
షేర్వాణీ ధరించిన కార్తీక్ ఏడడుగులు వేస్తూ ఎమోషనలయ్యాడు.
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లి చేసుకున్నాడు. కియారా అద్వానీతో ఏడడుగులు నడిచాడు. అదేంటి, కియారాకు ఆల్‌రెడీ పెళ్లైపోయింది కదా అనుకునేరు.. అయినా సరే వీరి పెళ్లి జరిగింది. కాకపోతే రీల్ లైఫ్‌లో! కార్తీక్, కియారా జంటగా నటిస్తున్న చిత్రం సత్యప్రేమ్ కీ కథ. ప్రస్తుతం వీరు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సన్నివేశాన్ని మేకర్స్ షూట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో లీకవగా వైరల్‌గా మారింది. ఇందులో షేర్వాణీ ధరించిన కార్తీక్ ఎమోషనలవుతుండగా.. కియారా కూడా హీరోకు మ్యాచ్ అయ్యే లెహంగా వేసుకుని, దానికి ఎర్ర దుపట్టా జోడించి రాయల్‌గా కనిపించింది.
ఈ సినిమాకు సమీర్ విద్వాంస్ దర్శకత్వం వహించాడు. మొదట ఈ చిత్రానికి సత్యనారాయణ్ కీ కథ అని టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమవడంతో సత్యప్రేమ్ కీ కథగా మార్చారు. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. ఆనంది గోపాల్ అనే మరాఠీ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న సమీర్ ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ఇటీవల అతడు షెహజాదా(అల వైకుంఠపురములో)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఇది జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో నిర్మాతగా మారిన కార్తీక్‌కు షెహజాదా బోలెడంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. మరోవైపు కియారా అద్వాణీ ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె చివరగా గోవిందా నామ్ మేరా సినిమాతో మెప్పించింది.
Leaked video of @TheAaryanKartik & @advani_kiara from their upcoming movie Satyaprem Ki Katha is going viral !!#kartikaaryan #kartik #kiaraadvani #kiara #kiaraaliaadvani pic.twitter.com/j9eFi1VNJi
— Glamour Flash Entertainment (@GlamourFlashEnt) March 29, 2023