83 Ott Release Date In India: 83 Movie OTT Release Date Confirmed, Know Streaming Platform - Sakshi
Sakshi News home page

83 Movie : '83' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Published Thu, Jan 27 2022 8:38 PM | Last Updated on Fri, Jan 28 2022 9:04 AM

83 Movie OTT Release Date Confirmed, Know Streaming Platform - Sakshi

83 Movie OTT Release Date: 1993 ప్రపంచకప్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం '83'. క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిన ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌, ఆయన భార్య రోమి భాటియాగా దీపిక​ పదుకొణె నటించారు. గతేడాది డిసెంబర్‌ కానుకగా విడుదలైన ఈ చిత్రం​ అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయ్యింది.ఫిబ్రవరి 18నుంచి  నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుందని చిత్రయూనిట్‌ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఇక ఈ చిత్రంలో తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవా, కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement