ముంబై సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్న దీపికా పదుకొణె దంపతులు | Deepika Padukone And Ranveer Singh Visit Mumbai Siddhivinayak Temple | Sakshi
Sakshi News home page

ముంబై సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్న దీపికా పదుకొణె దంపతులు

Published Fri, Sep 6 2024 6:41 PM | Last Updated on Fri, Sep 6 2024 7:03 PM

Deepika Padukone And Ranveer Singh Visit Mumbai Siddhivinayak Temple

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణే,  రణ్‌వీర్ సింగ్‌ దంపతులు ముంబైలో ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని తాజాగా దర్శించుకున్నారు. కొద్దిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్న ఈ దంపతులు వినాయకుడి ఆశీస్సులు తీసుకునేందుకు ఆలయానికి వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారిద్దరూ ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

2018లో దీపికా పదుకొణే,  రణ్‌వీర్ సింగ్‌ వివాహంతో ఒక్కటయ్యారు. అయితే,  ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.

దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ,  మొదట ప్రసవం కోసం లండన్‌కు వెళ్లనున్నారని కూడా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే ఆమె డెలివరీకి కానున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్‌లో కనిపించే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement