
సాధారణంగా హీరోయిన్లు.. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి-పిల్లల విషయంలో కాస్త ప్లానింగ్ తోనే ఉంటారు. కియారా అడ్వాణీ కూడా బహుశా ప్లానింగ్ తోనే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ఆ మూవీ టీమ్ కి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏంటా సంగతి?
హీరోయిన్ కియారా అడ్వాణీ.. రెండు రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది. ఇది జరిగి రోజైన కాలేదు అప్పుడే షూటింగ్ కి కూడా హాజరైంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో 'వార్ 2'లో ఒకటి. ఇదివరకే ఈమె పార్ట్ షూటింగ్ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్'లోనూ ఈమెనే హీరోయిన్.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)
తాజాగా కియారా అడ్వాణీ ప్రెగ్నెంట్ అని బయటపెట్టడంతో మూవీ టీమ్ కి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఈమెకు బేబీ బంప్ కనిపించేలోపు కియారా పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేసుకోవాలి. లేదంటే తర్వాత సినిమా లేట్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ ఒకటి రెండు నెలల్లో 'టాక్సిక్'లో కియారా పార్ట్ పూర్తవుతుంది. తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటారని తెలుస్తోంది.
గతంలో 'కల్కి' షూటింగ్ జరుగుతున్న టైంలో దీపికా పదుకొణెకి కూడా ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ అంతా పూర్తి చేసింది. తర్వాత ప్రమోషన్లలో మాత్రం కనిపించడం కుదరలేదు. దీపికలా ప్లానింగ్ తో చేసేసుకుంటే కియారాకి ఇబ్బందేం ఉండకపోవచ్చు. లేదంటే మాత్రం 'టాక్సిక్'కి తిప్పలు తప్పవు.
(ఇదీ చదవండి: బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?)
Comments
Please login to add a commentAdd a comment