
బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొణె తమ ముద్దుల కుమార్తె పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈమేరకు చిన్నారి పాదాల ఫోటోను షేర్ చేశారు. 'దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే తను. మా మనసు సంతోషంతో, ప్రేమతో ఉప్పొంగిపోతోంది' అని రాసుకొచ్చారు.
గుడ్ న్యూస్
కాగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, 83 వంటి సినిమాల్లో కలిసి నటించారు. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపిక తాను గర్భవతిని అని గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 8న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే దీపిక, రణ్‌వీర్.. సింగం అగైన్ సినిమాలో గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment