బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ 'షెహజాదా'లో నటిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ మీరోకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్ వీడియో షేర్ చేశాడు. ఇందులో అర్జున్ పాతక్ అనే అమ్మాయి ధమాకా సినిమాలోని డైలాగులను వల్లెవేసింది. డైలాగ్ చెప్పడం పూర్తవగానే ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు చేశారు. కానీ ఒక నెటిజన్ మాత్రం 'రూ.20 కోట్లిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని హీరోను అడిగింది. దీనికి కార్తీక్ ఆర్యన్ బదులిస్తూ 'సరే, ఎప్పుడు చేసుకుందాం?' అని అడగ్గా 'వచ్చేసేయ్, ఇప్పుడే చేసుకుందాం' అని రిప్లై ఇచ్చింది.
ఇది చూసిన కొందరు అమ్మాయిలు నేనూ ఇస్తా 20 కోట్ల రూపాయలు, నన్ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్లతో హీరో వెంటపడ్డారు. దీంతో కార్తీక్ ఆర్యన్ 'వేలంపాట వేద్దామా?' అని సరదాగా చమత్కరించాడు. కాగా కార్తీక్ ఆర్యన్ చివరిసారిగా 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గతేడాది రిలీజైంది. ప్రస్తుతం అతడు నటించిన 'షెహజాదా' నవంబర్ 4న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే 'భూల్ భులాయా 2', 'ఫ్రెడ్డీ' సినిమాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment