ఎంత అందమైన జంట.. దిష్టి తీయండి! | Deepika Padukone Ranveer Singh Got Married | Sakshi
Sakshi News home page

వీరిద్దరికి దిష్టి తీయండి!

Published Wed, Nov 14 2018 5:19 PM | Last Updated on Wed, Nov 14 2018 5:23 PM

Deepika Padukone Ranveer Singh Got Married - Sakshi

చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ దీపికా పదుకోన్‌- రణ్‌వీర్‌ సింగ్‌ బుధవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హాలీవుడ్‌ సెలబ్రిటీల ఫేవరెట్‌ ప్లేస్‌, అత్యంత ఖరీదైన హాలీడే స్పాట్‌ ఇటలీలోని లేక్ కోమోలో రెండు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక జరుగనున్న సంగతి తెలిసిందే. బుధవారం కొంకణి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. రేపటి వేడుకలో భాగంగా సింధు సంప్రదాయ ప్రకారం మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనున్నారు. కాగా పెళ్లిలో.. వధువు దీపికా ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ఎరుపు, బంగారు వర్ణాల కలయికలో రూపొందించిన లెహంగా ధరించినట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితుల మధ్య జరుగుతున్న వీరి వివాహానికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా ఇంతవరకు విడుదల కాలేదు.


కాగా నవ దంపతులు దీపికా- రణ్‌వీర్‌లపై సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ‘ఎంత అందమైన, అద్భుతమైన జంట!! వీరిద్దరికి దిష్టి తీయండి!  ప్రియమైన దీపికా- రణ్‌వీర్‌ మీకు శుభాకాంక్షలు!! జీవిత కాలానికి సరిపడా ప్రేమ, సంతోషం మీ సొం‍తం కావాలి’ అంటూ దీప్‌వీర్‌ దంపతులకు బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ పెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు.


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement