బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ అభిమానులకు షాకిచ్చాడు. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ “రెడ్ చిల్లీస్” తెరకెక్కిస్తున్న ఓ మూవీ నుంచి ఆయన సడెన్‌గా తప్పుకున్నారు. అజయ్ బెహల్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన కత్రినా కైఫ్ నటించనుంది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల క్రితమే కార్తీక్ సైన్ చేశాడు. అయితే ఇటీవలి కాలంలో దర్శకుడు అజయ్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పేశాడు. దర్శకుడు ఇది వరకు చెప్పిన స్టోరీ లైన్‌కు, ఇప్పటి స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో కార్తీక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు గాను అడ్వాన్స్‌గా ఇచ్చిన 2 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లవ్ స్టోరీ ప్రధానంగా తెరెకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆలోపే కార్తీక్ ఆర్యన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.
గతంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దోస్తానా 2' సినిమా నుంచి అతడిని తప్పిస్తున్నట్లు కరణ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైంది. అయితే కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతో కరణ్ జోహార్ ఆ హీరోను అర్ధాంతరంగా తొలగించినట్లు బీ టౌన్ టాక్. రెండు వారాలు షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ సడన్‌గా హీరోను సైడ్ చేయడం బాలీవుడ్లో చర్చకు తెరదీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాను చేస్తున్న చిత్రం నుంచి అనూహ్యంగా వైదొలిగాడు.
చదవండి : సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు
కొరియోగ్రాఫర్ బర్త్‌డే.. అక్షయ్‌కుమార్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment