‘పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం’ | Kartik Aaryan Says Lockdown is the Best Time to Get Married | Sakshi
Sakshi News home page

పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ‍యువ నటుడు

Published Mon, Jul 13 2020 1:09 PM | Last Updated on Mon, Jul 13 2020 2:08 PM

Kartik Aaryan Says Lockdown is the Best Time to Get Married - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తితో అన్ని రంగాలకు బ్రేక్‌ పడింది. ముఖ్యంగా సినీ పరిశ్రమ పూర్తిగా షట్‌డౌన్‌ అయ్యింది. లాక్‌డౌన్‌తో షూటింగ్‌లకు బ్రేక్‌ దొరికింది. దాంతో నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు సినీ జనాలు. అలానే ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విషయాల గురించి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ ట్విట్టర్‌ వేదికగా ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ట్విట్టర్‌ యూజర్‌ ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అని కార్తిక్‌ను అడిగాడు. అందుకు ఈ యువ హీరో ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం. పెద్దగా ఖర్చు కాదు’ అని సమాధానమిచ్చాడు కార్తిక్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. (‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’)

మరో వ్యక్తి ‘లాక్‌డౌన్‌ కాలంలో మీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంట వాస్తవమేనా’ అని ప్రశ్నించాడు. అందుకు కార్తిక్‌ ‘ఇది ఇలాగే కొనసాగితే.. లాక్‌డౌన్‌ కాలంలోనే నాకు ఓ బిడ్డ పుట్టిందనే వార్తలు కూడా వస్తాయి’ అంటూ వెటకారంగా స్పందించాడు‌. మరొకరు ‘సార్‌ ఒక్క రోజు కోసం మీ నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ చెప్పండి ప్లీజ్‌ అని అభ్యర్థించాడు. అందుకు కార్తిక్‌​ ‘రీచార్జ్‌ చేయించాల్సి ఉంటుంది’ అని తెలిపాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement