బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. అభినందనల వెల్లువ! | Bollywood Actress deepika Padukone Blessed with Baby Girl | Sakshi
Sakshi News home page

Deepika Padukone: బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. నెట్టింట శుభాకాంక్షలు!

Published Sun, Sep 8 2024 1:30 PM | Last Updated on Sun, Sep 8 2024 3:13 PM

Bollywood Actress deepika Padukone Blessed with Baby Girl

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం సాయంత్రం ముంబయిలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రికెళ్లిన దీపికా పదుకొణెకు ఇవాళ పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా, రణ్‌వీర్‌సింగ్‌ ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. 

కాగా.. ఇటీవలే కల్కి మూవీతో అభిమానులను అలరించింది దీపికా పదుకొణె.  2018లో పెళ్లి చేసుకున్న దీపిక-,రణ్‌వీర్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. దీపికా గర్భంతో ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్‌లో మొదటి బిడ్డను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇవాళ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాగా.. మొదటిసారి రామ్ లీలా చిత్రంలో  దీపికా - రణ్‌వీర్‌ జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ అనంతరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement