
బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ దీపికా పదుకొనేకు అభిమానిగా చెప్పుకుంటాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిన ఓ లైవ్ షోలో కార్తిక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘మీ కాబోయే భార్య ఎలా ఉండాలి’ అని అతడిని ప్రశ్నించాడు. అందుకు కార్తిక్ .. దీపికా పదుకొనే లాంటి వ్యక్తి అయితే బాగుంటుందని సమాధానమిచ్చాడు. దానికి గల కారణాన్ని కూడా వివరించాడు. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ.. ‘దీపిక, తన భర్త రణ్‌వీర్ సింగ్‌ను తెగ ముద్దు చేస్తారు. ఈ ప్రపంచంలో దీపికకు బాగా ముద్దు వచ్చే ముఖం రణ్‌వీర్‌దే. తనలా భర్తను ముద్దు చేసే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటాను’ అన్నాడు.
ఇక దీపిక, రణ్‌వీర్ విషయానికి వస్తే.. ఆరేళ్లు ప్రేమించుకుని 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వాళ్లిద్దరూ సోషల్ మీడియా పోస్టింగులు చూస్తే.. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. బాలీవుడ్‌లో జరిగే అవార్డు కార్యక్రమాలకు, పార్టీలకు జంటగా హాజరవుతుంటారు. ప్రస్తుతం వీర్దిదరూ జంటగా ‘83’ చిత్రంలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment