కాస్కోండి మూడోసారి కూడా ఈ సినిమాతో భయపెట్టడం గ్యారెంటీ | Bhool Bhulaiyaa 3 Coming Soon | Sakshi

కాస్కోండి మూడోసారి కూడా ఈ సినిమాతో భయపెట్టడం గ్యారెంటీ

Mar 10 2024 9:17 AM | Updated on Mar 10 2024 10:39 AM

Bhool Bhulaiyaa 3 Coming Soon - Sakshi

హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘భూల్ భులయ్యా’. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో భాగంగా రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ భారీ విజయాన్ని అందుకోవడంతో  సీక్వెల్‌తో ఆ సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు మేకర్స్‌. సౌత్‌ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న 'చంద్రముఖి' సినిమాకు రీమేక్‌ వెర్షన్‌గా బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన సినిమా 'భూల్‌ భులయ్యా'. 2007లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

'చంద్రముఖి' డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. దీంతో సుమారు 15 ఏళ్ల తర్వాత అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో 'భూల్‌ భులయ్యా 2' విడుదలైంది. 2022లో వచ్చిన ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అడ్వాణీ, టబు నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది.

ఈ ప్రాంచైజీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు రావడంతో మూడో ప్రయత్నానికి ముహూర్తం కుదిరింది. ఇందులో కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నాడు. మాధురీ దీక్షిత్‌, విద్యాబాలన్‌ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సెట్స్‌కు చేరకముందే దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 'భూల్‌ భులయ్యా 3' నవంబర్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement