యంగ్ హీరో కారుకు ఫైన్.. ఎందుకంటే? | Kartik Aaryan gets fined outside Siddhivinayak temple Of His Car Parking | Sakshi
Sakshi News home page

హీరో కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

Published Sat, Feb 18 2023 7:30 PM | Last Updated on Sat, Feb 18 2023 7:58 PM

Kartik Aaryan gets fined outside Siddhivinayak temple Of His Car Parking - Sakshi

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ముంబయి పోలీసులు ఫైన్ వేశారు. ఆయన కారును రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్ చేశారంటూ ముంబయి పోలీసులు చలానా విధించారు. ఈ విషయాన్ని ముంబయి ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే కారు పార్కింగ్‌ చేసేటప్పడు కార్తీక్ కారు నడపలేదని తెలుస్తోంది. ఇవాళ ముంబయిలోని సిద్ధి వినాయకస్వామి దేవాలయాన్ని సందర్శించగా ఈ సంఘటన జరిగింది.

ఈ క్రమంలోనే సిద్ధివినాయక ఆలయం వెలుపల పార్క్ చేసిన కార్తీక్ ఆర్యన్ కారుకు పోలీసులు జరిమానా విధించారు. ముంబయి పోలీసు సిబ్బంది చలాన్ జారీ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ట్రాఫిక్ పోలీసులు  కార్తీక్ కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేసిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అతని సినిా డైలాగ్స్‌లోని రెండు సినిమాలను ప్రస్తావించారు. ట్విటర్‌లో రాస్తూ..'కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేయబడి ఉంది. షెహజాదా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించగలడని భావించొద్దు.' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. 

కాగా.. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో షెహజాదా పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి సనన్, రోనిత్ రాయ్, మనీషా కొయిరాలా, సన్నీ హిందూజా నటించారు. ఆ తర్వాత సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. అనురాగ్ బసుతో ఆషికీ 3, కెప్టెన్ ఇండియా, కబీర్ ఖాన్ చిత్రాల్లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement