితే ఈ ర్యాప్‌కు ప్రముఖ రెస్లర్, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ ఫ్యాన్ అయిపోయారు. ఈ పాటనుంచి జిమ్ వర్కవుట్లు చేయటానికి కావాల్సిన స్ఫూర్తిని పొందుతున్నారు. ఖలీ ఈ పాట వింటూ జిమ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆయనే తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే.. ) చదవండి : సర్పంచ్‌ను చితకబాదిన గ్రామస్తులు -
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టా: కార్తీక్ ఆర్యన్
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఆపద కాలంలో ప్రజలను ఆదుకుంటూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేస్తున్నారు. కరోనా మహమ్మారితో పోరాడేందుకు ప్రధాని పిలుపు మేరకు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ విరాళాలు అందించి తన ఔధార్యాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యువ నటుడు ఆదివారం ఓ హాస్యభరితమైన పోస్ట్ చేశాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు కల కన్నాడట. అభిమానులు చుట్టూ గుమిగూడి ఉండగా. మధ్యలో కారుపై కార్తిక్ నిల్చొని అభిమానులకు చేయి ఊపుతున్నట్లు ఉండే ఓ వీడియోను కార్తిక్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’) ‘కరోనా వైరస్ కోసం నేను వ్యాక్సిన్ కనుగొన్నానని కల కన్నాను.’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ.. ‘భాయ్ బయోటెక్నాలజి చదివుంటాడు’ అని కామెంట్ చేస్తున్నారు. దీనిపై కార్తీక్ ప్రతిస్పందిస్తూ ‘మీరు బయోటెక్నాలజీ నుంచి ఒక భాయ్‌ను తొలగించవచ్చు, కాని మీరు భాయ్ నుంచి బయోటెక్నాలజీని తొలగించలేరు’. అంటూ బదులిచ్చారు. ఇక కార్తిక్ ముంబైలోని డీవై పాటిల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందిన విషయం తెలిసిందే. ఇక కార్తిక్ ఇలా చిలిపి పనులు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకముందు కూడా కార్తిక్ తన చమత్కారాన్ని ప్రదర్శించాడు. తనను వృద్ధుడిగా చూపించే ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘లాక్డౌన్లో వృద్ధాప్యం. బాగ్భాన్ రీమేక్ చేయాలనుకుంటున్నాం. హీరోయిన్ పాత్ర కోసం మీ ఎంట్రీలను పంపడి’ అంటూ చమత్కరించారు. కాగా ప్రస్తుతం కార్తీక్.. ‘దోస్తానా 2’ ‘భూల్ భూలైయా 2’లలో నటిస్తున్నారు. (‘వదినా.. అతనే కదా అలా పిలవమని చెప్పింది’) నా తండ్రిని చూసి 3 వారాలయ్యింది: సల్మాన్ View this post on Instagram Aaj Sapna Aaya ki Mujhe Vaccine Mil Gayi👨🏻🔬 A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Apr 5, 2020 at 1:48am PDT -
‘లవ్ ఆజ్ కల్ 2’ ఫస్ట్ డే కలెక్షన్ అదుర్స్.. కానీ!
బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ సారా అలీ ఖాన్, రణ్‌దీప్ హూడాలు ప్రధాన పాత్రలో నటించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫ్రిబ్రవరి 14)న విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు ఇంతీయాజ్ అలీ 2009లోని ‘లవ్ ఆజ్ కల్’కు స్వీకెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. విభిన్న ప్రేమకథ భావాలతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సెన్సార్ బోర్డు కూడా సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. అలా ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 12.40 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ సినిమా అనుకున్న అంచనాలకు చేరుకోలేక పోయింది. అటు అభిమానుల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్! దర్శకుడు ఇంతీయాజ్ కాలానుగుణంగా ప్రేమలో వచ్చే మార్పులను చూపించేందుకు భిన్న ప్రేమ కథలను తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా కార్తీక్ ఆర్యన్ 2020 నాటి ప్రేమికుడు వీర్, 1990 నాటి రఘుగా ద్విపాత్రలు పోషించాడు. ఇక వీర్‌కు ప్రియురాలిగా సారా నటించగా.. 1990 నాటి రఘు ప్రేయసిగా లిలా పాత్రలో ఆరూషి నటించిది. ఇక ఆరూషికి ఇదే మొదటి సినిమా కూడా. ఇకపోతే విడుదలైన రోజునే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా సారా అలీ ఖాన్ చేసిన ఓవరాక్షన్ భరించలేపోయామంటు సారాపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో కేవలం కార్తీక్ నటన మాత్రమే బాగుందని.. మిగతాదంతా అంతా చెత్తగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్యారాచూట్‌పై ఉన్న ఓ వ్యక్తి భయపడుతూ కళ్లు మూసుకున్న ఫొటోని షేర్ చేస్తూ.. ‘కావాలంటే 500 ఇస్తాం దయచేసి సినిమా ఆపండ్రా బాబు’ అంటూ క్రియోట్ చేసిన మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’
బాలీవుడ్ యువనటుడు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్లు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన జంట. వీరిద్దరూ తొలిసారిగా జతకట్టిన సినిమా లవ్ ఆజ్ కల్ 2 నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి బీ-టౌన్లో ఎక్కడ చూసిన వీరే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కార్తీక్, సారాను ఆటపట్టించడం, వారికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేయడం వారు సరదాగా ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కార్తీక్ వారికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కార్తీక్ ఇద్దరబ్బాయిలతో ఫుట్‌బాల్ ఆడుతుండగా.. వెనకాల వచ్చిన సారాను చూసి ఓ బాలుడు ‘కార్తీక్ అన్నయ్య.. వదిన వచ్చింది చూడు’ అనగానే కార్తీక్ కాస్తా షాక్‌కు గురయ్యాడు. ఇక అది విన్న సారా నవ్వులు చిందిస్తూనే.. వదిన అని ఎవరూ పిలిచారు అంటూ హెచ్చరించింది. ఆ తర్వాత ఆ బాలుడి వైపు నడుస్తూ.. ‘అతనే కదా.. నిన్ను వదిన అని పిలవమన్నాడు’ అని కార్తీక్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించిన ఈ వీడియోను కార్తీక్ ‘వదిన అని ఎవరు పిలిచారు’ అనే క్యాప్షన్‌కు బుంగమూతి పెట్టుకున్న ఎమోజీని జత చేసి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆ జంట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘అసభ్యకర సన్నివేశాలు తగ్గించి.. బిప్ చేయండి’ కాగా ఇటీవలల ఓ ఇంటర్యూలో కార్తీక్‌తో ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు.. ‘అవును ప్రేమిస్తున్నాను కానీ సినిమాలో’ అంటూ వారిమధ్య ప్రేమ లేదని చెప్పకనే చెప్పి తెలివిగా తప్పించుకుంది ఈ భామ. కాగా ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కార్తీక్ సారాను స్టేజీపైకి చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడంతో వీళ్తు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటజన్లంతా మండిపడ్డారు. కార్తీక్ స్వయంగా వంట చేసి సారాకు తినిపించడం, అప్పుడప్పుడూ కార్తిక్, సారాను సోషల్ మీడియాలో ఆటపంటించడం చూసి వీరిద్దరిని లవ్ బర్డ్స్‌గా ఫిక్సైపోతున్నారంతా. కాగా తాజా సెన్సార్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులను పలకరించనుంది. చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో View this post on Instagram Bhabhi kisko bola ☺️ A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Feb 13, 2020 at 3:38am PST -
‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్!
సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్, యువ నటుడు కార్తీక్ ఆర్యన్లు నటిస్తున్న ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు షరతులు విధించింది. ఈ చిత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని వాటిని తీసివేయాల్సిందిగా డైరెక్టర్‌కు సూచించింది. అలాగే హీరో, హీరోయిన్ సంభాషణల్లో కొన్ని అసభ్యకర పదాలు ఉన్నాయని.. ఆ మాటలను బీప్ చేయాలని చెప్పింది. అలాగే సారా, కార్తీక్‌ల మధ్య ఉన్న కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి.. మరికొన్నింటి నిడివిని తగ్గించింది. అదే విధంగా సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే సారా, కార్తీక్‌ల ముద్దు సీన్‌ను కట్ చేయడంతోపాటు కొన్ని సీన్లను బ్లర్ చేసింది. మరోవైపు ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2009లో సైఫ్ అలీఖాన్, దీపికా నటించిన ‘లవ్ ఆజ్ కల్’కు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చదవండి : కార్తిక్‌తో ఆ సీన్లో నటించాలని ఉంది: నటి కూతురు ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
బైక్‌పై చక్కర్లు కొడుతున్న బాలీవుడ్ జంట!
బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్, యువ నటుడు కార్తీక్ ఆర్యన్లు ‘లవ్ ఆజ్ కల్ 2’తో తొలిసారిగా జతకట్టారు. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటీ నుంచి వీరిద్దరి మధ్య ప్రేమయాణం సాగుతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే గతంలో వాటిని సారా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సారా, కార్తీక్‌లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కార్తిక్, సారాతో కలిసి బైక్ వెళుతున్న బుమరాంగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఛలాన్ కడతావా.. అయితే నాది కూడా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తూ సారాను సరదాగా ఆటపట్టించాడు. కార్తిక్ పోస్టుకు సారా స్పందిస్తూ.. కోపంగా ఉన్న ఎమోజీని కామెంటు చేసింది. ఇక కార్తిక్ వెంటనే ‘జోక్ చేశాను అంతే.. పడుకో..’ అంటూ సారాను సముదాయించాడు. ఇలా సారాను సందర్భం చిక్కినప్పుడల్లా కార్తీక్ సోషల్ మీడియాలో ఆటపట్టిస్తూనే ఉంటాడు. (చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో) View this post on Instagram Challan Katega Aur mera bhi .... A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Feb 11, 2020 at 9:01am PST ఇటీవల సారాకు స్వయంగా తన చేతితో తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘చాలా బక్కచిక్కిపోయావు.. నువ్వు మళ్లీ ముందులా మారిపోవాలి’ అంటూ కార్తీక్ ఆర్యన్ ఆటపట్టించాడు. ఇక సారా లావుగా ఉన్నప్పుటీ ఫొటోలు, వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. సారా తన సినిమా కేరిర్ కోసం 96 కిలోగ్రాముల బరువు ఉన్న సారా నాజుగ్గా తయారయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రమోషన్లోని ఓ కార్యక్రమంలో కార్తీక్, సారాను స్టేజీపైకి ఎత్తుకొని తీసుకెళ్లిన ఫొటోలు, ఓ స్వీమ్మింగ్ ఫూల్ దగ్గర సారా దిగుతానంటే కార్తీక్ వద్దంటూ ఆపుతూ... ప్రేమికుల్లా ప్రవర్తించిన తీరును చూసి ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో
సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, యువనటుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా విపరీతమైన రూమర్లు వినిపిస్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’లో జోడీ కట్టిన వీళ్లిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని వస్తున్న వార్తలను సారా గతంలోనే ఖండించారు. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో కార్తీక్ సారాని రెండు చేతులతో ఎత్తుకొని స్టేజీపైకి తీసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు ఇది కూడా అబద్ధమంటారా అని సెటైర్లు విసిరారు. తాజాగా వీళ్లిద్దరూ మరోసారి ప్రేమికుల్లా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కార్తీక్ ఆర్యన్.. సారాకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. వీరి ప్రేమానురాగాలను ఫొటోలో బందిస్తూ దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘నువ్వు చాలా చిక్కిపోయావు. మళ్లీ సాధారణ బరువుకు రావాలి’ అటూ క్యాప్షన్ జోడించాడు. (ఆస్కార్ 2020 : ఉత్తమ నటుడిగా ‘జోకర్’ హీరో) ఇంకేముంది.. నెటిజన్లు ఊరుకుంటారా. ‘బాలీవుడ్లో కొత్త జంట’, ‘ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు’ అంటూ వారిని ప్రేమ పక్షులుగా ఫిక్సయిపోతున్నారు. అంతేకాదు, కార్తీక్.. ప్రేయసి కోసం స్వయంగా వంటచేశాడేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా సారా అలీఖాన్ బాలీవుడ్లో అడుగుపెట్టే సమయానికి 96 కిలోల బరువుండేది. కానీ రానురానూ నాజూకు సుందరిగా మారిపోయింది. దీనిపై హీరోయిన్ కరీనా కపూర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నేను బొద్దుగా ఉండే పాత సారాను మిస్ అవుతున్నాను. ఇప్పుడు నీకెంతో ఇష్టమైన పిజ్జాలు తినడం కూడా మానేసావు కదా’ అని అడిగింది. దీనికి సారా ‘ అవును, కానీ ఇప్పుడు పిజ్జాలు కొనేందుకు అవసరమయ్యే డబ్బు సంపాదిస్తున్నాను. దానికి ఏమంటావు?’ అని సమాధానమిచ్చింది. ఆమె నాజూకుగా మారడం కరీనాకే కాదు, కార్తీక్‌కు కూడా నచ్చలేదని తెలుస్తోంది. ఇక సారా, కార్తీక్ తొలి సారి జోడీ కట్టిన ‘లవ్ ఆజ్ కల్2’ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. (కార్తీక్‌తో ప్రేమలో ఉన్నా: సారా) చదవండి: ఈ ఏడాదే రణ్‌బీర్, అలియాల పెళ్లి!? (యాక్షన్ ఫీట్లతో అదిరిపోయిన భాగీ-3 ట్రైలర్) -
‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’
సైఫ్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చేసింది రెండు సినిమాలే అయినా ఎంతో క్రేజ్‌ను తెచ్చుకున్నారు సారా. అయితే ఈ భామ యువ హీరో కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తుందని వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘లవ్ ఆజ్ కల్’ ట్రైలర్లో ఈ అమ్మడు చాలా ఓవర్ చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీటిపై సారా స్పందిస్తూ.. ‘నా బరువు, అందం, ఫ్యాషన్‌పై విమర్శలు వచ్చినా నేను పట్టించుకోను.. కానీ నా నటన, నైపుణ్యంపై విమర్శలు వచ్చాయి. అదే నాకు పెద్ద పరీక్ష’ అన్నారు. మొదటి సారిగా విమర్శలు నన్ను చాలా బాధపెట్టాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా కాగా ‘లవ్ ఆజ్ కల్’ ట్రైలర్లో సారా ‘నువ్వు నన్ను బగ్ చేస్తున్నావా’ అని చెప్పిన డైలాగ్‌కు విమర్శలు వస్తున్నాయి. ఆమె నటన అతిగా ఉందని, ఆ డైలాగ్ చెప్పెటప్పుడు తను ఎలాంటి దస్తులు ధరించిందో, తను చెప్పిన డైలాగ్ ఎంటో ఓసారి చూసుకుంటే బాగుండని, జో గా నటించిన ఆ ఒక్కసీన్ తన అభిమానులను నిరాశకు గురిచేసిందంటూ సారాకు క్లాస్ పీకుతున్నారు. ఇక తనపై వస్తున్న విమర్శల గురించి దర్శకుడు ఇంతియాజ్‌తో కూడా మాట్లాడానని సారా చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో తన నటన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొవడానికి ఈ విమర్శలు ఉపయోగకరంగా ఉంటాయని సానుకూలంగా స్పందించారు. 2010లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనెలు నటించి ‘లవ్ ఆజ్ కల్’ డైరెక్టర్ ఇంతియాజ్ అదే సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా
బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు. గత కొద్ది రోజులుగా సారా, యువ హీరో కార్తిక్ ఆర్యన్లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు కార్తిక్, సారాలు దీనిపై స్పందించక పోవడంతో వారిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారంతా. ఇక సారా తాజాగా వీటన్నింటికీ చెక్ పెట్టేశారు. ఇటీవల ఓ ఇంటర్యూలో కార్తిక్‌తో ప్రేమ విషయం అడగ్గా.. ‘నేను కార్తిక్‌తో కలిసి పని చేస్తున్నానని అనుకోవడం లేదు. నేను వీర్‌తో కలిసి సెట్లో డేటింగ్ చేస్తున్నా. ఎందుకంటే మేము సేట్లో సారా, కార్తిక్‌లా కాకుండా జో, వీర్(సినిమాలోని పాత్రల పేర్లు)లా ఉంటాము’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.(ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్) ‘అవును కార్తిక్‌తో ప్రేమలో ఉన్నాను.. కానీ బయట కాదు సినిమాల్లో. ప్లీజ్.. మీరంతా తెరపై 2.5 గంటలు పాటు కనిపించే మా ప్రేమను చూడండి’ అంటూ సారా అలీ ఖాన్ పేర్కొన్నారు. అలాగే తను యువతరానికి చెందినదానినా లేదా పాత కాలం అమ్మాయినా అనే విషయం తనకే తెలియదని.. కొన్నిసార్లు ప్రేమంటే నచ్చుతుంది. మరికొన్ని సార్లు ప్రేమకు దూరంగా ఉంటానని చెప్పారు. కాగా కాఫీ విత్ కరణ్ షోలో.. సారా వృత్తి పరంగా.. కార్తిక్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కార్తిక్ కూడా సారా గురించి చెప్పాడు. దీంతో వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. సారా, కార్తిక్‌లు నటిస్తున్న ‘లవ్ ఆజ్ కల్’ ఫిబ్రవరి 14న విడుదల కానున్నట్లు సమాచారం.(హీరోయిన్ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!) -
కార్తిక్‌తో ఆ సీన్లో నటించాలని ఉంది: నటి కూతురు
నెపోటిజమ్‌పై అనన్య పాండేకు మంచి అభిప్రాయం లేదంటున్నారు బాలీవుడ్ నటి పూజ బేడి కూతురు అలయా. కాగా అలయా ‘జవానీ జానేమాన్’ చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేయనున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలయ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అవును.. అనన్యకు నెపోటిజమ్ మీద మంచి అభిప్రాయం లేదు కానీ నాకు ఉంది’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రస్తుత వర్థమాన నటి, నటుల చిత్రాలను చూస్తున్నానని, వారి నటన తీరు, ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటున్నానని చెప్పారు. కాగా కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్లు నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఆజ్ కల్’ టైలర్ ఇటివలే విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అలయా మాట్లాడుతూ.. ‘సారా, కార్తీక్‌ల బెడ్ సీన్ చూశాను. అది చూసిన తర్వాత నాకు కూడా కార్తిక్‌తో అలాంటి సన్నివేశంలో నటించాలనిపించింది’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కార్తిక్‌ను మీ బెడ్‌పై చూస్తే అప్పుడు మీ స్పందన ఎంటి అని అడిగిన ప్రశ్నకు ‘ఒకవేళ నేను లేచేసరికి కార్తిక్ నా బెడ్‌పై కనిపించినా ఆశ్చర్యపోను.. ఎందుకంటే అది నేను కోరుకున్న విషయమే.. ఇది ఇంతకు ముందే చెప్పాను’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఈ అమ్మడు. అంతేకాదు ‘నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఓ బంధంలో ఉండటమంటే నా దృష్టిలో కష్టమే’ అని పేర్కొన్నారు. కాగా రాపిడ్ ఫైర్ గేమ్‌లో భాగంగా అడిగిన ప్రశ్నలకు.. ‘పెళ్లి వరుణ్ దావన్ చేసుకుంటాను. డేటింగ్ కార్తిక్ ఆర్యన్‌తో చేస్తాను. ఇషాన్ ఖత్తర్‌ను చంపేస్తాను’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అలాగే ఒకే జెండర్‌తో అయితే ‘సారా అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంటా, జాన్వీ కపూర్‌తో డేటింగ్ చేస్తా.. అనన్యను చంపేస్తా’ అని చమత్కరించడం విశేషం. -
సవ్యంగా సాగిపోవాలి
తన కొత్త సినిమా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్న హిందీ చిత్రం ‘దోస్తానా 2’. ఈ సినిమాకు కొల్లిన్ డి కున్హా దర్శకుడు. 2008లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ముందు కాస్త సమయం దొరకడంతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు జాన్వీ కపూర్. ‘దోస్తానా 2’ చిత్రాన్ని బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్‌జోహార్ నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించిన తాజా సినిమా పతీ పత్నీ ఔర్ వో. భూమి పడ్నేకర్, అనన్య పాండే ఇందులో హీరోయిన్లు. 1978లో విడుదలైన పతీ పత్నీ ఔర్ వో సినిమా పేరుతో ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో వైవాహిక బంధం, తన భార్య గురించి చింటూ త్యాగి(కార్తిక్ ఆర్యన్) చెప్పిన డైలాగులు వివాదాస్పదమయ్యాయి. ‘ శృంగారం విషయంలో భార్య అనుమతి అడిగితే బిచ్చగాళ్లుగా.. ఆమెను తిరస్కరిస్తే మోసగాడిగా... ఇష్టం లేకున్నా బలవంతం చేస్తే అత్యాచారం చేసిన వాళ్లుగా ముద్రవేస్తారు’ అంటూ అతడు చెప్పిన డైలాగులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. ‘వైవాహిక అత్యాచారం కారణంగా ఎంతో మంది మహిళలు మానసిక వేదన అనుభవిస్తుంటే.. మీకు నవ్వులాటగా ఉందా’ అంటూ మూవీ యూనిట్‌కు చివాట్లు పెడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి క్యారెక్టర్లు చేసేందుకైనా సిద్ధపడతారా అంటూ హీరోయిన్లను సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి ఫడ్నేకర్ మాట్లాడుతూ.... మహిళల సమస్యలను అపహాస్యం చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘ మమ్మల్ని క్షమించండి. మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. ఈ సినిమాకు పనిచేసిన ఏ ఒక్కరూ కూడా అసలు అలా ఆలోచించరు. సినిమాను కేవలం వినోద సాధనంగా మాత్రమే చూడాలి’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్ చింటూ త్యాగి భార్య పాత్రలో నటిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘పతీ, పత్నీ ఔర్ వో’ ట్రైలర్
-
మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!
‘పతీ, పత్నీ ఔర్ వో’ ట్రైలర్ స్పైసీ డైలాగులు, క్రేజీ సీన్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కార్తీక్ ఆర్యన్, భూమి పడ్నేకర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. 1978లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘పతీ, పత్నీ ఔర్ వో’ ను అదే పేరుతో దర్శకుడు ముదస్సర్ అజిజ్ తెరకెక్కించారు. అప్పటి సినిమాను, ఇప్పటి సినిమాను కూడా బీఆర్ చోప్రా ఫిలిమ్స్ నిర్మించడం గమనార్హం. కానీ, పాత సినిమా కథకు ఏమాత్రం సంబంధంలేకుండా సరికొత్త నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తెచ్చారు. తండ్రి మాట మేరకు టెన్త్‌లో పాసై.. ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్న చింటూ త్యాగి (కార్తీక్) వేదిక (భూమి)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇంతలోనే తపస్య శర్మ (అనన్య) పరిచయం అవుతోంది. ఆమె మాయలో పడిన చింటూ త్యాగి.. ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డాడు.. పెళ్లి తర్వాత ఎఫైర్‌తో వల్ల అతను పడే ఇబ్బందులు ఏమిటన్నది సినిమా కథగా ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. మీ హాబీస్ ఏమిటని కార్తీక్ అడిగితే.. ‘సెక్స్ బహోత్ పసంద్ హై’ అంటూ భూమి బదులివ్వడం.. పెళ్లయిన విషయం ప్రియురాలు అనన్యకు తెలియడంతో తన భార్యకు ఎఫైర్ ఉందని ఆమెతో కార్తీక్ బుకాయించడం.. తన భార్య ఇంటినుంచి పారిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసే డైలాగులు ట్రైలర్లో బాగా పేలాయి. పెళ్లయ్యాక ‘అచ్చేదిన్’ కోసం ఎదురుచూస్తున్నానని, భార్యతో శృంగారం బికారీ, హత్యాచారీ, బలత్కారీగా భర్త మారిపోతున్నాడంటూ కార్తీక్ చెప్పిన పంచ్ డైలాగులను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. -
కొత్త ప్రయాణం
భయం భయంగా ఓ గదిలోకి అడుగులు వేస్తున్నారు కియారా అద్వానీ. ఆ భయం వెనక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ఆమెను వెంబడిస్తున్నారట కార్తీక్ ఆర్యన్. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చిందట. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భూల్ భులయ్యా 2’. 2007లో అక్షయ్ కుమార్ నటించిన ‘భూల్ భులయ్యా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. కార్తీక్, కియారాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అన్నారు కియారా అద్వానీ. ‘భూల్ భులయ్యా 2’ చిత్రం వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. మరోవైపు హిందీ చిత్రాల (‘లక్ష్మీబాంబ్, షేర్షా, ఇందూ కీ జవానీ’) షూటింగ్‌లతో పాటు ‘గిల్టీ’ అనే వెబ్‌సిరీస్‌తో కియారా ప్రస్తుతం మస్త్ బిజీ బిజీగా ఉన్నారు.