ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Praises Jr NTR In A Recent Interview, Says He Can Dance Very Fast With Full Energy | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్‌

Published Fri, Jul 26 2024 8:39 AM | Last Updated on Fri, Jul 26 2024 12:36 PM

Janhvi Kapoor Praises Jr Ntr

తెలుగువారి పనితీరు అంటే తనకు చాలా ఇష్టం అంటోంది బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్‌. ‘దేవర’ చిత్రంలో టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది జాన్వీ. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇటీవల ఎన్టీఆర్‌, జాన్వీలతో ఓ పాటను చిత్రీకరించారు. అందులో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌తో ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించింది జాన్వీ కపూర్‌. తన తాజా చిత్రం ‘ఉలజ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన జాన్వీ ‘ఎన్టీఆర్‌’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

‘టాలీవుడ్‌లో తొలి సినిమానే ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. సెట్‌లోకి వస్తే అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఇటీవల మా ఇద్దరిపై ఓ పాటను చిత్రీకరించారు. ఎన్టీఆర్‌ డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఆయన వేసే స్టెప్పులు చూసి ఆశ్చర్యపోయాను. ఏదైనా నేర్చుకోవడానికి ఎన్టీఆర్‌కి ఒక సెకను చాలు. అదే విషయాన్ని నేను నేర్చుకోవాలంటే కనీసం 10 రోజుల సమయం పడుతుంది(నవ్వుతూ..). ప్రస్తుతం దేవరలోని రెండో పాట కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నా. తెలుగువారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. వారు కళను, సినిమాను గౌరవిస్తారు. హుందాగా ప్రవర్తిస్తారు’ అని జాన్వీ చెప్పుకొచ్చింది.

జాన్వీ తాజాగా నటించిన ‘ఉలజ్‌’ చిత్రం విడుదలకు రెడీ అయింది. సుధాంశు సరియా  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిణిగా కనిపించనున్నారు. ఆగస్ట్‌ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement