తల్లిదండ్రులిద్దరూ డాక్టర్స్.. వారి కోరిక మేరకు సైన్స్ చదివాడు కార్తీక్ ఆర్యన్. కానీ మనసు యాక్టింగ్ వైపు పరుగులు తీస్తుండటంతో క్లాసులు ఎగ్గొట్టి మరీ ఆడిషన్స్‌కు వెళ్లేవాడు. అలా మోడలింగ్‌లోనూ అడుగుపెట్టాడు. తొలి సినిమాకు సంతకం చేశాక ఇంట్లో చెప్పి ఒప్పించాడు. అలా ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు.
ఓటీటీలోకి వచ్చేసిన బయోపిక్
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయన ఈ ఏడాది చందు ఛాంపియన్ సినిమాతో అలరించాడు. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
రెంట్ పద్ధతిలో..
అమెజాన్ ప్రైమ్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడప్పుడే ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. రూ.199 చెల్లించి రెంట్ పద్ధతిలో చూసేయొచ్చు. ఈ మూవీలో మనసును మెలిపెట్టే సీన్స్ చాలానే ఉన్నాయట! ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను ఉచితంగానే చూడాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే!
#ChanduChampion now available on Amazon Prime ❤️ #KartikAaryan https://t.co/qLfCy75KVm pic.twitter.com/DqtfsuxtVB
— Chiji 🐣 (@StanningKartik) July 25, 2024
చదవండి: ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్
Comments
Please login to add a commentAdd a comment